2008 కన్నా పెద్ద ఆర్థిక సంక్షోభమిది

 భారీగా తగ్గిన వినియోగం, పెట్టుబడులు గత ఏడాది జనవరి నుంచే కష్టాలు మొదలు: గోల్డ్మన్ శాక్స్ వెల్లడి ముంబయి-ప్రజాపాలన: ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం.. 2008లో ఎదురైన సంక్షోభం కంటే పెద్దదని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ పేర్కొందిఅంతర్జాతీ య మందగమనానికి తోడు దేశీయంగా వినియోగం, పెట్టుబడులు నీరసించడం ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫసీసంక్షోభంతోనే దేశీయంగా వినియోగం మందగించిందన్న వాదనను ఆ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త ప్రచీ మిశ్రా తోసిపుచ్చారు. అసలు ఈ రెండింటి మధ్య ఎలాంటి సంబంధం లేదన్నారు. గత ఏడాది సెప్టెంబరులో ఐఎల్ అండ్ ఎస్ఎస్ దివాలా తీసినప్పటి నుంచి ఎన్ బీఎఫసీలు తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. దీంతో ఈ రంగం నుంచి రుణ వితరణ తగ్గి, వినియోగం పడిపోయిందని ఇప్పటికే కొంతమంది ఆర్థికవేత్తలు చెప్పారు. గత ఏడాది జనవరి నుంచే దేశీయ వినియోగం పడిపోతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వినియోగమే అసలు సమస్య.. పెట్టుబడులు, ఎగుమతులు ఎప్పటి నుంచో నేలచూపులు చూస్తున్నాయి. ఈ రెండింటితో పోలిస్తే దేశీయ వినియోగం క్షీణించడమే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీస్తోందని మిశ్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గత ఆరేళ్లలో జీడీపీ వృద్ధి రేటు ఎన్నడూ ఇంత కనిష్ఠ స్థాయికి తగ్గలేదు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది మూడు శాతం తక్కువ. ఇందులో రెండు శాతం తగ్గుదలకు దేశీయ వినియోగం నీరసించడమేనని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిధుల కొరత కూడా మందగమనానికి తోడయ్యాయన్నారు. నోట్ల రద్దుతో పోల్చకూడదు.. పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఇలాంటి గడ్డు పరిస్థితినే ఎదుర్కొంది. ఆ దెబ్బతో అసంఘటిత రం గంలోని చిన్నాచితక పరిశ్రమలు, వ్యాపారాలు కుప్పకూలాయి. బ్యాంకుల్లో డబ్బులున్నా ఏమీ కొనలేని పరిస్థితి. దాంతో వినియోగం బాగా పడిపోయింది. అది తాత్కాలిక పరిస్థితి. ప్రస్తుత వినియోగ పరిస్థితిని నోట్ల రద్దు నాటి పరిస్థితితో పోల్చకూడదన్నారు. ప్రస్తుత ఆర్థిక పతనానికి 40 శాతం అంతర్జాతీయ మందగమనం,30 శాతం దేశీయ వినియోగం తగ్గిపోవటమే కారణమన్నారు. భయపెడుతున్న అంశాలు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం,వృద్ధికి దోహదం చేయలేకపోతున్న ద్రవ్యవిధానాలు,రుణ పత్రాల మార్కెట్లో గాలి బుడగలా పొంచి ఉన్న దివాలా' ప్రమాదం, పడిపోతున్న పరపతి వృద్ధి రేటు అమెరికా ఆర్థిక వ్యవస్థ 'మాంద్యం'లోకి వెళుతుందనే ఆందోళన, ఉత్పత్తి వృద్ధి రేటును సూచించే పీఎంఐ సూచీ పడిపోవడం,వెంటాడుతున్న 'మాంద్య భయం మరోవైపు అంతర్జాతీయంగా ఫండ్ మేనేజర్లను ఆర్థిక 'మాంద్యం' భయం వెంటాడుతోంది. దీంతో వీరిలో ఎక్కువ మంది పెట్టుడులు తగ్గించి నగదు నిల్వలు పెంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 62,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.44.02 లక్షల కోట్లు) పెట్టుబడులు నిర్వహిస్తున్న 230 మంది ఫండ్ మేనేజర్లను సర్వే చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ (బోఫా ఎంఎల్) ఈ విషయం తెలిపింది. గత పదేళ్లలో ఫండ్ మేనేజర్ల దగ్గర సగటున 4.6 శాతంగా ఉన్న నగదు నిల్వలు ఈ సంవత్సరం అక్టోబరులో 5 శాతానికి చేరాయి.


ఆదాయ పన్నులో భారీ ఊరట?


ఆదాయ పన్నులో భారీ ఊరట? న్యూదిల్లీ-ప్రజాపాలన: దేశాన్ని గడగడలాడిస్తున్న ఆర్థిక మందగమనం నుంచి గట్టెక్కేందుకు ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోం దా? ఆదాయ పన్ను శ్లాబులను తగ్గించ డం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెం చేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి. ఆర్థిక శాఖ వర్గాలు. ఉద్యోగుల వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులను భారీ గా తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ర్న్, 21్న, 30్నగా ఉన్న పన్ను శ్లాబులను 5%, 10%, 20 శాతానికే పరిమితం చేసేలా కేంద్రం పరిశీలిస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. మోదీ సర్కారు తదుపరి అజెండా కూడా ఇదేనని అంటున్నాయి. ఈ మేరకు 'వ్యక్తిగత ఆదాయ పన్ను'పై అధ్యయనం కోసం ఏర్పాటైన టాస్క్ఫోర్స్ అన్ని కోణాల్లోనూ పరిశీలించిన అనంతరం ఈ ఏడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. ప్రస్తుత పన్ను రేట్లను తగ్గించడంతో పాటు శ్లాబులను హేతుబద్దం చేయాలని టాస్క్ఫోర్స్ సూచించింది. అయితే, శ్లాబులను తగ్గించడం ద్వారా కేంద్రానికి సుమారు రూ. 1.75 లక్షల కోట్ల మేరకు ఆదాయం తగ్గిపోనుందని సమాచారం. ఈ మొత్తం నష్టాన్ని కేంద్రమే భరించకుండా 58:42 పద్దతిలో రాష్ట్రాలకు కూడా పన్ను ఆదాయంలో కోత పెడుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రాలకు రూ.75 వేల కోట్ల పన్ను ఆదాయం తగ్గిపోనుంది. ఇదిలా ఉంటే, వ్యక్తిగత పన్ను శ్లాబుల తగ్గింపు విషయంపై ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దే బరాయ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చే శారు. “కార్పొరేట్ పన్నును 25 శాతానికి తగ్గించిన నేపథ్యంలో వ్యక్తిగ త పన్నును తగ్గించేందుకు త్వ రలోనే చర్యలు తీసుకోవడం ఖాయం” అని వివేక్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక శాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. మరోపక్క పన్ను శ్లాబుల తగ్గింపు అనేది అసాధ్యమేమీ కాదని, బడ్జెట్ అవసరాలు, ద్రవ్యలోటు, ఆదాయ పరిస్థితిని అధ్యయనం చేశాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే చెప్పారు. ఆదాయ పన్ను తగ్గడం ద్వారా వినియోగదారుల వద్ద నగదు నిల్వలు పెరిగి, తద్వారా మార్కెట్లు పుంజుకుంటాయని పాండే వివరించారు. కాగా, పన్ను రేట్ల తగ్గింపు ప్రతిపాదనను నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ స్వాగతించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఈ నిర్ణయం అత్యావశ్యకంగా పేర్కొన్నారు.