కాలుష్య మహమ్మారి జనజీవితాల్ని ఛికన్నాభిన్నం చేస్తోంది. నానా రకాల కాలుష్యాల్ని ప్రభుత్వాలు సమర్థంగా నియంత్రించకుంటే పెను ముప్పు తప్పదని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యానించింది. 'జనం ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా' అని దేశ రాజధాని నగరం దిల్లీలోని ఉన్నత న్యాయస్థానం 15 నెలల క్రితమే ప్రశ్నించింది. తక్షణ కార్యాచరణ ఒక్కటే శరణ్యమని, దాన్ని విస్మరించిన ఏ ప్రభుత్వమైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని జాతీయ హరిత ట్రిబ్యునల్, మానవ హక్కుల కమిషన్ సైతం ఎన్నోసార్లు తేల్చిచెప్పాయి. దిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా మారడం 'ఆరోగ్య ఆత్యయిక పరిస్థితి'ని తలపిస్తోందని పర్యావరణ మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి పరిశీలక బృందాలు వెల్లడించాయి. వీటన్నింటి నేపథ్యంలో- ' చారిత్రక, పురాతత్వ ప్రాముఖ్యమున్న విశ్వవిఖ్యాత కట్టడం తాజ్ మహల్ అతీగతీ ఏమిటి' అంటూ కేంద్రంతో పాటు సంబంధిత ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవల నిలదీసింది. అనేక కాలుష్యాల బారిన పడి కళాకాంతులు కోల్పోతున్న ఆ దర్శనీయ స్థలానికి తిరిగి పూర్వ వైభవం తేవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని 'సుప్రీం' గుర్తుచేయడం ఇదే మొదటిసారి కాదు. ఏడేళ్ల క్రితం వెలువడిన కథనాల ఆధారంగా కేసు విచారణను తనకు తానుగా (సుమోటో) స్వీకరించిన ఆ న్యాయాలయం- 'కాలుష్యం కాటు తీవ్రత'ను ఆనాడే ప్రభుత్వాల 'దృష్టి'కి తెచ్చింది! ప్రపంచంలోని తొలి మూడు అత్యుత్తమ ఆకర్షణీయ ప్రదేశాల్లో స్థానం సాధించి, ఏటా లక్షలాది ప్రజలు సందర్శించే అద్భుత ఫలి తాజ్ మహలుది తరతరాలుగా తరగని కీర్తి! అంతటి ప్రశస్తి గల 'సామాజిక, సాంస్కృతిక నిధి'- అదే ప్రాంతంలోని మధుర, మరికొన్ని నూనె శుద్ధి కర్మాగారాలు విడుదల చేసే వ్యర్థాల నడుమ ఏళ్లతరబడి చిక్కువడింది. అక్కడ ఘన వ్యర్థ పదార్థాల దహన ప్రభావమూ ఎక్కువే! యమునతో పాటు మరికొన్ని నదీజలాల మూలంగా తాజ్ మహల్ సహా ఆ ప్రాంతమంతా కాలుష్య కోరల్లో చిక్కి తల్లడిల్లుతోంది. నిర్మాణ, విస్తరణ, అభివృద్ధి పనుల పేరిట సమీప అటవీ ప్రాంతాల్లోని చెట్లను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారం కొట్టివేయడం కూడా ఆ అపురూప కట్టడానికి ప్రమాదకరంగా పరిణమిస్తోంది. అన్నింటికంటే మించి, పరిసరాల్లోని వాహనాల రొదలతో నానాటికీ పెరుగుతున్న వాయుకాలుష్యం జనం మనుగడనే ప్రశ్నార్లకంగా మారుస్తోంది. పీల్చే గాలి కలుషితం కావడం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో- ఆగ్రాకు దాదాపు 200 కిలోమీటర్లలోని దిల్లీలో క్రికెట్ మ్యాచ్ తీరుతేటతెల్లం చేస్తుంది. నిరుడు డిసెంబరులో టెస్ట్ మ్యాచ్ కాంక్షిస్తూ పరస్పర సంప్రతింపులుఆడటానికి వచ్చిన శ్రీలంక జట్టు దిల్లీ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైంది. ఒక అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ కు వాతావరణ కాలుష్య పీడ కారణంగా ఆటంకాలు తలెత్తడం అదే మొదటిసారి!