మోగిన నీటిగంట

పాఠశాలల్లో ఒక చక్కటి ,బహుళ ప్రయోజన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంబించబోతుంది. అదే "నీటిగంట” . అవును బడిలో నీటికి కూడా గంట మోగనుంది. ఇందుకు ప్రతి రోజూ మూడు సమయాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా దీన్ని అమలు చేయాలని సంకల్పించింది. కేరళలో ఇప్పటికే నీటి గంట విధానం ఉంది. దీని వలన మంచి ఫలితాలు రావడంతో మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈమేరకు విద్యాశాఖ కమిషనర్ మంగళవారం ఏమియులు జారీ చేశారు. కు విద్యాశాఖ కమి చేయాలని ప్రభు ఏమిటీ నీటిగంట: నిత్య జీవితంలో నీరు లేనిదే జీవితమే లేదు. ఏమియులు జారీ చేశారు. కు విద్యాశాఖ ఏమిటీ నీటిగంట: నిత్య జీవితంలో నీరు లేనిదే జీవితమే లేదు. నీరే మనిషికి ప్రాణాధారం. నీటి ప్రాధాన్యత, అవసరం మనకు తెలియంది కాదు.మన శరీరంలో ఎక్కువ బాగం నీరు ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. పిల్లలు కనీసం రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ పాఠశాలల్లో అధిక శాతం మంది విద్యార్థులు రోజుకు అర లీటరు నీటిని కూడా సరిగ్గా తాగడం లేదు. నీటిని తగిన రీతిలో తాగాలన్న అవగాహన లేకపోవడం, పాఠశాలల్లో ఎక్కువగా నీరు తాగితే తరచూ మరుగుదొడ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెంగ, ఎడతెరిపి లేకుండా తరగతుల నిర్వహణ, , అసలు మరుగుదొడ్లో అందుబాటులో లేకపోవడం, ఉన్నా అవి శుభ్రంగా లేక పోవడం, ఉన్నా సరియైన నీటి వసతి లేకపోవడం తీరికలేని చదువులు , ఎపుడు పడితే అప్పుడు బయటకు వాటి కొరకు పొతే తోటి పిల్లలు అవహేళన చేస్తారన్న బిడియం, పెద్ద వయసు పిల్లలలో ఉండే సహజమైన సిగ్గు లాంటి కారణాలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్నాయి. నీళ్ళు సరిగా తాగనందున విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నందున పాఠశాలల్లో హాజరు శాతం తగ్గుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా జ్వరాలు , డీహైడ్రేషన్, నిస్సత్తువ, మూత్రపిండాల్లో రాళ్లు పెరగడం, పిత్తాశయంలో రాళు అడ్డుపడడం, మల బద్దకం,మూత్రపిండాల పనితీరు తగ్గడం తదితర సమస్యలతో విద్యార్థులు రోగాల భాధపడుతున్నారు. ఇది భవిష్యత్తులో వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. వారు సరిపడా నీరు తాగకపోవడమే అందుకు కారణమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకోసమే విద్యార్థులు నీరు తాగేందుకు ప్రత్యేకంగా నీటి గంటను అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు తరగతులు జరుగుతున్న సమయంలో రోజుకు కనీసం మూడు సార్లు నీళ్ళు తాగిస్తే సాధారణ ఆనారోగ్య సమస్యలు నివారించవచ్చని భావించింది. పాఠశాలల్లో ఉదయం 10.30 గంటలకు, మధ్యాహ్నం 12గంటలకు సాయంత్రం 3గంటలకు నీటి గంట మోగించాలి. ఆసమయాల్లో ఉపాధ్యాయులు, విద్యార్ధులచే నీరు తాగించేలా చేయాలి. సెలవు దినాల్లో కూడా ఇదే వేళలను పాటిస్తూ నీరు తాగాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచించాలి. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నీటి గంట సమయంలో తాగునీరు అందుబాటులో ఉంచాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించారు. అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని తప్పని సరిగా అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ప్రైవేటు బడులలో కూడా ఈ కార్యక్రమాన్ని వీలు చూసుకొని ఖచ్చితంగా అమలు చేయమని కోరుతున్నారు. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ సమస్యను అధిగమించేందుకు కేరళ చేయమని కోరుతున్నారు. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ సమస్యను అధిగమించేందుకు కేరళ రాష్ట్రం లోని చెరువత్తూరు, వలియపరంబు గ్రామ పంచాయతీల పరిధి లోని పాఠశాలల్లో ప్రత్యేకంగా 'నీటి గంట' ఏర్పాటు చేశారు. అక్కడ ప్రతి మూడు గంటలకు ఒకసారి గంటను మోగిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులు నీరు తాగేలా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల కోసం కేరళ ప్రభుత్వ రాష్ట్రములోని అన్ని పాఠశాలలో రోజుకు నాలుగు సార్లు గంట మోగించడం ప్రారంబించింది. . ఆ నీటి గంట' సమయంలో తగిన మోతాదులో వారు నీటిని తాగేట్లు చూస్తున్నారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. వినూత్నంగా మొదలైన ఈ కార్యక్రమం మీడియా, సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది. ఇదే స్పూర్తితో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. దానికి తగ్గట్లు తగు చర్యలు తీసుకుంటున్నారు. దీని మూలాల్లోకి వెళితే అధిక శాతం పాఠశాల విద్యార్థులు సరిపడా నీరు తాగడం లేదు. దీనివల్ల వారు పలు వ్యాధుల బారినపడుతున్నారు. (మిగతా రేపటి సంచికలో) పరిధి అకడ ప్రతి మూడు విద్యార్థులు -


కాళంరాజు వేణుగోపాల్,మార్కాపురం