మార్పుతోనే మహిళాభ్యుదయం -

 ((నిన్నటి సంచిక తరువాయి) కానీ మహిళల భద్రతకు, రక్షణకు మాత్రం హామీ లభించడం లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై హింస, దౌర్జన్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ,దేశంలో ప్రతి 60 నిమిషాలకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 42 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు జరుగుతోంది. ప్రతి 99 నిమిషాలకు ఒక వరకట్న పిల్లల మరణం సంభవిస్తోంది. 2012లో దేశవ్యాప్తంగా మహిళలపై 2,44,270 అఘాయిత్యాలు జరిగాయి. ప్రతి ఏటా ఈనేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అత్యాచారాలు, అపహరణలు, వరకట్న వేధింపులు, యువతుల అక్రమ రవాణా ఇలా అనేక విధాలుగా మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ పరిణామాలు మహిళాభివృద్ధికి పెనుశాపంగా పరిణమించాయి. నగరాలు, పట్టణాలు సహా , చివరికి గ్రామాల్లో సైతం స్త్రీలు, యువతులు,చిన్నారులపై విచక్షణా రహిత దాడులు జరుగుతున్నాయి. దేశమహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు.ఎన్ .సి.ఆర్ .బి (నేషనల్ క్రైం రిపోర్ట్ బ్యూరో) ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింసకు గురవుతున్నారు. భారత దేశంలో 47 శాతం మంది మధ్య వయసు బాలికల్లో జరుపుకుంటున్నాంబరువు తక్కువ లక్షణాలు కనిపిస్తున్నాయి. భారత్ లో లింగనిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్నా అవి అక్రమంగా జరిగిపోతున్నాయి. ఇది 1000 కోట్ల అక్రమ, అనైతిక పరిశ్రమగా రూపుదాల్చిందని ఒకసర్వేలో బాలికలకు వెల్లడైంది. ఇది భ్రూణ హత్యలకు కారణమవుతుంది. ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి 10 నిమిషాలకు ఒక బాలిక హింస కారణంగా ప్రాణాలు కోల్పోతోంది. ఎన్సీఆర్ బి ప్రకారం అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ఢిల్లీ తరువాత మొదటి మూడు స్థానాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఉండటం ఆందోళన కలిగించే అంశం. సంక్లిష్టమైన అమానుష నేర్రపవృత్తి సమాజంలో వ్యవస్థీకృతమవుతున్న కాలానికి - భారత నేర శిక్షాస్మృతి ృత్యాలు,అమాన అదుపు చేయడంపై కారణంగా భారత నేర శిక్షాస్మృతి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా మానవ సమాజం తలదించుకునే అకృత్యాలు,అమానవీయ సంఘటనలు కౌమార సునాయాసంగా జరిగిపోతూనే ఉన్నాయి. వీటిని అదుపు చేయడంపై పెరిగిపోతూనే ప్రభుత్వాలు తక్షణమే దృష్టి సారించాలి. ఎంతో అభివృద్ధి సాధించామని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శరవేగంతో బాలికల దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నమనం మహిళల భద్రత,వారి హక్కుల పరిరక్షణలో ఎక్కడ ఉన్నామో ఆత్మపరిశీలన 26 చేసుకోవాలి. మహిళల విషయంలో దశాబ్దాలకు ముందున్న పరిస్థితులే నేడుకుడా దాదాపుగా రాజ్యమేలుతున్నాయంటే అతిశయోక్తికాదు. ఆడ పిల్లల పట్ల చూపుతున్న వివక్షే దీనికి నిదర్శనం. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచిపోయినా,సమాజం ఇంతగా అభివృద్ధి చెందినా, ఇంకా మనం మహిళాభివృద్ధి, మహిళా సాధికారత గురించి మాట్లాడుకునే స్థితిలోనే ఉన్నాం. బేటీ బచావో.. బేటీ పఢావో..దగ్గరే చక్కర్లు కొడుతున్నాం. ఈ నాటికీ ఆడవాళ్ళంటే చులకన భావం,వివక్ష కొనసాగుతోంది. ఆడా హింసనుమగా అసమానతలున్నాయి. మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారంఉంది. వారి హక్కుల నిరాకరణ ఉంది. లైంగిక వేధింపులు న్నాయి. గృహ హింస ఉంది. అమ్మాయిలు, అబ్బాయిల్ని సమానంగా చూడాల న్న ఇంగితంలేదు.