ఆర్టీసీ సమ్మె ఒక పరిశీలన

రోజు 97 లక్షల మందిని ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరుస్తూ రోజుకు 36 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతున్న బస్సు చక్రం ఆగిపోయింది. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రజా రవాణా వ్యవస్థ కాపాడుకోవడానికి తెగించి సమ్మె చేస్తుంటే మహత్తరమైన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం కళ్ళముందు కదలాడుతుంది తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు సీమాంధ్ర పాలనలో ఎన్ని నిర్బంధాలకు గురయ్యారో మనకు తెలిసిన విషయమే ఆర్టీసీ సకల జనుల సమ్మెలో పాల్గొనడంతో ఇక తెలంగాణ రావడం ఖాయమని ఆరోజు నిర్ణయమైంది తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీని కడుపులో దాచుకొని కాపాడుకుంటామని ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కార్మికుల కాలికి ముల్లు గుచ్చుకుంటే తలతో నోటితో తీస్తానని అప్పుడు చెప్పిన ఉద్యమ నాయకుడు ఇప్పుడు ఒకే కలంపోటుతో 50 వేల మంది ఉద్యోగులను రోడ్డుపై పడేశారు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు మొత్తం 26 ఇందులో ఆరు డిమాండ్లు తప్ప మిగతావి ఆర్టీసీ మేనేజ్మెంట్పరిష్కరించడానికి వీలైనవి తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఆర్టిసి విభజన ప్రక్రియ పూర్తి చేయకపోగా గత ఐదు సంవత్సరాలుగా ఏనాడు పూర్తిస్థాయి ఎండి నియమించలేదు ఆర్టీసీ పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్షానికి ఇంతకన్నా సాక్ష్యం అక్కర్లేదనుకుంటా ప్రభుత్వానికి ఆర్టీసీ 2014 19 కాలంలో 1052 కోట్ల రూపాయల వాహన పన్ను చెల్లించింది వేట డీజిల్ పైన మరొక ఆరు వందల కోట్ల రూపాయల పన్ను చెల్లిస్తుంది వాస్తవానికి ప్రభుత్వం ఆర్టీసీ కి చెల్లిస్తున్న దానికన్నా ఆ సంస్థ నుండి అధికంగా పొందుతున్నది ఆర్టీసీ వంటి సంస్థలను లాభాల కోసం కాకుండా ప్రజల అవసరాలకు కోసం తీర్చిదిద్దడానికి నడిపిస్తారు రవాణా రంగం పనిచేయకపోతే ఆర్థికరంగం కుప్పకూలి పోతుంది. దీనిని గమనించాలి అధిక లాభాలు వచ్చే రూట్లో ప్రైవేటు వాహనాల కంపెనీలు అక్రమంగా బస్సులు నడుపుతూ ఆర్టీసీకి వచ్చే లాభాలకుగండి కొడుతున్నాయి ఈ బస్సులను నియంత్రిస్తే ఆర్టీసీకి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతాయిప్రైవేటు బస్సులను నియంత్రించి ఆర్టీసీని ఆదుకోవాలని ఉద్యమకాలంలో కార్మికులు డిమాండ్ చేశారు అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ విషయాలపై ఆర్టీసీ కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చింది తెలంగాణ వస్తే కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతం ఇచ్చి పన్ను రాయితీలు మంజూరు చేసి ఆర్టీసీని ఆదుకుంటామని అంది ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె జీతభత్యాల పెంపుదల కోసం కాదు ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాడుతున్నామని సమస్త కు రావలసిన బకాయిలు రాబట్టుకోవడం తన అభిమతమని కార్మిక నాయకులు నిర్ద్వందంగా చెబుతున్నారు డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు. రవాణా శాఖ మంత్రి ని రెండుసార్లు కలిశారు 2018 ఆగస్టు లో ప్రభుత్వం వన్ ఆర్ టి సి సమస్యను పరిశీలించి పరిష్కారాలను సూచించే నిపుణుల కమిటీని వేసింది ఈ కమిటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులు సభ్యులు 2019 జూన్ నాటికి కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది కానీ ప్రభుత్వం ఆ నివేదికను తీసుకునేందుకు ససేమిరా అంది చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం దొరికే కానీ ప్రభుత్వం జాబు చేయడం జాగు చేయడం వెనుక ఏమిటో అర్థం కావడం లేదు దీనితో కార్మికులు నెల రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు లైట్ గా తీసుకుంది. ప్రస్తుతం సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటు ప్రభుత్వం బాగు పడ్డదిలేదు ప్రజలు బాగు పడ్డది లేదు ప్రభుత్వం ఒక మెట్టు దిగి వస్తే సమ్మె జరిగి ఉండక పోయేది ఆర్థిక సంబంధమైన ఆరు డిమాండ్ తప్ప 20 డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించి ఉంటే కార్మికులు సమ్మెను వాయిదా వేసుకొని ఉండేవారు. ప్రభుత్వం పట్టువిడుపులకు పోవడంతో పరిస్థితి చేజారి పోయింది చాలా మంది పేద ప్రజలు కూలి పనికి వెళ్లేందుకు విద్యార్థులు పాఠశాలలు కళాశాలలకు వెళ్లేందుకు ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు మధ్యతరగతి ప్రజలు మార్కెట్ కు వెళ్లేందుకు తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థ ఒక్క ఆర్టీసీ మాత్రమే ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను సామాజిక బాధ్యతగా నిర్వహించాలి దానికి ఎంత ఖర్చయినా వెనకాదవద్దు అటు ఆర్టీసీకి ఇటు సామాన్య ప్రజలకు లాభం జరగకుండా సందెట్లో సడేమియా లా ప్రైవేట్ రవాణా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. తక్షణం సమ్మె విరమించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత గడువు కార్మికులకు కొంత ఊరట ప్రభుత్వం కల్పిస్తే సామాన్య మానవులు ఊపిరి పీల్చుకోవడం తథ్యం ఇకనైనా ప్రభుత్వం సమ్మె విరమణ కు చర్యలు తీసుకోవాలి కానీ నూతన రిక్రూట్మెంట్ అని కొత్తవారిని తీసుకొని అనుభవం లేని డ్రైవర్లతో ఎన్ని ప్రమాదాలకు కారణం అవుతారో ? అని సామాన్యుడు తల్లడిల్లుతున్నారు కనుక ప్రభుత్వం తక్షణమే తన పట్టు విడువలని సామాన్యుడు కోరుకోవడంలో తప్పు లేదు.


ఏ.పురుషోత్తంరావు హైదరాబాద్