ఆ నవ్వుల “నజరానా”లు ఉండవు కితకితల “రాగాలు” వినిపింవవు హాస్యపు “జల్లులు” ముంచెత్తవు ఆ ఆనందాలు ఇక వెల్లివిరియవు వేణు మాధవ నటనా హేళా కనుమరుగైన వేళా... | గుండెలు చెరువులైనయ్ గొంతులు మూగబోయినయ్ చిత్రసీమలు చిన్నబోయినయ్ తెలుగునాట విషాద మేఘాలు కమ్ముకున్నయ్ ఆ మాట సంతోషాల తోట ఆ నటన వేడుకల ఊట ఆ నడక ఆత్మవిశ్వాసాల బాట ఆ నడత మానవత్వపు మూట నల్లబాలుగా “నాకి” చంపినా... రౌడీలకు “కన్నీళ్లు” తెప్పించినా... శకుంతలక్కతో “చావు” దెబ్బలు తిన్నా... ఏ పాత్రలో ఒదిగి ఎదిగి జీవించినా.... ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులే... కళ్ళెంట ఆనంద బాష్పలే .... ఆ హాస్య “తార” నింగికేగుతూ తరాలకు సరిపడా వాడని సంతోషాల "పూదోట"ను చెదరని హాస్య “ముద్ర”లను మిగిల్చి వెళ్ళింది నవ్వుల “నట” కోవిదుడు “వేణు మాధవ్”.కు అశ్రు నీరాజనం (హాస్య నటుడు వేణుమాధవ్ నిష్క్రమణకు అక్షర నివాళులు అర్పిస్తూ..)
కోడిగూటి తిరుపతి 9573929493