ప్రజలారా..వేడుక చూడకండి...

'స్టాఫ్ బోర్ బ్లాస్టింగ్' నినాదానికి శ్రీకారం చుట్టండి..! ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతున్న స్టోన్ క్రషర్లు, క్వారీలు, బోర్ బ్లాస్టింగ్లు, డాంబర్ ప్లాంట్ల నిర్వహణ పర్యావరణాన్ని దెబ్బతీస్తుందని, వీటి వల్ల సంభవించే విషపరిణామాలను ప్రజలు గుర్తించాలి. వేడుక చూడకుండా, మౌనం వీడాలి. • ఓరుగల్లులో స్టాఫ్ బోర్ బ్లాస్టింగ్- సేవ్ ఎన్విరాన్మెంట్' నినాదానికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే ఓరుగల్లు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, క్వారీలు నిర్వహించబడుతున్నాయి. బోర్ బ్లాస్టింగు జరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక, మాందారిపేట, ప్రగతి సింగారం, గోవిందాపూర్ శివారు ప్రాంతం, ఆత్మకూర్ మండలంలోని కొత్తగట్టు, సింగారం, గూడెప్పాడ్, పెద్దాపూర్, దామెర మండలంలోని పరసరగొండ, ల్యాదెళ్ల లాంటి చోట యదెచ్చగా క్వారీలు, స్టోన్ క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు నిర్వహించబడుతున్న విషయం బహిరంగ రహస్యమే. నిబంధనలు బేఖాతర్ చేస్తూ విచ్చలవిడిగా గుట్టలను పిప్పి చేస్తున్న చర్యలను నియంత్రించటంలో సంబంధిత శాఖలు విఫలమైనాయనే చెప్పాలి. పరిమితికి మించి తవ్వకాలు చేపడుతూ, బోర్ బ్లాస్టింగ్లు చేస్తూ పర్యావరణానికి ముప్పుతెచ్చే చర్యలను అరికట్టాల్సిన అధికారులు నిర్వహకులకే వత్తాసుపలికే విధంగా వ్యవహరిస్తున్నారనటంలో సందేహం లేదు. మరో వైపు కంచే చేను మేస్తుందనే చందంగా ప్రజాప్రతినిధలు సైతం క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్లు నిర్వహిస్తున్నారంటే ఇక బాధిత గ్రామాల ప్రజలు అరిచినా, అర్థించినా పట్టించుకునే నాధుడెవరుంటారు..? అయితే పర్యావరణం విషమయంగా మార్చే ఈ చర్యలను నిరసించాల్సిన అవసరం మాత్రం ఉందని గ్రహించాలి. ఎందుకంటే 1999లో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఈ నిబంధనలు ఏమాత్రం అమలుకు నోచకోవటం లేదనేది గమనార్హం. స్టోన్ క్రషర్లు, క్వారీలు ఏర్పాటుచేసే స్థలం విషయంలో కావచ్చు, నివాసప్రాంతాలకు, రహదారులకు ఉండాల్సిన దూరం విషయంలో కావచ్చు. నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహణ జరగుతుందనటంలో సందేహం లేదు. ఇక దుమ్ము బయటకు రాకుండా చేపట్టాల్సిన చర్యలు గానీ, బూడిద ఎగురకుండా నీటి సొంకర్లు గానీ, క్రషర్ యూనిట్ ఉన్న చోట పచ్చదనం ఉండే విధంగా మొక్కలు నాటడం, చెట్లు పెంచటం లాంటి చర్యలు కనిపించవు. ఇక పని చేసే చోట కార్మికులకు రక్షణకవచాలు ఏర్పాటు కూడా అంతంత మాత్రమే. పని జిల్లా చేసే కార్మికుల వివరాలు వారి జాబితా కార్మికశాఖకు అందించటం నిర్వహకులకు ఏమాత్రం పట్టదు. కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన కార్మికశాఖ సైతం ఎలాంటి చర్యలు చేపట్టకుండా యజమానులకు వత్తాసుపలుకటం సర్వసాధరణ అంశంగా ఉంది. ఇలాంటి చర్యల ఫలితంగా, స్టోన్ క్రషర్లు, క్వారీలు అందులో బో బ్లాస్టింగ్ ఫలితంగా పర్యవరణం పూర్తిగా దెబ్బతిని భవిషతు ముప్పువాటిళ్లుతుందనే