అమ్మ ఒడి కావాలి కమ్మనైన గుడి

2019మేలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో జగన్ ప్రకటించిన "నవరత్నా లు” లో అమ్మ ఒడి పథకం ఎంతగా అందరిని ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలను బడికి కిల "పతి పది. పంపించే ప్రతి తల్లికిల ప్రతి ఏడాది రూ.15,000 ఇస్తామని హామీ పామని హామీ ఇవ్వడమైనది, ఇది శుభవార్తె. తొలుత ఇద్దరు పిల్లలకు ఈ పథకం వర్తింప చేయాలనుకున్నారు. తర్వాత పిల్లలకు కాకుండా వారి తల్లులకు ప్రభుత్వం ద్వారా డబ్బు ఇవ్వాలనుకుంటున్నా రు. నిజంగా పిల్లలను చదివించలేని పరిస్థితులలో ఉన్న నిరు పేద తల్లితండ్రులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు. రాష్ట్రం ఈ చివర నుంచి మొదలుకొని ఆ చివరివరకు ఒక సంవత్సరానికి పైగా దాదాపు 3500 కిలో మీటర్లకు పైగా చేసిన పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను, తల్లిదండ్రుల ఇబ్బందులను అతి దగ్గర నుండి చూసి నేను అను బావావేశంలో నుండి పటుకొచ్చిందే ఉన్నాను ...నేను విన్నాను అన్న భావావేశంలో నుండి పుట్టుకొచ్చిందే జగనన్న “అమ్మ ఒడి పథకం” . పిల్లల సరైన అభివృద్ధికి సరైన గుణాత్మక విద్య కూడా చాలా అవసరం. ఒక తల్లి తన పిల్లలకు ఉత్తమ విద్యను నయాల తమ విదుకు అందించడానికి ఎల్లప్పుడూ తపన పడుతూ ఉంటుంది. డబ్బు లేని పేదవారు కూడా మేము చదువుకోలేక పోయాము కనీసం మా పిల్లల్ని అయినా చదివించాలని కష్టపడుతుంటారు. కాబట్టి ఈ పథకంలో ఆమె తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటానికి తగిన ఆర్ధిక సహాయాన్ని ఈ అమ్మ ఒడి పథకం చక్కగా ఉపయోగ పడుతుంది. తల్లులకు నేరుగా ఆర్థిక సహాయం అందించబడుతుంది. కాబట్టి తల్లులు తమ పిల్లల తరపున ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జమ చేసే మొత్తం వారి బ్యాంక్ తరగతి ఖాతాలో పొందడానికి తల్లికి బ్యాంకు ఖాతా ఉండాలి. పిల్లలు గత నాలుగైదు నెలలుగా చదువుకునే పిల్లలు ఉన్న ఇంటిలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో బాగా నలుగుతున్న ప్రశ్న “అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లకు మాత్రమే వర్తింపజేస్తారా? లేకపోతే ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తింపజేస్తారా?” ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తారా? కేవలం ఒక్కరికే ఇస్తారా? ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు , మేధావులు ఒక పక్క ప్రభుత్వాన్ని కోరుతుంటే... ప్రైవేటు లో పనిచేసే మా పరిస్థితి ఏమిటి అని అక్కడ ఉపాధ్యాయులు, మా పాఠశాల పరిస్థితి ఏమిటి అని యాజమాన్యాలు బాధపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఈ అంశంపై ఖచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు జనాబా సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్దఎత్తునే చర్చ జరుగుతోంది. ఉంటుంది. డబ్బు లేను ఇదిలా ఉండగా.. "అమ్మ ఒడి” పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పలువురు విద్యావేత్తలు, మేథావులు ప్రభుత్వానికి దొరకని సూచిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా.. ప్రైవేటు పాఠశాలలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో.. ఏ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థికసాయం తీసుకుంటూ పిల్లలను ప్రైవేటు ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థికసాయం తీసుకుంటూ ఏ పాఠశాలల్లో చదివించుకుంటారని.. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకుంటారని.. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు నిండు జలాశయాల్లా విద్యార్థులతో పొంగి పొరలిన ప్రభుత్వ ఒకప్పుడు నిండి పాఠశాలలు రాను రాను ఇసుక వేసిన నది మేటల్లా తయారవుతున్న పరిస్థితులలో జగన్ గారి అమ్మఒడి పుణ్యాన రాష్ట్రంలోని జలాశయాల్లా పాఠశాలలు కూడా అధిక విద్యార్థులతో పొంగి పొర్లుతున్నాయి. నిన్నటివరకు రాష్ట్రంలో గరిష్ట సంఖ్యలో విద్యార్థులను కలిగి ఉండి పరిపుష్టంగా ఉన్న పాఠశాలలు ఏవో కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే ఉండేవి,కానీ ఇప్పుడు "ప్రవేశాలు నిండినవి” అని బోర్డులు పెట్టే పరిస్థితి వచ్చింది. గతంలో వచ్చింది. గతంలో చాలా వాటిలో ఏటికేడు పిల్లల తగ్గుదలతో దినదిన గండం నూరేళ్ళ ఆయుషు అనేటట్లుగా పిల్లలు లేక ప్రభుత్వ విద్యా "GO సళ్ళ ఆయుష్ట అనబట్లు వ్యవస్థను వెక్కిరిస్తు ఉండేవి. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వాల అసంబద్ద నయాల వల్ల నిర్ణయాల వల్లనైతే నేమి, తల్లిదండ్రులలో వచ్చిన మార్పు అయితే నేమి, కొంతమంది అధికారుల నిర్లిప్తత వల్లనైతే నేమి , మరికొంత మంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల నైతే నేమి, పుట్ట గొడుగుల్లా పెరుగుతూ వస్తున్న ప్రైవేటు , కార్పొరేటు పాఠశాలల వల్ల నైతే నేమి, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల లేమి నైతే నేమి, ప్రభుత్వ ఉపాధ్యాయులకు లెక్కకు మించి వేస్తున్న భోదనేతర పనుల వల్ల నైతే నేమి, ....