తొలినాళ్లనుంచీ 'ఆధార్'ను వివాదాల తేనెతుట్టె వదలడం లేదు. వివిధ ప్రభుత్వ పథకాలకు, సేవలకు, సంక్షేమ కార్యక్రమాలకు 'ఆధార్'ను తప్పనిసరి చేయాలన్న ఆలోచనపై వివిధ వర్గాలనుంచి అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. ఒకదానివెంట ఒకటిగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను పన్నెండంకెల విశిష్ట గుర్తింపు సంఖ్యతో ముడి పెడుతూ వెళుతోంది. అయితే అదే క్రమంలో ప్రభుత్వ చర్యలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వరస వెంబడి 'పిటిషన్లు' దాఖలవుతున్నాయి. పౌర గోప్యత ప్రమాదంలో పడుతుందన్న అందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సర్కారీ సేవలకు 'ఆధార్' తప్పనిసరి అవునా కాదా అన్న విషయంలో సర్వోన్నత న్యాయస్థానం త్వరలోనే తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అయితే సర్కారీ సేవలకు 'ఆధార్'ను తప్పనిసరి చేసే విషయంలో న్యాయస్థానం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు, | మొబైల్ ఫోన్లకు 'ఆధార్' అనుసంధానం తుది గడువును మార్చి 31, 2018 వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది. దేశవ్యాప్తంగా పదికోట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత చేకూర్చే బృహత్ లక్ష్యంతో ప్రారంభమైన 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమానికి పన్నెండంకెల సంఖ్యను ప్రాతిపదికగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ మేరకు స్పష్టమైన సంకేతాలు వెలువరించారు. వైద్య ఖర్చులకు అయిన మొత్తం డబ్బును ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి ద్వారా నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ కోట్ల కుటుంబాలకు వర్తించే సామాజిక సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారుల దరికి పొల్లుపోకుండా చేర్చాలంటే నిర్దిష్ట ప్రాతిపదికలు ఉండాల్సిందే. సామాజిక, ఆర్థిక కుల గణన సమాచారాన్ని ఠంచనుగా పథకాలను లబ్ధిదారులకు చేర్చేందుకు వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 'ఆయుష్మాన్ భవ' ద్వారా లబ్ధిదారుల తరఫున బీమా మొత్తాన్ని ఆస్పత్రుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. ఎరువుల సబ్సిడీతోపాటు సుమారు 15కోట్ల ప్రజలతో ముడివడిన ఎల్పిజీ గ్యాస్ సబ్సిడీల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధానం అనుసరిస్తోంది. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ విధానాల ద్వారా అర్హులకు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. భారత సంచిత నిధి ద్వారా ప్రభుత్వ పథకాలపై చేసే ప్రతి ఖర్చును పన్నెండంకెల సంఖ్యతో అనుసంధానించి తీరాలని ఆధార్ చట్టంలోని ఏడో నిబంధన స్పష్టంగా వెల్లడిస్తోంది. ఎవరికైతే అవసరమో వారికి మాత్రమే పథకాలు చేరాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ సామాజిక సంక్షేమ పథకాలు అనర్హుల పాలబడి దుర్వినియోగం కారాదని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అయితే ఈ క్రమంలో ఆధార్ ద్వారా సేకరించే సమాచారం బయటకు పొక్కి దుర్వినియోగం అవుతుందేమోనన్న అనుమానాలు పెద్దయెత్తున వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సమాచార నిధినుంచి తప్పుడు పద్ధతుల్లో 'సేకరించిన వివరాలను కొందరు రూ. 