మూఢనమ్మకాల నిర్ములనా చట్టసాధన మన అందరి బాధ్యత మిత్రులారా .....

 మిత్రులారా ..... గతనెల 18 న తెలంగాణాలోను ...24 న ఆంధ్రాలో అరకు దగ్గర ఇద్దరు వ్యక్తులను చేతబడిచేశారన్న నెపంతో సజీవదహనం చేసారు . శాస్త్ర సాంకేతికరంగాలలో ఎంతో అభివృద్ధి చెందామనుకుంటున్న ఈ రోజుల్లో కూడా చేతబడులు ... బాణామతులు .. రంగురాళ్లు ..క్షుద్రదేవతల పేరుతో నరబలులు.. సంఖ్యాశాస్త్రాలు దొంగబాబాలు ..రైస్ పుల్లింగ్,మౌన అమావాస్యలు .. జ్యోతిష్యం పేరుతోమోసాలు...వాస్తు పేరుతో మోసాలు ... మంత్రాలతో రోగాలుపోగొడతాము ...మహిమలతో పిల్లలు పుట్టిస్తాము అంటు ప్రజలను రకరకాలుగా మోసం చేస్తున్నా రు. ఇలాంటివారిని అరికట్టేందుకు మహరాష్ట్రలో డాక్టరు దభోల్క ర్ ప్రాణత్యాగంతో ఏర్పాటైన "మూఢ నమ్మకాల నిర్ములనా చట్టం " లాంటి చట్టం మనరాష్ట్రంలో కూడా ఎంత అవసరమో పైన పేర్కొ న్న సంఘటనలు రుజువు చేస్తున్నాయి .కనుక మనరాష్ట్రంలో కూడా అదేవిధమైన చట్టంకొరకు నాస్తిక హేతువాద మానవవాద సైన్సు వాద ...జనవిజ్ఞానవేదిక ఇతర సాంస్కృతిక ప్రజాసంఘాలు, అందరం కలసి చట్టంకొరకు పోరాడినవలసిన అవసరంఉంది. కలసివచ్చే రాజకీయపార్టీలు పార్టీలు ఈ చట్టం కావాలనుకునే అన్ని సంఘాలు ముందుకి రావాలి. బలీయంగా ఉండాలి. ఇందుకొక ప్రణాళిక కమిటీ అవసరం. ఇంతటి బృహత్తరమైన దీర్ఘకాలికమైన ఉన్నతమైన కార్యక్రమాన్ని ఎమ్మెలేలు ఎమ్మె ల్సీలతో కలసి కలుపుకొని పని చెయ్య వలసిన అవసరం వుంది. మనకితోడ్పడే అందరిని కలుపుకు పోవాలి. ముఖ్యంగా ఈ చట్టం అవసరాన్ని ప్రజలవద్దకి తీసుకుపోవాలి. వారిచేతనే ఉద్యమించేట్లు గా చైతన్యపరచేవిధంగా మన కార్యక్రమం వుండాలి. అందుకోసం ఏర్పాటుచేసుకుంటున్న ఈ సమావేశం 20.10.2019 ఆదివారం నాడు ఉదయం 10 గంటలకి విజయ వాడ ప్రెస్ క్లబ్లో జరుగును. ఈ సమావేశానికి హాజరైయే సంఘాలపేర్లు ఫోన్ నంబర్లు ఇస్తే కావలసిన విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇదిమన అందరి బాధ్యత. -


నార్నె వెంకటసుబ్బయ్య.