మార్పు నిత్యం మార్పు సత్యం అన్న సార్వకాలిక వాస్తవం ఊహాతీత వేగంతో అనుక్షణం రుజువవుతున్న రోజులివి. కృత్రిమ మేధతో అద్భుతాలు ఆవిష్కరించేలా మరమనుషు(రోబోలు)లే నయా కార్మిక శక్తిగా రూపాంతరం చెందే నాలుగో పారిశ్రామిక కర్మాగారాల విప్లవం కనుచూపు మేరలో పొడగడుతున్న వేళ దావోలో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు వచ్చేవారం జరగనుంది. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి, తయారీ విలువ జోడింపులో ఎకాయెకి 96 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న నూరు దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఎంపికచేసి, భవిష్యత్తులో తయారీ రంగం సవాళ్లకు అవి ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయో ఆర్థిక వేదిక అధ్యయనం చేసింది. సమీప భవిష్యత్తులో సాంకేతిక ఆవిష్కరణలతో తయారీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే పటిష్ఠ యంత్రాంగంతో జపాన్ శతాబ్ది మొట్టమొదటిస్థానంలో నిలువగా- దక్షిణ కొరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, చైనాలు వరసగా తరవాతి స్థానాలు ఆక్రమించాయి. భారత్ 30వ స్థానంలో ఉందన్న నివేదిక - తక్కిన 'బ్రిక్స్' దేశాలైన రష్యా 35, బ్రెజిల్ 41, దక్షిణాఫ్రికా 45వ స్థానాల్లో నిలిచాయంటోంది. ఆయా దేశాల అధునిక పారిశ్రామిక వ్యూహాల అభివృద్ధిని అధ్యయనం చేసి వంద దేశాల్ని - ముందువరసలోనివి, గట్టి సామర్థ్యంగలవి, వారసత్వ పునాదులున్నవి, కొత్తగా కాలూనుతున్నవి అంటూ నాలుగు విభాగాలుగా నివేదిక వర్గీకరించింది. ప్రస్తుతం గట్టి పునాదులు ఉండి భవిష్యత్తులో సవాళ్లు తప్పవంటున్న మూడో విభాగంలో ఇండియాతోపాటు మెక్సికో, ఫిలిప్పీన్స్, రష్యాలూ కొలువుతీరాయి. ముందువరసలో ఉన్న | పాతిక దేశాలూ ఎలాంటి మార్పులకైనా సంసిద్ధంగా ఉన్న తయారీ వ్యవస్థలతో భారీ లబ్ధి ఒడిసిపట్టడానికి కాచుకొని ఉన్నాయని నివేదిక స్పష్టీకరిస్తోంది. నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని అందిపుచ్చుకొని తయారీ రంగాన్ని రూపాంతరీకరించగలిగే జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉంటే, ఇండియా 44వ స్థానంతో సరిపెట్టుకొంది. 'భారత్ లో తయారీ' నిమిత్తం భారీ పెట్టుబడుల్ని రాబట్టుకోవడానికి దావోస్ పయనం కట్టే మోదీ ప్రభుత్వ యంత్రాంగం తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన అధ్యయనమిది! ప్రపంచ ఆర్థిక వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడి మాటల్లో నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే- మన జీవన విధానాన్ని, పని పరిస్థితుల్ని, పరస్పర సంబంధాల్ని సమూలంగా మార్చేసే సాంకేతిక విప్లవం! జౌళి పరిశ్రమ యాంత్రీకరణ, ఆవిరి యంత్రాలు, ఆధునిక కర్మాగారాల ఆవిర్భావంతో 18వ శతాబ్ది చివర్లో మొదటి పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో పటుకొచ్చింది. దాదాపు వందేళ తరవాత వచ్చిన రెండో పారిశ్రామిక విపవం ఇరవయ్యో శతాబ్ది ఆరంభానికి ఉచ్చ దశకు చేరింది. డెబ్బయ్యో