500కు కూడా అమ్ముకున్న ఉదంతాలు ఇటీవల ఖాతాలు, | వెలుగులోకి వచ్చాయి. దేశంలో 120 కోట్లమందికి జారీ అయిన ఆధార్ కార్డులు, వరకూ భద్రత మొత్తంగా 57 బ్యాంకు ఖాతాలతో అనుసంధానమైనట్లు లోకసభలో కేంద్ర మంత్రి పన్నెండంకెల రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. ఇంత భారీ సమాచారాన్ని జాగ్రత్త పరచడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మొత్తంగా జాతి భద్రతే ప్రమాదంలో పడుతుంది. పాలన, వైద్య ఆర్థిక వ్యవస్థలు తలకిందులవుతాయి. దేశవ్యాప్తంగా ఈ విషయంలో ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ- సమాచారం బయటకు పన్నెండంకెల ఈ పొక్కే ప్రసక్తే లేదని, ఆ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విస్పష్ట ప్రకటన చూపే దరికి వెలువరించింది. ప్రతి పథకాన్ని 'ఆధార్'తో ముడిపెడుతున్న తరుణంలో 'ప్రాధికార కుల సంస్థ'కు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని మోదీ సర్కారు సంకల్పించింది. సామాజిక చేర్చేందుకు ' సంక్షేమ కార్యక్రమాలకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య నిధులు పక్కదారి పట్టడం! ప్రత్యక్షనగదు బదిలీ పద్ధతిలో సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేర్చడం ద్వారా పెద్దయెత్తున నిధుల దుర్వినియోగం అరికట్టినట్లు మోదీ ప్రభుత్వం చెబుతోంది. సబ్సిడీలకు 'ఆధార్'ను అనుసంధానంతో రూ. 57వేల కోట్లను పొదుపు చేయగలిగినట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఆధార్ సమాచార భద్రత విషయంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దేశంలో రెండు అతిపెద్ద డాటాబేస్ కేంద్రాలను ఏర్పాటు చేసి - కీలక సమాచారం సాఫ్ట్ వేర్ అప్లికేషన్లకు యూఐడీఏఐ భద్రత కల్పిస్తోంది. స్వతంత్ర తనిఖీ సంస్థలు ఎప్పటికప్పుడు ఈ కేంద్రాలను సందర్శించి వ్యవస్థల నిర్వహణ, సమాచారం భద్రపరచే తీరుతెన్నులను పరిశీలిస్తుంటాయి. ఏ ఒక్క సంస్థకూ సమాచార నిర్వహణలో గుత్తాధిపత్యం లేదు. సుమారు వంద సంస్థలు డాటాబేస్ నిర్వహణలోని వివిధ రకాల అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. యూఐడీఏఐకి ప్రభుత్వం విశేష న్యాయ అధికారాలనూ కట్టబెట్టింది. సమాచార నిర్వహణలో ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారికి జరిమానా విధింపుతో పాటు మూడు నుంచి ఏడేళ్లపాటు జైలు శిక్ష విధించే అధికారాలు కల్పించారు. 'ఆధార్'ను పకడ్బందీగా అమలు చేస్తే దేశ సామాజిక, ఆర్థిక ముఖ చిత్రంలో విశేషమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రభుత్వంతో ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచే 'ఆధార్' - డిజిటక ఉపకరిస్తుందన్నది ప్రభుత్వ నమ్మకం. మార్పులు , డిజిటల్ ఇండియా స్వప్న సాకారానికి ఉపకరిస్తుందన్నది ప్రభుత్వ నమ్మకం. దేశంలోని పౌరులందరికీ డిజిటల్ గుర్తింపు ఉండటంవల్ల పరిపాలన సాఫీగా సాగుతుందని, వ్యవస్థల నిర్వహణ తేలికవుతుందన్న అభిప్రాయం కొట్టిపారేయలేనిదే. ఆధార్ అనుసంధానంపై ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరిస్తేపన్నెండంకెల సంఖ్యను భిన్న రంగాలకు విస్తరించేందుకు మోదీ సర్కారు మరింత చొరవ చూపే అవకాశాలున్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139ఎఎ ప్రకారం పన్ను చెల్లింపుదారులను ఆధార్ పరిధిలోకి తీసుకురావడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు రాదని సుప్రీంకోర్టు నిరుడు జూన్ లో స్పష్టం చేసింది.
ఆధారం