కారణాలు అనేకం ప్రభుత్వ విద్యా వ్యవస్థ రోజు రోజుకీ మసక బారుతూ ఉన్నది. అలాగే మధ్య తరగతి , ఉన్నత , ఉద్యోగ ,మంచి వ్యాపార తరగతికి చెందిన వారి పిల్లలు , కొంచెం చదువులో ప్రతిభ చూపే పిల్లలను ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు వలస వెళ్ళడం జరిగింది. పెరిగిన ప్రవేశాలు : ఇటువంటి పరిస్థితులలో మొత్తంమ్మీద అమ్మ ఒడి జల్లెడ కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద సంఖ్యలో పిల్లలు చేరడం సంతోషం. దాదాపు ఒక లక్షా యాభై వేల మందికి పైగా విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందారు. వీరు కూడా మంచి కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం : ఫలితాలు వచ్చే పట్టణాలలోని ఉన్నత పాఠశాలలలో,చక్కటి భోదన చేసే ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే ఎక్కువగా చేరారు. ఇప్పటికీ పల్లెల్లోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖమే. పెద్ద వారు పనులకోసం పల్లెలను వీడి పట్నాలలో స్థిర నివాసం ఏర్పరచు కోవడం, జనాబా నియంత్రణ , ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన హాస్టళ్ళ తో కూడిన పాఠశాలలు, ప్రత్యేక ఆదర్శ పాఠశాలలు ఇలా లెక్కకు మించి ఇలా లెక్కకు మించి కొరియాల వల్లనైతే నేమి, తదిం దశాబ్ద కాలంలో ప్రజ ఏర్పరచడం వల్ల, కొద్దిమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యం,చక్కగా పనిచేసిన దొరకని గుర్తింపు లాంటి పనుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపి తగ్గుముఖం పడుతున్నది. అయితే ఈ కార్యక్రమము వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన గణాంకాలు తల్లిదండ్రులలో “అమ్మ ఒడి” ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో చెబుతున్నాయి. ఎవరికి ఎన్ని అనుమానాలున్నా ప్రభుత్వ సంకల్పం మాత్రం ఈ పథకం ముఖ్యంగా పేద పిల్లలకు ఆర్ధిక సహాయం చేయాలని, మొత్తం విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని. . విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తొలి ప్రాధాన్యత సర్కారు బడులకే అని , ప్రభుత్వ పాఠశాలల మెరుగుదలకు పూర్తి స్థాయి చర్యలు అంటూ ప్రకటించారు. ఒక పరిశీలనలో ఆడపిల్లల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉంటున్నారు. దీనికి కారణం అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత స్కూలుకు వెళితే అక్కడ వారికి అవసరమైన సదుపాయాలు ఉండడం లేదు. దాంతో ఆ మూడు రోజులు స్కూల్ కి వెళ్ళలేకపోతున్నారు. ఇదే సమస్య నెలనెలా కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలా మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఈ డ్రాపౌట్స్ సమస్య తగ్గాలంటే అమ్మాయిలకు అవసరమైన కనీస సౌకర్యాలు పాఠశాలల్లో ఉండాలి. అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యం: విద్యాశాఖ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న పిల్లలు రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు నిబంధన పెడితే ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ పథకం వర్తించదు. మిగిలిన పేద పిల్లలనే తీసుకున్నా... సుమారు 55 లక్షల పైనే ఉంటారు. వీరందరికీ పథకం వర్తింప చేయడమా... కుటుంబానికి ఒకరికే వర్తింప చేయడమా? ఇతర విధి విధానాలు ఎలా ఉండాలి? అనే చర్చ జరుగుతుంది. లబ్దిదారుల ఎంపికకు వారి పేదరికాన్ని కొలమానంగా తీసుకోనున్నారు. కానీ కేవలం రేషన్ కార్డు ప్రామాణికంగా కాకుండా పాన్ కార్డ్ , 200 గజాలకు మించి కట్టిన స్వంత ఇల్లు, ఇంటి పన్ను, వ్యాపార లావాదేవీల వ్యవహారం,ఫోర్ వీలర్ కలిగి ఉండడం లాంటి విషయాల మీద శ్రద్ధ చూపి అనర్హులను జల్లెడ పట్టి అసలైన పేదలకు డబ్బు అందజేసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడితే ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక పేద వారికి ఇంకాస్త డబ్బు ఎక్కువ ఇచ్చిన ఆ కుటుంబాలు జగన్ గారికి గుడి కట్టి పూజిస్తాయి. అలా కాకుండా అందరికీ ఇవ్వాలను కుంటే దానివల్ల ప్రభుత్వ విద్యారంగానికి చేసిన మేలు కంటే జరిగే కీడును ఊహించడం కూడా కష్టంగా ఉంటుంది.సాయం తల్లులకే కానీ స్కూళ్లకు కాదు కాబట్టి ప్రభుత్వ బడా ...లేక ప్రైవేటు బడా అనే సందేహం పెట్టుకోవద్దు అనేది ప్రభుత్వ పెద్దల భావన. (మిగతా రేపు)


కాళంరాజు వేణుగోపాల్ పెద్ద నాగులవరం మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412