ఈ మధ్య కాలవ్యవధి వారిని కులాలు ఉండాలా వద్దా అని ప్రశ్నించి తప్పకుండా ఉండాలి చెప్పటం ఆ వీడియోలో మనం చూస్తున్నాం ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్వాములకు దేశం ఇంకా పాత కాలంలో రాజులు మునులు ,రాక్షసులు లాంటి పరిస్థితుల్లోనే స్వతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత కూడా దేశం అలాగే ఉంది అన్న భావనతో ప్రతిదానికి ఏవో రెండు సంస్కృత శ్లోకాలు చదవటం ఎందు శ్లోకాలు చదవటం ఎందుకంటే వాటి అర్థం ఎవరికి అర్థం కాదు ఎవరికి తెలియదువాళ్ళకు తోచింది చెప్పటం ఈమధ్యకాలంలో ఇది ఎక్కువ అయి పోయింది. ఇలాంటివి మన రాష్ట్రం మొత్తం మీద అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా మంది ఇలాంటి ప్రవచనాలే చేస్తున్నారు అయిన ఎవరు దీని మీద మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు కారణం మన రెండు రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు ఈ స్వాములను తరచు కలుస్తూ అత్యంత గౌరవంగా చూస్తున్నారు కనుక స్వాములు తాము ఏమి చెప్పినా కూడా అదే న్యాయం అదే సంస్కారమ్ అదే మన సంస్కృతి సాంప్రదా యం అని అడ్డగోలుగా రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడటం అయిన వాళ్ళను ఎవరు నియంత్రించలేక పోవడం తో ఇవి ఎక్కువ అయినాయి .కానీ వాళ్లను నియంత్రించే శక్తి ప్రజలకు ఉండకపోవచ్చు అన్న భావనతో అలాగే నడుస్తుంది ,ఎవరు మనలను ప్రశ్నిచ లేరు అన్న భావనా అంతా మంచిది కాదు ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమైన హక్కు అర్హత కలిగి ఉంటారని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం నిషేధింపబడిన, ఆర్టికల్ 19(1)(జి) రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎవరికి కావలసిన పనులు వృత్తులు రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎవరికి కావలసిన పనులు వృత్తులు చేసుకోవచ్చు అని స్పష్టంగా చెపుతూ ఈ దేశ పౌరుడు ఏ ప్రాంతంలోనైనా ఈ దేశంలో నివసించడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు అని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నప్పటికి స్వాములు ఇలాంటి ప్రవచనాలు రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నప్పటికీ స్వాములు ఇలాంటి ప్రవచనాలు చేస్తూ భక్తులను ప్రజలను తప్పుదోవ పట్టించి ఇంకా మీరు పాటించండి అని చెప్పటం ఒక విధంగా చెప్పాలంటే చట్ట వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ వ్యతిరేకమని దాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా స్వామిని మనం అడగదలుచుకున్నాము అది ఏమిటంటే ఆయన నాలుగు వేదాలలో పండితుడు 108 పురాణాలు ఎన్నో కథలు కథలు అన్ని విషయా కథా కమామీషు జీయర్ స్వామి ప్రవచనాలు కు సంబందించిన ఒక వీడియో వినతంగా సర్క్యులేషన్ లో ఉండటం దాన్ని చాలమంది. చూడటం కూడా జరిగింది. అది బహుశా ఆయన ఆశ్రమంలో జరిగిన మీటింగులో ప్రవచనాలుగా మనము గమనించాల్సి ఉంటుంది ఆయన ఆశ్రమంలో జరిగిన మీటింగులో భక్తులనుద్దేశించి చేసిన ప్రవచనాలుగా మనము గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ వీడియోలో ప్రాంతము తేదీ లాంటి వివరాలు ఇవ్వలేదు. కనుక మనం అలా అనుకోక తప్పదు ఈయన భక్తులకు బోధిస్తున్నది . విజ్ఞానమా లేక అజ్ఞానాన్ని బోధిస్తున్నాడో ఆ వీడియో చూసిన వాళ్లకు అర్థం కావటం లేదు ఎందుకంటే చిన్న జీయర్ స్వామి ఈ మధ్యకాలంలో దకాలంలో కెసిఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో అత్యంత గౌరవ ప్రధానమైన పండితుడిగా, పురోహితుడిగా ఆయన వెలుగులో ఉన్న సంగతి అందరికి తెలిసిందే కానీ ఆయన చేసిన ప్రవచనాలు