కాలుష్య సమస్య దిల్లీకో, తాజ్ మహల్ కో పరిమితమైనది కాదనిబీ ముంచుకొ చ్చేవరకు ప్రభుత్వాలు " మిన్నకుండటం తెలివైన పని అనిపిం చుకోదని పదేళ్లనాడే జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ అధ్యయనం హెచ్చరించింది. మూడున్నర శతాబ్దాలకు పైగా చరిత్ర గల కట్టడాన్ని పరిరక్షించుకోవాలని, మూడున్నర శతాబ్దాలకు పెగా చరిత్ర గల ! అందులో విఫలమైతే భావితరాలు ఎంతమాత్రం క్షమించబోవని మూడేళ్ల కిందటి ఇండియా-అమెరికా శాస్త్రవేత్తల సంయుక్త బృందం నివేదిక తేల్చిచెప్పింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలన్నింటినీ చేపడితే తప్ప పర్యావరణ కాలుష్య నియంత్రణ సాధ్యపడదని సుప్రీంకోర్టు నియమించిన సంస్థ గతేడాది స్పష్టీకరించింది. హరియాణా వంటి వ్యవసాయ ప్రాంతాల పంటపొలాల్లో వ్యర్థాల్ని దహనం చేయడంబీ ఎండు గడ్డిని మండించడం అక్కడి రైతులకు పరిపాటి. అదీ విపరీ తమైన కాలుష్య కారకమవుతోంది. దట్టంగా వ్యాపించే పొగమంచుకూడా ప్రజల్ని విషవాయు వలయంలో బంధిస్తోంది. ఉసురుతీసే వాయువులు నివాస ృహాలతో పాటు భూగర్భ రైల్వే మెట్రోలోకి చొరబడుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ కళ్లకే- జనం ప్రాణాల్ని ఉన్నపళంగా తోడేసే 'గ్యాస్ ఛాంబర్'లా దేశ రాజధాని నగరం కనిపించింది. అక్కడి గాలి కాలుష్యం ఏడాదినాటి దావోస్ సదస్సుకు 'పెనుభూతం'గా గోచరించింది. ఒక్క దిల్లీ అనేముంది- కాలుష్యమయంగా మారిన అటువంటి తొలి నగరాలు దేశంలో మరో 13 ఉన్నాయి. అత్యంత దయనీయత చోటుచేసుకున్న వాటిలో ముందు వరసన కాన్పూరు (యూపీ) ఉంది. ఆధ్యాత్మిక రాజధానిగా పరిగణించే కాశీ, కళాత్మకతకు నెలవుగా వర్ణించే ఆగ్రా సైతం ఆ రాష్ట్రంలోనివే! అదే ఆగ్రాలోని తెల్లదనాల తాజ్ కు కాలుష్యంతో రంగు మారుతుంటే, నగర ప్రజల జీవితాలే తెల్లారిపోతున్నాయి. జనమంతా విషాన్నే పీల్చాల్సి వస్తోందని 'ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. తలకు తొడుగులు వేసుకొని, వెంట ప్రాణవాయువు సిలిండర్లు పట్టుకొని తిరిగే పరిస్థితి జనానికి రాకూడదంటే ప్రభుత్వాలు చేయాల్సిందేమిటి? వేగవంతమవుతున్న పట్టణీకరణ, విస్తరిస్తున్న పారిశ్రామికీకరణలు పర్యావరణ పరిరక్షణకు ఎంతవరకు ఉపకరిస్తున్నాయో గ్రహించాలి. వాటితో పాటు వ్యవసాయ సంబంధ పనుల్లో కొన్ని- ముఖ్యంగా వాయు, జల కాలుష్యాలకు దారితీస్తుండటం పై ప్రభుత్వాలు చూపు సారించాలి. దిల్లీ సహా కోల్‌కతా, ముంబయి వంటి మహానగరాల్లో ధూళి కణాలు ప్రజారోగ్యాన్ని ఎంతగా దెబ్బతీస్తున్నాయో చెప్పనలవి కాదు. కొన్ని తరహాల నిర్మాణ పనుల తీరుతెన్నులు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణె వంటి చోట్ల ప్రజలకు నరకం చూపుతున్నాయి. ఆయా నగర ప్రణాళికల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటేనే కాలుష్య నివారణ కొంతవరకైనా సాధ్యపడుతుందని సంబంధిత కేంద్ర మండలి (సీపీసీబీ) పదేపదే చెబుతోంది. ప్రభుత్వ విభాగాలతో పాటు పర్యావరణ సంరక్షణ కోరుకునే సేవాసంస్థలు చేయాల్సింది ఎంతో ఉందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ గతంలోనే 'ట్రావెల్ డిమాండ్ మేనేజ్ మెంట్' పేరిట సమగ్ర ప్రణాళిక రూపొందించింది. తాజ్ వంటి ప్రఖ్యాత కట్టడాల్ని విష కాలుష్యం నుంచి కాపాడటం- చారిత్రక అవసరం, సామాజిక కర్తవ్యం అంటూ ప్రభుత్వాలకు సంబంధిత పార్లమెంటరీ స్థాయీసంఘం మూడేళ్లనాడే మేలిమి సూచనలు చేసింది. . వాటి ప్రకారం అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో కేంద్రంబీ యూపీ సహా ఆ ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ముందడుగు వేయాలి. అప్పుడే ప్రజానీకానికి, తాజ్ మహల్ వంటికాలుష్యమయంగా
కోరలు చాస్తున్న కాలుష్యం