దశకంలో సమాచార సాంకేతికత మూడో పారిశ్రామిక విప్లవానికి అంటుకట్టి, కళ్లు చెదిరే ఆవిష్కరణలతో ప్రపంచాన్ని కొత్త సహస్రాబ్దిలోకి తోడ్కొని వచ్చింది. దాని మౌలిక సదుపాయాలు, పరిజ్ఞానంపై ఆధారపడుతూనే ఉత్పత్తి, నిర్వహణ, పరిపాలన వ్యవస్థల్ని సమూలంగా మార్చేసే మహైదత వేగంతో నాలుగో పారిశ్రామిక విపవం దూసుకొస్తోందని ప్రపంచ ఆరిక మహేద్ధృత వేగంతో నాలుగో పారిశ్రామిక విప్లవం దూసుకొస్తోందని ప్రపంచ ఆర్థిక వేదిక పారాహుషార్ పలుకుతోంది. 2011లోనే ఇండస్ట్రీ 4.0 పేరిట జర్మనీ తయారీ రంగ డిజిటలీకరణలో ముందడుగు వేసింది. ఉత్పాదక రంగంతో పాటు సామాజిక వ్యవస్థనూ సాంకేతికంగా నవీకరించే వ్యూహాన్ని జపాన్ 2016లో చేపట్టగా- పారిశ్రామిక | వ్యూహంతో బ్రిటన్, 'స్మార్ట్ ఇండస్ట్రీ' అంటూ సింగపూర్ వడివడిగా అడుగులేస్తున్నాయి. లబ్ధి దక్షిణ కొరియా అయితే దేశాధ్యక్షుడి సారథ్యంలోనే నిపుణుల సంఘాన్ని ఏర్పాటుచేసి, మన కరెన్సీలో రెండు లక్షల 30వేల కోట్ల రూపాయల ఆర్థిక ఒడుదొడుకులకు కారణమయ్యే నాలుగో పారిశ్రామిక విప్లవం ఒత్తిళ్లను అధిగమించే ముందస్తు వ్యూహాల్ని అమలు చేస్తోంది. ఈ విషయంలో జనచైనా, ఇండియా కంటే ఎంతో ముందున్న సంగతి తెలిసిందే. దేశ జనాభాలో 35 ఏళ్లలోపున్న యువజనం 65 శాతంగా ఉన్న ఇండియాభావి సవాళ్లకు దీటైన సమగ్ర వ్యూహంతో ముందుకు దూకాల్సిందే! మునుముందు ఉత్పాదక రంగాన పెట్టుబడికంటే మిన్నగా ప్రతిభే కీలక పాత్ర పోషించగలదంటున్న అధ్యయనాలు - నాలుగో పారిశ్రామిక విప్లవం గొప్ప అవకాశాల్నే కాదు, నిరుద్యోగిత రూపేణా భారీ అనర్థాల్నీ కొనితెస్తుందంటున్నాయి. చౌక కార్మిక శక్తితో ప్రయోజనం పొందుతున్న ఇండియా, లాటిన్ అమెరికా దేశాల ఆర్థిక వ్యవస్థలు కృత్రిమ మేధ, రోబోల వినియోగం వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నాయి. వచ్చే రెండు దశాబ్దాల్లో బ్రిటన్ కార్మికుల్లో 35 శాతం, అమెరికాలో 47 శాతం కొత్త సాంకేతికత కారణంగా ఉద్యోగాలకు నీళ్లోదులుకోవాల్సిందేనని ఆక్స్ ఫర్డ్ పరిశోధన ఎలుగెత్తుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆర్థిక అసమానతలు భవిష్యత్తులో పెను అగాధాలై విస్తరిస్తాయంటున్న విశ్లేషణల వెలుగులో- పటుతర ఆర్థిక వ్యూహాలకు ఇండియా సానపట్టాలి. రెండున్నర లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో ఆరోస్థానంలో ఉన్న ఇండియా మరో పుష్కర కాలానికల్లా పది లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరగల సత్తా సాధించాలంటే- మానవ వనరుల ఉన్నతీకరణ పైన, విద్య, శాస్త్ర పరిశీ పరిశోధనలు, అంకుర పరిశ్రమలు, నవకల్పనల పైనా భారీగా పెట్టుబడులు పెట్టాలి! మొన్నా నిన్నా నేటి సాంకేతిక పరిజ్ఞాన పునాదులు పటిష్టంగా వ్యవస్థీకృతమై లేకపోవడం ఇండియాకు ఎంతగానో కలిసివచ్చే అంశమని, కాలంచెల్లిన పరిజ్ఞానాల్ని తోసిపుచ్చి రేపటి అవసరాలకు దీటైనదాన్ని మన యువత సమర్థంగా అందిపుచ్చుకొంటే ఉట్టిని ఇట్టే కొట్టగలమని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చెబుతున్నారు.
పారిశ్రామిక కాంతి