ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సరిహద్దుల పరిరక్షణకు పకడ్బందీ కు పకడుంది. చర్యలు తీసుకుంటున్నాయి. ఎత్తయిన ఇనుప కంచెలు, గోడల నిర్మాణం ద్వారా సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. పశ్చిమాసియా దేశమైన ఇజ్రాయెల్ ఈ విషయంలో ఇతర దేశాలకన్నా ఎంతో ముందంజలో ఉంది. తన చుట్టూ ఈజిప్టు, లెబనాన్, సిరియా, జోర్డాన్ వంటి శత్రురాజ్యాలున్న ఈ యూదు దేశం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చీమ చిటుక్కుమన్నా పసిగట్టే ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలను అమర్చి భద్రతను పటిష్ఠపరచింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, భారత్ పరిస్థితి భిన్నంగా ఉంది. సరిహద్దుల్లో కంచె నిర్మాణం దశాబ్దాల తరబడి కొనసాగుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడం ప్రభుత్వాల చిత్తశుద్ధిని సందేహాస్పదం చేస్తోంది. ఫలితంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలతో ఈశాన్య భారతం ముఖ్యంగా అసోం సతమతమవుతోంది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో జమ్ము-కశ్మీర్‌లో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. చైనా సరిహదులో ఏకంగా ఆ దేశ సైన్యమే తరచూ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిముల్లోకి చొరబడుతూ చికాకులు సృష్టిస్తోంది. దేశంలోని 17 రాష్ట్రాలు ఇరుగు పొరుగు దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నాయి. ఈశాన్య భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, అసోమ్, నాగాలాండ్, మిజొరం, మణిపూర్, త్రిపుర, మేఘాలయబీ పశ్చిమాన రాజస్థాన్, గుజరాత్ బీ ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ, సిక్కిం, జమ్ము -కశ్మీర్, కబీర్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు వివిధ దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. భారత్ మొత్తం పదిహేను వేల కిలోమీటర్లకు పైగా భూ సరిహద్దుతో పాటు శ్రీలంక, మాల్దీవులు, ఇండొనేసియా, థాయ్ లాండ్, పాక్, బంగ్లాదేశ్, మియన్మార్లతో సుమారు 7,516 కిలోమీటర్ల తీరప్రాంత సరిహద్దు కలిగి ఉంది. భూ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ సరిహద్దు అత్యంత కీలమైనది. 4,096 కిలోమీటర్లు గల ఇది ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద అంతర్జాతీయ సరిహద్దు. ఇందులో దాదాపు 3,326 కిలోమీటర మేరకు కంచె నిర్మాణం జరిగింది. ఈ ఏడాది అబరు కలా మిగిలినదాన్ని హరి చేయాలన్నది లక్ష్యం. అపోం అపర మిజోరం, మేఘాలయ, పశ్చిమ్ బంగ రాష్ట్రాలు బంగ్లాతో సరిహద్దు కలిగిఉన్నప్పటికీ, అసోమ్ తో గల 262 కిలోమీటర్లు, పశ్చిమ్ బంగతో గల 2,217 కిలోమీటర్ల సరిహద్దు కీలకమైనది. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న కంచె నిర్మాణం నేటికీ ఓ కొలిక్కి రాకపోవడం ప్రభుత్వాల వైఫల్యాన్ని చాటుతోంది. సరిహద్దుల్లా వైఫల్యాన్ని చాటుతోంది. సరిహద్దుల్లో కొంత ప్రాంతం కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, పిల్ల కాల్వలు, నదులతో నిండి ఉండటం కంచె నిర్మాణానికి అడ్డంకిగా ఉంది. వరదల తాకిడికి కొన్ని పాత కట్టడాలు దిబ్బతిన్నాయి. కొన్ని దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల భూసేకరణ సమస్యాత్మకంగా ఉంది. సరిహద్దుల్లో 4 వ బిడ్డిం అవుల పోస్టులను నెలకొల్ప సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కాపలా కాస్తోంది. అసోమ్ లో 40 లక్షల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నట్లు నిరుడు జాతీయ పౌర పట్టిక (ఎస్ఆర్‌సీ) ద్వారా గుర్తించారు. అసోమ్ ని ధూబ్రి, కరీంగంజ్ జిల్లాలు బంగ్లా అక్రమ వలసదారుల కేంద్రాలుగా మారాయి. దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు 2016 నవంబరులో రాజ్యసభకు వెల్లడించారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువేనని, అనధికారికంగా మూడు కోట్ల మంది వరకు ఉంటారన్న అంచనాలున్నాయి. