హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో ప్రవేశపెడుతున్నారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను నేడు ప్రవేశపెడుతున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ ఇవి.. (చదవండి: నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్)
తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్
• praja palana