ప్రసంగం చూస్తుంటే ఈయన ఈ దేశం బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొంది 70 సంవత్సరాల తర్వాత కూడా పాత కాలంలో వేదకాలం లేక ఇంకేదో అర్థం కాని కాలంలో ఉన్న పరిస్థితులను ఇంకా మీరు కొనసాగించండి అది చాలా మంచి పనులు అని చెప్పటం చూస్తుంటే ఇది చాలా విచారించాల్సి న విషయంగా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే స్వామి గారికి కులాలు యధాతధంగా ఉండాలట ఎందుకంటే ఎవరి పనులు వాళ్లు చేసుకోవటం లో తప్పులేదు అని దానికి ఆయన ఉదాహరణగా శరీర భాగాలను పోలుస్తూ మన శరీరంలో ఉన్న రకరకాల అవయవాలు వాటి వాటి పనులు ఎలా చేస్తున్నాయి ఉదాహరణకు కన్ను ,ముక్కు ,చెవులు ,చేతులు ,కాళ్లు ఇలా అవి వాటి వాటి పనులు నిర్దేశించిన పనులు ఎలా చేస్తున్నాయి ఈ కులాలు కూడా వాళ్లకు నిర్ణయించిన పనులను ఉండాల్సిందే చేయాల్సిందే అనేది ఆ ప్రసంగ సారాంశం . | ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కులాలు ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు వాళ్ల వాళ్ల కులవృత్తులను వాళ్ళు చేస్తూనే ఉండాలి అలాగే ఉండాల్సింది అది న్యాయం ధర్మం అని చెబుతూ కులరహిత సమాజం అనేది అరం లేని మాట అది ఎలా సాధ్యం దేశంలో ప్రజలంతా సమానం. ఎలా అవుతారు అని పిట్టకథలు చెప్తూ ఆయన ప్రవచనాలు వింటున్నఇతిహాసంలో వేదాలలో , గీతలో లేని కులం ఇప్పుడు ఎలా వచ్చింది అన్న ది ముందు ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే స్వాములు చెప్పినట్లుగా భగవద్గీత 04:13 లో చతుర్వర్ణాలు తానే సృష్టించనని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా ఇది పెద్దలు వేరే చోట ప్రవచనాల్లో చెప్పడం జరిగింది అలాగే ఇదే ప్రస్తావన ఋగ్వేదంలోని పురుషసూక్తం లో ఉన్నట్లుగా ఇదే పండితులు అప్పుడప్పుడు చెప్పడం కూడా మనము వింటున్నము అంటే కేవలం నాలుగు వర్గాలు మాత్రమే శాస్త్ర సమ్మతంగా ఉన్నప్పుడు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మాత్రమే శాస్త్రబద్ధంగా అమల్లో ఉండాల్సిన ఈ దేశంలో వందల వేల కులాలు ఎలా పుట్టుకొచ్చాయి. దీని వెనక ఎవరి హస్తము ఉంది ఎవరు దీనికి బాధ్యులు అన్న విషయం కూడా చిన్న జీయర్ స్వామి ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది శాస్త్రాలలో ప్రస్తావించని కులాలను ఇలాంటి పండితులు స్వాములు ఎలా ఇంకా ఇంకా మీరు వాటిని పాటించండి అమలు చేయండి అందులో ఎలాంటి తప్పు లేదు ఈ దేశంలో సర్వమానవ సమానత్వం సర్వ కులాల సమానత్వం అనేది సాధ్యం కాదు కుల రహిత సమాజం అసలు సాధ్యం కాదు అని అడ్డగోలుగా ప్రవచనాలు చెప్పటం,దీనిమీద ప్రభుత్వాలు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది లేకుంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు గడిచినా ఇలాంటి ప్రవచనాలు ప్రజల మనసును రాజ్యాంగం మీద కాకుండా వీళ్ళ ప్రవచనల మీదనే నడుస్తూ పోక మరేమవుతుందో పాల కులు ఆలోచించాలి ఇలా ఆలోచించాలి ఇలాంటి పెద్ద పెద్ద మత ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏ మతస్తులయిన అది హిందూ , ముస్లిం మస్జిద్ కావచ్చు. క్రిస్టియన్ చర్చి కావచ్చు వాళ్ళ ప్రవచనాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. దానికి వ్యతి రేకంగా చేస్తూ పో రేకంగా చేస్తూ పోతే ఇంకా చట్టాలు దేనికి కనుక ప్రభుత్వం దీని గురించి లోతుగా పరిశీలించి తగు విధంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చేయక పోతే దేశము ముందుకు కాదు వెనక్కు పోతుందని హెచ్చరిస్తున్నాను .ఇది అన్ని మతాల ప్రచారకులకు సమానంగా వర్తిస్తుందని పాఠకులు ప్రభుత్వం గమనించాలి. కమామీషు
-నేరెళ్ళ కోటేశ్వరరావు