వాస్తవాలను గ్రహించాలి. మనతో పాటు మన ముందుతరాలకు అనారోగ్యలను బహుమానంగా ఇవ్వటానికి నిబంధనలకు విరుద్ధంగా బోర్ బ్లాస్టింగ్ గ్లను, స్టోన్ క్రషర్లను, క్వారీలు నిర్వహించబడుతున్నాయనేది గుర్తించాలి. వీటి నిర్వహణను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నామనే వాదనను కొందరు పెద్దమనుషులు వాధించవచ్చు. కానీ మచ్చుకు కొన్ని పరిణామాలను ఇక్కడ పరిశీలిద్దాం... స్టోన్ క్రషింగ్ యూనిట్ నిర్వహించబడే ప్రాంతంలో గాలిలోని ధూళి కణాల సంఖ్య ఏలా ఉందనే విషయాన్ని పరిశీలించాలిస్తే ప్రమాదం ఏమేరకు ఉందో అర్థం చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహించే ప్రాంతంలో 600 మైక్రోగ్రాముల కంటే ఎక్కుగా ధూళి కణాలు ఉన్నట్లైతే ప్రమాధం ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందని పరిశోధనలు తెలుపుతున్నాయి. మరి వరంగల్ లాంటి చోట క్రషర్లు, బోర్ బ్లాస్టింగు జరిగే గ్రామాల పరిధిలో ఇలాంటి పరీక్షలు అధికారలు, సంబంధిత శాఖలు నిర్వహించే సాహసం చేయగలరా..? రాళ్లను స్టోన్ క్రషింగ్ యూనిట్ నిర్వషయాన్ని పరిశీలించాలిస్తే ప్రమాదం కంకరగా మార్చే క్రమంలో సన్నని దుమ్ము రేణువులు గాళిలో కలుస్తుంటాయి. వాటిని ' సిలికా ' అని పేర్కొంటారు. ఈ సిలికా తో కూడిన గాలిని పీల్చితే ఊపిరితిత్తుల సమస్య తలెత్తుతుందని కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. బోర్ బ్లాస్టింగ్లు, క్రషర్ల నిర్వహణతో వెలువడే దుమ్మతో ఎలర్జీ, ఊపిరితిత్తుల సమస్య, ఆయాసం, తలనొప్పులు, కళ్లు, కాళ్ల నొప్పులు తదితర సమస్యలు సంభవిస్తుంటాయి. ఇక ఈ స్టోన్ క్రషర్ల నుంచి వచ్చే దుమ్మ పంటలపై పేరుకుపోతే కిరణజన్య సంయోగక్రియకు అటాంకం కూడా ఏర్పడి పంటలకు నష్టం వాటిళ్లుతుంది. రాయి నుంచి వచ్చే దుమ్మ భూమి మీద పొరలా పేరుకుపోయి నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డంకిగా మారుతుంది. తద్వారా భూగర్భ జలా మట్టం పెరుగదు. ఇవన్నీ అనేక వివిధ ప్రాంతాల్లోని అనుభవాలు, పరిశోధనల్లో తేలిన అంశాలు. అయితే ఓరుగల్లులో ఇవన్ని లేకుండా అంతా సక్రమంగానే స్టోన్ క్రషర్లు, క్వారీలు, బో బ్లాస్టింగ్లు జరుగతున్నాయా..? అనేది ఇకడ ప్రశ్న..? వీటి వల్ల ప్రమాదం లేదని, అన్నీ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించబడుతున్నాయని భావించే నిర్వహకులుగానీ, పాలక పెద్దలు నిరూపించగలరా..? నింబంధనలు అతిక్రమించి బోర్ బ్లాస్టింగ్లు చేస్తున్నప్పటికీ, స్టోన్ క్రషర్ల నిర్వహణ జరగుతున్నప్పటికీ సహజసంపదలైన గుట్టలను పిప్పి చేస్తున్నప్పటికీ, అసైండ్ భూములను సైతం అప్పనంగా వాడుకుంటున్నప్పటికీ సంబధిత శాఖలు చర్యలు చేపట్టకపోవటం ఆయా శాఖల అసమర్థతకు నిదర్శనంగా భావించాలి. ఈ నేపథ్యంలో ఓరుగల్లు వ్యాప్తంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, పర్యావరణాన్ని కాపాడాలని కోరుకునే వ్యక్తులు, శక్తులు, మౌనం వీడాలి. ' ఓరుగల్లులో స్టాఫ్ బోర్ బ్లాస్టింగ్ - సేవ్ ఎన్విరాన్మెంట్ ' నినాదానికి శ్రీకారం చుట్టాలి


. రాజేందర్ దామెర సెల్ : 8096202751