(పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కెరమెరి సందర్భంగా పాలన ప్రత్యేక కథనం) కాల్చుకొని పోలీస్ అంటే ధైర్యసాహసాలకు మారు పేరు..! పట్టుదల, క్రమశిక్షణ, ధైర్యం, కఠినత్వం తో పాటు సవాళ్లను ఎదుర్కోవలసి మనోధైర్యం కలిగిన వ్యక్తి పోలీస్. అయితే నేడు పోలీసులు ఆత్మస్టైర్యం కోల్పోయి, ఒత్తిళ్లను తట్టుకోలేక, మానసిక సమస్యలు, ఇంటి సమస్యలు వెంటాడడం తో, తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఖాకీల సిద్దిపేట ప్రాణాలకు రక్షణ కరువవుతోంది. అధికారుల ఒత్తిళ్లు, నాయకుల చీవాట్లు ఫలితంగా పోలీసులు ఆత్మనూన్యతకు లోనైన ఆత్మరక్షణలో పడి కాల్చుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వాలు తీసుకునే ప్రజావ్యతిరేక విధానాలకు, వీటిపై ప్రజల నుండి వచ్చే ప్రభుత్వ వ్యతిరేకతకు పోలీసులను బాధ్యులు చేస్తున్నారు. మరి ఎన్నో కారణాలు పోలీస్ శాఖలో ఉద్యోగుల ఆత్మహత్య లకు కారణమవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రజలకు రక్షణ కల్పిస్తామని గట్టి నమ్మకంతో విధుల్లో చేరిన ఎస్సైలు శాఖలో ఉన్న వేధింపులు, ఒత్తిడులు తెలుసుకొని ఉద్యోగంలో ఇమడలేక, బయటకి పోలేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేని ప్రాణాలు ఎందుకని అని గులాంగిరి చేయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరి కొందరు ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖలో ఎల ఆత్మహత్యలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో ఎస్సైల ఆత్మహత్యలు చేసుకోవడం విస్మయం కలిగిస్తుంది. 1) 2015 సెప్టెంబర్ మాసంలో రంగారెడ్డి జిల్లా బంటురుపోలీస్ స్టేషన్ కు చెందిన యువ ఎస్సై రమేష్ నాయక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజకీయ ఒత్తిళ్ళవల్ల , ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లెం వేస్తుంటే ఆయనపై అధిక ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని స్థానిక ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. 2) 2007 బ్యాచ్ కి చెందిన మెదక్ జిల్లా కుక్కునూరు పల్లి కి చెందిన ఎస్ఇ రామకృష్ణారెడ్డి. 2016 ఆగస్టు లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక డి.ఎస్.పి, సిఐలు తనను మామూలు కోసం వేధించారని మారుమూల ప్రాంతం లోని లో కారణాలను పనిచేస్తున్న తను లక్షల రూపాయలు ఇవ్వలేనని ఆత్మహత్యకు ముందు లేఖ రాయడం రాష్ట్రవ్యాప్తంగా దుమారం లేచింది. 3) 2016 ఆగస్టు 30న ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ డివిజన్ లోని పేదల బతుకులు కెరమెరి పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీధర్ సర్వీస్ రివాల్వర్ తో కుడి కణత కు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.4) 2016 నవంబర్ 26న కొమురం భీం జిల్లా కు చెందిన యువ ఎస్ ఐ శ్రీధర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్లో గల ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ సభకు బందోబస్తు నిమిత్తం వచ్చి సర్వీస్ రివాల్వర్ తో గుండెకు కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5) 2017 మార్చి 3న సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని దుబ్బాక కు చెందిన ఎస్సై చిట్టిబాబు తన సర్వీస్ రివాల్వర్ తో మొదట తన భార్యను కాల్చిచంపి ఆ తర్వాత అతను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా మరి కొందరు పోలీస్ శాఖలో పని చేస్తూ వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డారు. - ఆత్మహత్యలకు గల కారణాలు ఆత్మహత్యలు చేసుకునే వారిలో సాధారణ వారికి కంటే పోలీసులకు తేడా ఉంటుంది. సాధారణ వ్యక్తుల కంటే పోలీసులకు ఆత్మహత్య చేసుకునే వీలు ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి చేతిలో ఆయుధం ఉండడం ప్రధానంగా పేర్కొనవచ్చు. అయితే ఆత్మహత్యకు గల కారణాలను పరిశీలించినట్లయితే 1) సుదీర్ఘమైన పని గంటలు 2) ఉద్యోగంలో పెరుగుతున్న నిరాశ, నిస్పృహ 3) అవినీతి వ్యవహారాలు- ఆరోపణలు 4) చేసిన తప్పు బయటపడి పరువు పోతుందనే భయం 5) పై అధికారులు ఇంటి పనులు చేయించుకోవడం 6) ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు రాకపోవడం 7) పై అధికారుల వేధింపులు 8) విధి నిర్వహణ సక్రమంగా చేసే అవకాశాలు లేకపోవడం 9) వీటికి తోడు వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైనవి. నివారణ మార్గాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణం నిరాశ నిస్పృహ లే..! వీటికి మానసిక ఒత్తిడి కారణం అయితే ఆత్మహత్య ప్రేరేపణ మరింత తీవ్రం అవుతుంది. మిగతా వృత్తుల్లో పోలిస్తే పోలీస్ శాఖ వృత్తిలో ఒత్తిడి ఎక్కువ కుటుంబ కలహాలు, వ్యక్తిగత జీవితంలో అసంతృప్తి, నేరస్తుల పట్టివేత లో పై అధికారుల ఒత్తిడి ఈ విధంగా అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మానసిక ధైర్యాన్ని నింపుతూ వారికి ఒత్తిడి లేకుండా పని భారాన్ని తగ్గించాలి. నేరాల విచారణలో అధిక ఒత్తిడి పడకుండా ఉన్నతాధికారులు సహకరించాలి. పోలీసుల్లో ఆత్మహత్యలు తగ్గించడం కోసం ఉన్నతాధికారులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి. పోలీసు ఉద్యోగాల్లో తీసుకునేటప్పుడు అభ్యర్థుల మానసిక స్థితిగతులను, వారి వ్యక్తిగత జీవిత వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి. పోలీసుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాలి. మానసికంగా బలంగా ఉండడం కోసం ఆత్మహత్యల నివారణ శిక్షణ ఇవ్వాలి. ఉన్నతాధికారులు, సీనియర్ల నుంచి తగినంత మద్దతు పోలీసులకు అందించాలి. అదేవిధంగా మానసిక ప్రశాంతత కలిగించే కార్యక్రమాలు ధ్యానం, మొదలైనవి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలి. ఒత్తిడి ఎక్కువగా ఉండే ఈ కెరీర్లో సీనియర్ అధికారులు సైతం సైకోథెరపీ లాంటి వీటికి సిద్ధంగా ఉండాలి. విచిత్రం ఏమిటంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న పోలీసులు దాదాపు 80 శాతం మంది విధి నిర్వహణ ఉపయోగించే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు దృఢమైన మానసిక వ్యక్తులుగా ఉండేలా చర్యలు చేపట్టాలి.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి-ప్రజాపాలన