సర్వభక్షకి.. పొగాకు!

పొగాకులో పొగ మాత్రమే కాదు. ఆక్సిడెంట్లు, ఫ్రీరాడికల్స్, కార్సినోజెన్స్ వంటి అనేక పదార్థాలు ఉంటాయి. ఈ పదార్థాలన్నీ ఆరోగ్యం మీద నేరుగా శాశ్వతమైన ప్రభావాన్ని చూపుతాయి. పొగ ప్రభావం శరీరంలోని ప్రతీ అవయవం మీద ఉంటుంది. కళ్లు, ముక్కు, గొంతు మొదటి దమ్ము పీల్చుకున్న కొద్ది సెకన్లలోపునే, హానికరమైన వాయువులు కళ్లు, ముక్కు గొంతు లాంటి సున్నితమైన పొరల మీద ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ముక్కు కళ్ల నుంచి నీరు కారడం, గొంతు నొప్పిగా ఉంటుంది. అయినా పొగ తాగడం కొనసాగిస్తే పొగలోని విష వాయువుల వల్ల కఫం ఏర్పడుతుంది. నిరంతరం పొగతాగడంతో, గొంతులోని పొర అనూహ్యమైన విధంగా మందంగా తయారవుతుంది. దీని మూలంగా గొంతు క్యాన్సర్లో కనిపించే కణాల మార్పు కనిపిస్తుంది. గుండె పొగ ఊపిరితిత్తులకు చేరగానే గుండెకు శ్రమ పెరుగుతుంది. నిమిషానికి 10 నుంచి 25 స్పందనలు ఎక్కువగా చెయ్యాల్సి ఉంటుంది. పొగాకు పొగలో ఉండే నికోటిన్, ఇతర హాని కారక రసాయనాల మూలంగా హృదయ స్పందన క్రమరహితమవుతుంది. రక్తనాళాలు పొగతాగడం వల్ల రక్తపోటు మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. పొగతాగిన ప్రతిసారి 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. అందువల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పెరిగి గుండెపోటు, పక్షవాత ప్రమాదం పెరుగుతుంది. పెరీ ఫెరల్ వాస్కులార్ వ్యాధి రావడానికి పొగతాగడం అనేది అత్యంత ముఖ్యమైన కారణం. కార్బన్ మోనాక్సైడ్ వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యాలలో ఒకటి. అయితే ఇది అంతకు 600 రెట్లు ఎక్కువ గాఢతతో పొగాకు పొగలో ఉంటుంది. పొగతాగని వారితో పోల్చినపుడు, పొగతాగేవారి రక్తంలో నాలుగు నుంచి పదిహేను రెట్లు ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉంటుంది. పొగతాగిన కొన్ని గంటల వరకు రక్తంలో ఉంటుంది. పొగపీల్చిన కొన్ని సెకన్లలోనే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో చేరుతుంది. ఇది ఎర్రరక్త కణాల నుంచి ఆక్సిజన్ కణాలను తొలగిస్తుంది. దీనివల్ల గుండె పోటు, పక్షవాత ప్రమాద స్థాయి పెరుగుతుంది. ఊపిరితిత్తులు పొగతాగడం వల్ల సహజంగా ఊపిరితిత్తుల పని సామర్థ్యం తగ్గిపోతుంది. శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గి శ్వాసల సంఖ్య పెరుగుతుంది. అందువల్ల ఊపిరితిత్తులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. పొగలో ఉండే విషరసాయనాల మూలంగా ఊపిరితిత్తుల కణాలకు హాని జరుగుతుంది. దీని వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరిగి దగ్గు ఎక్కువవుతుంది. శ్లేష్మం పెరగడం వల్ల శరీరం సూక్ష్మజీవుల పెరుగుదలకు అనువుగా మారుతుంది. తద్వారా చలిజ్వరం, ఫ్లూ, బ్రాంకైటిస్, ఇతర శ్వాస సంబంధిత అంటువ్యాధుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. చర్మం పొగతాగడం వల్ల చర్మంలోని రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఆ విధంగా శరీరంలోని అతి పెద్ద అవయవానికి ప్రాణాన్ని సమకూర్చే ఆక్సీజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనికి తోడుగా హానికారక సూర్యకిరణాలు వయసుకు ముందే ముడతలు పడేలా చేస్తాయి.