పేదల బతుకులు మారేదెన్నడు

భారత దేశాన్ని వెంటాడుతున్న సమస్యలలో పేదరికం ప్రధాన సమస్య . పేదరిక నిర్మూలన కోసం అన్నీ దేశాలు ప్రణాళికలు రూపొందించుకొని అమలు పరుస్తున్నాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ఇంకా భారతదేశంలో పేదరికం పోలేదు. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు ప్రకటిస్తున్న కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. చిత్తశుద్ది తో అమలు పరచలేదు. బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయం అని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతున్నా కూడా భారతదేశంలో పేదరికం పూర్తిగా కనుమరుగు కాలేదు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం గా ఎక్కువ పేదలు మన భారతదేశంలోనే ఉన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 17 న 'అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం" నిర్వహిసున్నాము . ఈ 2019 సంవత్సరాన్ని 'పేదరికాన్ని అంతం చేయడానికి పిల్లలు, వారి కుటుంబాలు మరియు సంఘాలను శక్తివంతం చేయడానికి కలిసి పనిచేయడం” . అనే నినాదం తో జరుపుకుంటున్నాము. ప్రపంచంలో అత్యంత నిరుపేదలు ఉన్న దేశం భారతదేశం. పేదరికంలో మన భారత దేశానికి మూడవ స్థానం. తరాలు మారినా కూడా ఇంకా మారని బ్రతుకులు స్వతంత్ర భారతదేశానికి పెనుసవాలుగా మారింది . పేదరికం ఈ పేదరికం వలన ఐదేళ్లలోపు శిశువుల మరణాలు కూడా మన దేశంలోనే ఎక్కువ. ప్రపంచంలో 17 శాతం ప్రసూతి మరణాలు కూడా మన బారతదేశంలోనే గౌరవప్రదమైన జరుగుతున్నాయి. పేద వాళ్ళ సంఖ్య ఎలా పెరుగుతుందో, కోటీశ్వరుల సంఖ్య కూడా అలాగే పెరుగుతుంది. ప్రపంచంలో అనుసరిస్తున్న వ్యాపార విధానాల వలన పేదరికం ఎక్కువ అవుతుంది. ఏటా 15 శాతం మరణాల నమోదు మన భారతదేశం లోనే ఉన్నది. ప్రపంచ దేశాలలో కూడా ధనిక పేద వాళ్ళ మధ్య అంతరం పెరుగుతూనే ఉన్నది. మనం రోజువారీ పనులు చేయడానికి మనకు శక్తి కావాలి. శక్తి మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఆహారం లేక చాలామంది అలసటకు గురి అవుతారు. పేద వాళ్లకి పని చేయడానికి సరిపోయేంత ఆహారం దొరకదు వాళ్లు తినవలసిన దానికంటే తక్కువ తింటాయి. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగడాన్ని తీవ ఆకలి అంటారు. తీవ ఆకలి కూడా పేదరికమే. తీవ ఆకలి వలన వాళ్ళు బలహీనంగా ఉండి తరచూ రోగాల బారిన పడుతుంటారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అత్యంత పేదల ఆహారంలో కేలరీలు పరిమాణం తగ్గుతూ ఉండటం చాలా ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం మన దేశం మొత్తం సంపద పెరిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వస్తువులు, సేవలు, అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యంత పేలు మాత్రం ఆకలికి గురి కావడం నిత్యం జరుగుతుంది. నేటి పేదవాళ్ళకు 20 సంవత్సరాల క్రితం కంటే అందినడానికంటే కూడా తక్కువ కాలరీల శక్తి నేడు అందుతుంది. తీవ్ర ఆకలికి గురి అయ్యే ప్రజలకు తగినంత పోషక ఆహారం దొరకదు సరైన మోతాదులో ఆహారం తీసుకోకపోతే మానసిక శారీరక లోపానికి గురవుతారు. పిల్లలలో పోషకాహార లోపం ఉంటే చదవటం, పనిచేయడం, శారీరక పనులు చేయడం కష్టమవుతుంది. పోషకాహార లోపం ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉండే పిల్లల అంత వేగంగా పెరగరు. మానసికంగా కూడా అంత బాగా అభివృద్ధి చెందదు. నిత్యం ఆకలితో ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి జబ్బు పడుతారు. గర్భినులు సాధారణంగా బరువు తక్కువ, బలహీనంగా చాలా ఉండే పిల్లలకు జన్మనిస్తారు. నేటి ఆరోగ్యకరమైన బాలలే రేపటి అభివృద్ధి భారతదేశానికి పునాదులు కాబట్టి భారతదేశం అభివృద్ధి పుట్టే ఆరోగ్యవంతమైన పిల్లల పైన ఆధారపడి ఉంటుంది. భారత దేశంలో ఆకలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పేదరికం ఆకలి నుంచి తప్పించుకోవాలంటే పనికి హక్కు ఆహారానికి హక్కు రెండు తప్పనిసరిగా తప్పనిసరిగా ఉండాలి. అయితే పేదరికం నుంచి బయటపడడం, ఉండాలి. అయితే పేదరికం నుంచి బయటపడడం, గౌరవప్రదమైన జీవనం గడపడం, అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి ఆరోగ్యం, విద్,య గుడ్డ, ఆవాసం, నీరు, పారిశుధ్యం, కాలుష్యం లేని గాలి, ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలు, వివక్షకు గురి కాకుండా ఉండడం, ప్రజాస్వామ్యం లో పాల్గొనడం, ఆర్థిక సామాజిక హక్కులు, కూడా జీవించే హక్కులు కూడా పేదరికంలో భాగమే. ఈ విస్తృతమైన అవగాహన దిశగా సమాజం ముందుకు వెళ్లాలి. దాని ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన చేయడానికి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం కుటుంబ ఆదాయం , జీవనోపాధి మార్గాలు, రోజు తింటున్న ఆహారం, బట్టలు, గృహవసతి, వలస, అప్పు, వంటి అంశాలను సేకరించి ఒక కుటుంబం పేదరికం లో ఉందో లేదో నిర్ణయిస్తుంది. పేదరికానికి ప్రధాన కారణం క్రమంతప్పకుండా పని దొరకక పోవడం అని ఇక్యరాజ్య సమితి సూచింది, ఉపాధి అవకాశాలు లేక పోతే మౌలిక అవసరాలు తీర్చుకునే ప్రజల ఉపాధి అవ కొనుగోలు శక్తి, ఆదాయం తగ్గుతుంది కనీస కొనుగోలు శక్తి లేనప్పుడు . వాళ్లు తీవ్ర ఆకలికి అనారోగ్యానికి గురి అవుతారు. భారత దేశంలో ఇప్పటికీ 50 శాతం కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధి కొరకు వ్యవసాయం పైన ఆధార పడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఎక్కువ. అంతేకాక చాలామంది ప్రజల జీవనోపాధి సంక్షేమము, వ్యవసాయంపై ఆధారపడి ఉంది. కాబట్టి వ్యవసాయము అయ్యే చక్కటి ప్రగతి సాధించడం ముఖ్యం. వ్యవసాయం అభివృద్ధి చెందితే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి ఆదాయాలను సమకూరుస్తుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తి బాగుంటే ఆహార ధరలు ఎక్కువ పనులు మందికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత వ్యవసాయం అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. కారణం ఉత్పాదకాల ఖర్చులు పెరగడం, తక్కువ దిగుబడులు రావడం, విఫలమవటం వంటి వాటి వల్ల తగ్గి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కుటుంబం గడవడానికి చాలా మంది రైతులు వ్యవసాయ కూలీలు కూడా పనిచేయాల్సి వస్తోంది. అభివృద్ధి తెలంగాణ గ్రామీణ కుటుంబాల లో 40శాతం ప్రధానంగా వ్యవసాయ పుట్టే కూలీలు. ఈ కుటుంబాలకు భూమి లేదు, ఉన్నా కూడా చాలా కొద్ది భూమి మాత్రమే ఉంది. వీళ్లకు పని అవకాశాలు చాలా తక్కువ. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు చెబుతోంది భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో పని హక్కు , పొందుపరిచి ఉంది. అధికరణం 41 ఇలా పేర్కొంటోంది. 'తన ఆర్థిక , పొందుపరిచి , సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి పని హక్కు కల్పించడానికి ఇంధన ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి” అయితే ప్రజలు ఈ హక్కులను , ఉపయోగించుకోలేక పోతున్నారు. జీవించే భారతదేశం కంటే కూడా ఇంకా అత్యంత నిరుపేద దేశాలు కూడా ఉన్నాయి. పేదరికానికి ముఖ్య కారణాలు తక్కువ తలసరి ఆదాయం , నిరుద్యోగం అధిక జనాభా, వ్యవసాయం ప్రధానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, ఆదాయం , ఆర్థిక అసమానతలు,వనరుల అల్ప వినియోగం, ఆర్థిక స్వేచ్ఛ , లేకపోవడం, పోషకాలు కలిగిన ఆహార లోపం , అవినీతి , అలసత్వం, సమ న్యాయం పాటించక పోవడం. అంతర్యుద్ధాలు, లాంటివి. కారణం , నెరుపటి ఆనంద్, ప్రభుత్వ ఉపాధ్యాయులు,


టేకుర్తి, 9989048428 ప్రజల (అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నేడు)