ఫార్మసీ కోర్సులకు ఉద్యోగాల లేమి

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిని చ్చిన మేరకు ఆరేళ్ల ఫార్మా.డి కోర్సును పూర్తిచేసిన వారికి, వారి చదువుకు తగినట్లు ఉద్యోగాలు లేవు. నాలుగేళ్ళ బీఫార్మసీ చేసిన వారికి ఉన్న గుర్తింపు ఫార్మా.డి చేసిన వారికి లేకపోవడం విచారించదగ్గ విషయం . రోగులకు ఔషధాలు అంటగట్టడంలో కొన్ని కార్పొరేట్, చిన్న పాటి ఆస్పత్రుల్లో దోపిడీ భారీగా ఉంటోంది. ఆయా ఆస్పత్రుల్లో ఉన్న మందుల దుకాణాల్లోనే ఔషధాలు కొనుగోలు చేయాలంటూ వైద్యులు ఎక్కువ మొత్తంలో రాస్తుంటారు. విదేశాల్లో కేవలం రోగికి సంబందించిన రోగాన్ని మాత్రమే గుర్తించడం వైద్యుడి పని. దానికి ఏ మోతాదులో ఎలాంటి ఔషదాలు వాడాలి అనేది క్లీనికల్ ఫార్మసిస్ట్ నిర్ణయిస్తారు. దీంతో, అకార ణంగా ఔషధాలు వినియోగించడం జరగదు. ఔషధాల వల్ల కలిగే దుష్పలి తాల బారిన రోగులు పడకుండా ఉంటారు. మన దేశంలో మాత్రం ఇలాం టి సేవలందించే క్లీనికల్ ఫార్మసిస్టు లేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమా ణాల ప్రకారం ప్రతి ఆస్పత్రిలో, ప్రతి సూపర్ స్పెషాలిటీ, సాధారణ విభా గాల్లో ఖచ్చితంగా క్లీనికల్ ఫార్మసిస్ట్ ఉండాలి. దీనిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మా. డి) కోర్సును 2008లో ప్రవేశ పెట్టిం ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 11 కళాశాలల్లో ఈ కోర్సు ప్రవేశపెట్టారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షించే ఆరేళ్ల వ్యవధి ఉన్న ఫార్మా.డి కోర్సుకు ఎంబీబీఎ' సమాన హోదా ఉంటుందనే భావనతో వందల మంది ఈ కోర్సులో చేరారు. బి.ఫార్మసీ చేసిన వారికి పోస్ట్ బ్యాచలర్ (పీబీ) కింద ఈ కోర్సులో నాలుగో ఏడాదిలో నేరుగా ప్రవేశం కల్పించారు. ప్రవేశాల సమయంలో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.5-8 లక్షల వరకూ డొనేషన్ రూపంలో ఏటా రూ.1.5-3 లక్షల వరకూ ఫీజుల రూపంలో ఫార్మా.డి కళాశాలలు వసూలు చేశాయి. ఫార్మా.డి కోర్సు పూర్తి చేసిన పీబీ విద్యార్థులు 2013లో, రెగ్యులర్ ఫార్మా.డి కోర్సు పూర్తి చేసిన పీబీ విద్యార్థులు 2013లో, రెగ్యులర్ విద్యార్థులు 2014లో బయటికొచ్చారు. అయితే ఫార్మా.డి అర్హతతో ఏ ఒక్క సంస్థ కూడా ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదు. దీంతో కంగుతిన్న విద్యార్థులు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ప్రభుత్వం నియమించే డ్రగ్ ఇన్ స్పెక్టర్, ఆస్పత్రులలో క్లినికల్ ఫార్మసిస్ట్, వైద్య పరిశోధన, ఔషధ ప్రమాణాల పర్యవేక్షణలో, వైద్య కళాశాలల్లో ఫార్మకో విజిలెన్స్ విభాగంలో, రోగుల కౌన్సిలింగ్ కేంద్రాలు, టెలీ, ఈ ఔషధ కేంద్రాలలో, డిఎడిక్షన్ కేంద్రాలలో, డ్రగ్ పాయిజన్ సమాచార కేంద్రాలలో ఫార్మా.డి కళాశాలల్లో బోధనకు ఈ కోర్సు పూర్తి చేసినవారు అర్హులు. ఒక సాధారణ వైద్యుడి వేతనాలు వీరికీ వర్తిస్తాయి. దీంతో కార్పొరేట్ ఆస్పత్రులు ఫార్మా. డి చేసిన వారిని నియమించుకోవడానికి అనాసక్తి చూపుతున్నాయి. వీరిని నియమిస్తే తమ ఆస్పత్రుల్లో ఔషధాల అమ్మకాలు తగ్గుముఖం పడతాయనే భావన కూడా కనిపిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రమాణాల అమలుకు ప్రభుత్వం ఎలాం టి నియామకాలు చేపట్టకపోవడంతో ఈ విద్యార్హతతో ఎక్కడా ఖాళీలు కనిపించడం లేదు. నియామకాలు జరగడం లేదు. దీంతో ఈ కోర్సు పూర్తి చేసినవారు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.నూతన కోర్సును ప్రారంభించే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం తప్పనిసరి. డిగ్రీ పట్టాల్ని ప్రదానం చేసే విశ్వవిద్యాలయాలూ బాధ్యత తీసుకోవాలి. ఎవరికి వారు మిన్నకుంటే పట్టాలను చేత పట్టిన విద్యార్ధులు రోడ్డున పడటం ఖాయం. సరిగ్గా ఫార్మా.డి విద్యార్థుల విషయంలో ప్రస్తు తం ఇదే జరుగుతోంది. విద్యార్థులు తమ పట్టాలకు గుర్తింపునిచ్చి ఉద్యో గాలు కల్పించాలని ఆర్ధిస్తున్నారు. జనవరిలో వీరు తిరుపతిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫార్మసి కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిన మేరకు 6 సంవత్సరాల ఫార్మా.డి కోర్సును పూర్తిచేసిన వారికి, వారి చదువుకు తగినట్లు ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు. నాలుగేళ్ళ బీఫార్మసీ చేసిన వారికి ఉన్న గుర్తింపు ఫార్మా.డి చేసిన వారికి లేకపోవడం విచారించదగ్గ విషయం . కొన్ని కళాశాలల యాజమాన్యాలు కొత్త కోర్సులు అమల్లోకి వస్తే బాగా లాభాలను దండుకోవచ్చునన్న ఉద్దేశంతో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో పలువురిని ఈ కోర్సును ప్రారంభించడంలో ప్రభావితం చేసారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళా శాలల్లోనే అంతర్భాగంగా ఈ కోర్సు నిర్వహణలోనికి వచ్చింది. ఈ కోర్సులు పూర్తిచేసిన వారికి విదేశాల్లో మంచి ఉన్నత అవకాశాలు ఉన్నాయని కళాశాలల యాజమాన్యాలు ఊదరగొట్టాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా సీట్ల భర్తీ జరగడం, విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో తరగతులు, పరీక్షలు జరుగుతుండడంతో విద్యార్థులను తల్లిదండ్రులు లక్షలు పోసి చేర్చుతున్నారు. ఫార్మా.డి కోర్సు గురించి వైద్య విద్య సంచాలక కార్యాలయాన్ని సంప్రదిస్తే బోధనాస్పత్రుల్లో వీరి సేవలు అవసరం లేదని పేర్కొన్నాయి.