భావి తరానికి దిక్సూచి లాల్ బహుదూర్ శాస్త్రి

భారత దేశానికి రెండవ ప్రధానమంత్రి అత్యంత నిరాడంబరుడు, మితభాషి. కార్య వాది, యుక్తాయుక్త పరిజ్ఞానం గల లాల్ బహు దుర్ శాస్త్రి. స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి. జవహార్ లాల్ నెహ్రూ మరణానంతరం భారత ప్రధానమంత్రి పదవిని (1964-1966) నిర్వహించాడు. భరతమాత కన్న మహానాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన శాంతి మూర్తి . ఎప్పటికి భారత జాతి మదిలోనే మెదులుతుంటారు. తలి రామ్ దులారీదేవి, తండ్రి శారదా ప్రసాద్ శ్రీవాత్సవ లకు అక్టోబర్ 2, 1904 న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మొఘల్ సరాయి గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో జన్మించాడు. అదే రోజున గాంధీజీ కూడా జన్మించారు. గాంధీజీ పుట్టిన తేదీ రోజున జన్మించి ఆయన అడుగుజాడల్లోనే నడిచి తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. అయితే గాంధీజీగారికి వచ్చినంత పేరు శాస్త్రి గారికి రాలేదు. ఒకటిన్నర సంవత్సరాల వయసులో ఉండగానే తన తండ్రిని కోల్పోయారు. కష్టపడి ఎదిగారు. చిన్న తనం నుండి జాతీయ భావజాలం కలిగిన వ్యక్తి . స్వాతంత్ర పోరాటం లో మొత్తం తొమ్మిది సంవత్సరాల పాటు జైల్ లోనే గడిపారు. .యుద్ధ సమయం లో భారత సైనికులను ద్దేశించి 'జై జవాన్- జై కిసాన్” అనే నినాదాన్ని ఇచ్చినమన్నత నాయకుడు. అది తరువాత జాతీయ నినాదమైనది. గాంధీజీ, నెహ్రూలకు ఇష్టమైన వాడు, నమ్మకస్తుడైన అనుచరుడయ్యాడు. 1921 లో సహాయ నిరాకరణోధ్యమం లో పాల్గొన్నాడు. 1930 లో ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్నాడు. దాని ఫలితంగా రెండున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభ వించాడు. తరువాత 1937 లో ఉత్తర ప్రదేశ్ పార్లమెంటరీ బోర్డులో ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసాడు. 1940 లో అతను స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు గా వ్యక్తిగత సత్యాగ్రహం నిర్వహించినందున ఒక సంవత్సరం పాటు జైలు లో ఉన్నాడు. 1947లో భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత శాస్త్రి తన స్వంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్లమెంటరీ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1947 ఆగస్టు 15న గోవింద్ వల్లభ్ పంత్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో పోలీసు, రవాణా శాఖలకు మంత్రిగా వ్యవహరించాడు. రఫీ అహ్మద్ కిద్వాయ్ నిష్క్రమణ తరువాత కేంద్రంలో మంత్రిగా చేరాడు. అతను రవాణా శాఖా మంత్రిగా ఉన్నప్పుడు మొదటి సారిగా మహిళా కండక్టర్లను నియమించాడు. నెహ్రూ ప్రభుత్వంలో మొదట రైల్వే మంత్రిగా 1951 నుండి 1956 వరకు పనిచేశాడు. తరువాత ఏంశాఖా మంత్రిగా భాద్యతలు కూడా చేపట్టారు. రైల్వే శాఖా మంత్రిగా పనిచేస్తున్నప్పుడు రైలు ప్రమాదానికి గురైనపుడు నైతిక భాద్యత వహిస్తూ మంత్రిపదవికి రాజీనామా చేశారు. 1964 లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత అతని స్థానాన్ని పూరించడానికై, కాంగ్రేసు పార్టీ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రిని చేసింది . లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్)పునాదివేశాడు. పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నివారించుటకు సంధి కొరకు విదేశం వెళ్లి ఆయన అక్కడే జనవరి 11, 1966 న మరణించాడు. లాల్ బహుదూర్ శాస్త్రి నిజాయితీపరుడు మానవతావాదిగా పేరు పొందాడు. మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని పొందారు.నిరు పేద కుటుంబంలో పుట్టి ఉన్నత పదవులను అలంకరించిన నిరాడంబరంగా జీవించి స్వర్గస్తులైన శాస్త్రి గారి జీవితం అందరికీ ఒక చక్కని సందేశం నెరుపటి ఆనంద్,


ప్రభుత్వ ఉపాధ్యాయులు , ఉన్నత పాఠశాల టేకుర్తి , 9989048428