ఏవరైనా ఒకటే కదా అన్న జ్ఞానం లేదు. భర్తల వేధింపులున్నాయి. అత్తింటి ఆరళ్ళున్నాయి,వరకట్న హత్యలున్నాయి. అదీ బాలికలకు ఇదీ అని కాకుండా అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ లేని పరిస్థితి సర్వత్రా నెలకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సాధికారత అని ృత్తినైపుణ్యాలుమాట్లాడుకుంటున్నామంటే,లోపం ఎక్కడుందో ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. ఈనాడుమనం అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికల హక్కులు,మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడపిల్లలు 1000 ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడంతో పాటు బాలికలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం అ క్టోబర్ పిల్లల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవాలని డిసెంబర్ 19 - 2011న ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. కౌమార దశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలు,హింసలను తెలంగాణ అంతం చేయాలని హింసను ఎదుర్కొవడమే కాకుండా ,దాన్ని పూర్తిగా రూపు మాపడానికి ఆడపిల్లలు తమ శక్తి సామర్థ్యాలను గుర్తించడం, సాధికారత ప్రాముఖ్యతను తెలుసుకొని తమ హక్కుల్ని దక్కించుకునేలా సమితి 5 చేయడం ప్రధాన ఉద్దేశ్యం. కిశోర బాలిక మహిళగా రూపొందే కీలక దశ కౌమార దశ. వర్తమానంలోనే కాదు భవిష్యత్తులోనూ సాధికారత దిశలో నడవడానికి తనకు అవగాహన, చైతన్యం అవసరం. అందుకే ఐక్యరాజ్య సమితి కొన్ని కార్యక్రమాలను రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికల పట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హింస, ఆధిపత్యం వివిధ రకాలుగా హాని కలిగిస్తున్నాయి. ఈ ధోరణి సమాజాభివృద్ధికి, మహిళా సాధికారతకు అవరోధం కలిగిస్తుంది. అందుకే బాల్యవివాహాలను నిరోధించి, హింస నుండి రక్షించడానికి కుటుంబం, బంధుమి త్రులు, సమాజం అంతా సన్నద్ధం కావాలి. కిశోర బాలికలను స్వీయ శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. బాలికల విద్యా హక్కు కోసం ఉద్యమించిన పాకిస్తానీ బాలిక మాలాల చొరవ, సాహసం, చైతన్యం ఆమెకు నోబెల్ పురస్కారం దక్కేలా చేశాయి. కొద్దిపాటి ప్రోత్సాహం అందించగలిగితే ఎంతో మంది మలాలాలు మనదగ్గర కూడా ఉద్భవిస్తారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. కిశోర బాలికలపై జరిగే హింసను అంతం చేయడానికి, వారిని స్వీయ శక్తివంతులుగా చేస్తూ సాధికారత వైపు నడిపింపజేయాలంటే అది ఒక్క రోజులో జరిగే పనికాదు. ప్రభుత్వం, పౌరసమాజం, స్వచ్చంద సంస్థలు ఏకం కావాలి. కలిసి కట్టుగా ప్రణాళికా బద్దంగా నిబద్ధతతో, అన్నిటికీ మించి చిత్తశుద్ధితో కృషిచేయాలి. కిశోర బాలికలకు సాంకేతిక, వృతివిద్యా అవకాశాలు కల్పించాలి. తగినశిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము తీర్చి దిద్దుకుని నడుచుకునేందుకు వ ృత్తినైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, జీవననైపుణ్యం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య అంశాలపై అవగాహన పెంపొందించాలి. నేటి ఆడపిల్లలకు తప్పనిసరిగా అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలి. సామాజిక, రాజకీయ పరిస్థితులపై అవగాహన కల్పించాలి. అన్నిటికీ మించి పురుష దృక్పథంలో మార్పు రావాలి. అత్యధిక కుటుంబాల్లో వేళ్ళూనుకుపోయి ఉన్నపురుషాధిక్య భావన అంతరించాలి. ఏవిధంగానూ, ఏరూపంలోనూ'ఆడపిల్ల' అన్నచులకన భావన అంకురించని విధంగా పిల్లల పెంపకం ఉండాలి.కుటుంబాల్లో, సమాజంలో నైతిక,మానవీయ, ఆధ్యాత్మిక విలువలు వెల్లివిరియాలి. చట్టాలు మాత్రమే సర్వరోగ నివారిణికాదు.నైతిక పరివర్తనే సమస్త సమస్యలకూ పరిష్కారం. -


- యండి. ఉస్మాన్ ఖాన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు 9912580645