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో కొంతమంది కేరళ వెళుతున్నారు. అక్కడ హిమాచల్ కార్మికులకు ఉపాధి అవకాశాలు ఉండటం ఇందుకు కారణం. బంగ్లాదేశ్ తో గల పశ్చిమ్ బంగ సరిహద్దులో ఇంకా సుమారు 631 కిలోమీటర్ల ప్రాంతంలో కంచె నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం భూసేకరణ విషయంలో కేంద్రానికి సహకరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలోని మాల్డా, ముర్షీదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో బంగ్లా వలసదారులదే పైచేయిగా మారింది. బంగ్లా నుంచి వచ్చిన ముస్లిం వలసదారులు కాంగ్రెస్ కు ఓటుబ్యాంకుగా మారారన్న పేరుంది. వీరి మద్దతుతోనే గతంలో దివంగత కాంగ్రెస్ నేత అబ్దుల్ ఘనీఖాన్ చౌదరి 1980 నుంచి మరణించేంతవరకు (2006) వరకు మాల్టా నుంచి ఎంపిగా ఎన్నికయ్యారు. కొంతకాలం కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు అబూ హసేమ్ ఖాన్ చౌదరి కాంగ్రెస్ నుంచి మాల్గా ఎంపీగా ఉన్నారు. బంగ్లాదేశ్ తరవాత భారత్ లోకి ఎక్కువమంది వలస వచ్చేది నేపాల్ నుంచే. అయితే బతుకుతెరువు కోసం వలస వచ్చే నేపాలీలతో శాంతిభద్రతల సమస్య లేదు. హిమాలయ పర్వత రాజ్యంతో గల 1,751 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఎటువంటి కంచె నిర్మాణం లేదు. కేవలం సరిహద్దులను గుర్తించే రాతి స్తంభాలు (పిల్లర్లుమాత్రమే ఉన్నాయి. సహస్ర సీమాబల్ (ఎస్ఎబీ) 455 బోర్డర్ అవుట్ పోస్టు (బీవోపీ)ల ద్వారా గస్తీ కాస్తోంది. రెండు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించి పాస్పోర్టు, వీసా వంటి ఆంక్షలూ లేవు. గుర్తింపు కార్డుల ఆధారంగా నేపాలీలు, భారతీయులు ఇరు దేశాలను సందర్శించవచ్చుసరిహద్దుల్లో ఆంక్షలు లేకపోవడం అవాంఛనీయ ఘటనలకు ఆస్కారమిస్తోంది. మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా కొనసాగుతోంది. గతంలో నేపాల్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేవారు. భద్రత పెంపులో భాగంగా మొదటి దశలో బిహారులోని రక్సౌల్, జొగబని, రెండోదశలో ఉత్తర్ ప్రదేశ్ లోని సునౌల్రుపైదిహల్లో ఏకీకృత చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. చైనాతో సరిహద్దు ప్రత్యేకమైనది. మెక్మహన్ రేఖ రెండు దేశాలనూ విడదీస్తోంది. దీన్ని చైనా గుర్తించడం లేదు. జమ్ము-కశ్మీర్హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో 3,488 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 142 బోర్డర్ అవుట్ పోస్టు (బీవోపీ)ల ద్వారా సైన్యంతో పాటు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) గస్తీ నిర్వహిస్తున్నాయి. వీటిల్లో అన్నింటికన్నా అరుణాచల్ సరిహద్దే అత్యంత సమస్యాత్మకమైనది. యావత్తు అరుణాచల్ తనదేనంటూ చైనా మొండిగా వాదిస్తోంది. ప్రజల పరంగా అక్రమ వలసలు లేవు. అయితే చైనా సైన్యమే ఆ పాత్ర పోషిస్తుండటం గమనార్హం. తరచూ చొరబాట్లతో ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. డ్రాగన్ సైనికులు సరిహద్దులు దాటి చికాకులు కల్పిస్తున్నారు. డోక్లామ్ ఉదంతం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. రెండు దేశాల మధ్య కంచె నిర్మాణం చేపట్టలేదు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైనది, సంక్లిష్టమైనది. ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలు చెలరేగుతుంటాయి.
క్లిష్టమైన భారత సరిహద్దు సమస్య