అనంతుల మదన్ మోహన్ (నిన్నటి సంచిక తరువాయి) అతను సిగరెట్ డబ్బాలపై రాసిస్తే అనేక మంది ఉద్యోగాల్లో చేరిపోయిండ్రు అని ఒక మాటగా ఈ ప్రాంతంలో ఒక నానుడి. సిద్దిపేట ప్రాంతంలో 220 పవర్ హౌస్ సబ్ స్టేషన్ ని , టీవీ రిలే స్టేషన్న, నెహ్రు యువ కేంద్రాలని , మిల్కీ చిల్లీ సెంటర్ ని, ఇందిరా మహిళా డిగ్రీ కాలేజి ఏర్పాటు లాంటి పనులు ఈ ప్రాంతీయులు ఇప్పటికి గుర్తు చేసుకుంటారు. కొండాపాకలో పీ హెచ్ సీ కి తన తండ్రి స్మారకంగా రెండెకరాల భూమిని ఇచ్చిండు.కాని కనీసం శిలాఫలకంపై కూడా ఆ ప్రస్తావన లేదు. విజయభాస్కర్ రెడ్డి వద్ద మంత్రి వర్గంలో ఆరోగ్యా శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆయన వద్ద డిప్యూటి మంత్రిగా పని చేసిండ్రు. ప్రస్తుత తెలం గాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర్ రావుని రాజకీయా ల్లోకి తీసుకొచ్చింది , కేసీఆర్ గారి రాజకీయ గురువు మదన్ మోహన్. 1982లో మాజీ ముఖ్య మంత్రి ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగు దేశం పార్టీ స్థాపించబడిన సంధర్భము లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ జీవితంలో మొదటిసారి టీడీపీ తరపున తన రాజకీయ గురువైన మదన్ మోహన్ పై పోటీ చేసి కేవలం 730 ఓట్ల తేడాతో ఓడిపోయిండు. ఈ ఎన్నికలలోనే ఇందిరా గాంధి సిద్దిపేట సభలో మదన్ మోహన్ నాకు స్వయానా కొడుకు లాం టి వాడని చెప్పింది. 1983 ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎన్టీఆర్ సారథ్యంలో అధికారములోకి వచ్చిన సందర్భంలో కాంగ్రేస్ పార్టీ తరపున మదన్ మోహన్ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడిగా , వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉప నాయకుడిగా పని చేసిండ్రు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో హన్మకొండ నుండి పోటీ చేస్తానని కోరినప్పటికీ అధిష్టానము టికెటివ్వలేదు. 1985లో తెలుగుదేశం పార్టీలో నాదెండ్ల భాస్కర్ రావు సంక్షోభం జరిగి తిరిగి మధ్యంతర ఎన్నికలు రావడంతో ఆయన శిష్యుడైన ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతిలోనే ఓడిపోయిండు. ఆ తర్వాత 1989 మరియు 1994 లలో ఓడిపోయినప్పటికి 1989 లో కాంగ్రెస్ అధికాం 0 లోకి రావడముతో 1990లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ ) చైర్మన్ గా పని చేసిండు. 1989లో పీసీసీ జనరల్ సెక్రెటరీగా ఏఐసీసీ లైఫు మెంబర్‌గా ( శాశ్వత ఆహ్వానితుడిగా ) నియామకం అయిండు. 1994లో చివరిసారిగా శాసన సభ కి చివరిసారిగా పోటీ చేసిండు. 1998లో కాంగ్రేస్ పార్టీ మహా రాష్ట్ర స్టేట్ ఇంచార్జిగా చేసిండు. 1973 లో పీ.వీ. నరసింహారావు తర్వాత రాష్ట్రపతి పాలనని ఎత్తేసినంక మదన్ మోహన్ ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో జలగం వెంగళరావు సీ.ఎమ్. అయిండు. కేసీఆర్ , నంది యెల్లయ్య , దామోదర రాజనర్సింహా ,ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సైన్ మదన్ మోహన్ శిష్యులు రాజకీయ రంగం( లో. మదన్ మోహన్ అక్క ఐన శీలోత్రి దేవి కుమారులే వరంగల్ మాజీ ఎమ్మెల్యే దాస్యం ప్రణయ్ భాస్కర్ మరియు ప్రస్తుత ఎమ్మెల్యే , ప్రణయ్ భాస్కర్ తమ్ముడు వినయ్ భాస్కర్. 1996 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాశన సభలో తెలంగాణ కి జరుగుతున్నా అన్యాయాలని ప్రశ్నిస్తూ ప్రణయ్ భాస్కర్ మాట్లాడినందుకు అప్పటి స్పీకర్ యనమాల రామకృష్ణుడు శాసన సభలో వెనుకబడిన ప్రాంతం అనే పదం మాత్రమే వాడాలని తెలంగాణ అనే పదం ఉచ్చరించుటకు వీలు లేదని రూలింగ్ ఇవ్వడముతో నిరసనగా అప్పటికప్పుడే ప్రణయ్ భాస్కర్ తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. ఐతే దురదృష్టవశాత్తు ఆ తర్వాత కొద్ది రోజులకే గుండె పోటుతో మరణించిండు. తను బ్రతికే ఉంటే తన మేనమామ నడిపిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని తిరిగి మొదలు పెట్టేవాడేమో. ఐతే తన మామ , తన మామ మదన్ మోహన్ స్ఫూర్తితో కాళోజీ ,ప్రణయ్ భాస్కర్ ల ఫోటోలతో ప్రత్యేక తెలంగాణ అజెండాగా స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయిండు. తిరిగి 2009 లో టీఆర్ఎస్ నుండి 2009 లో గెలిచి ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మదన్ మోహన్ గారి సోదరుడు అనంతల శ్యా%8% మోహన్ ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్స్ సెల్ చైర్మన్ గా కొనసాగుతుండు. రాజకీయాలలో ఉన్నతమైన విలువలు పాటించిన ఆ మహానీయుడు మదన్ మోహన్ నవంబర్ 1, 2004 న హైదారాబాద్ లో మరణించిండు. అతని పార్థివ దేహాన్ని గాంధీ భవన్లో ప్రజల సంధర్శనార్థం ఉంచిండ్రు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు హైదరాబాద్ లో పంజాగుట్టలో జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి (మిగతా రేపు)
బి వెంకటకిషన్ శాక్య-9908198484