అంతా అయిపోయాక అనిపంజరాలను ఏరుకోవటమే అనటుగా ఆ పరిస్థితులు మారుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడే అటు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు హడావుడి చేయటం తరువాత మరిచిపోవటం సర్వసాధరణ అంశంగా మారిందనటంలో సందేహం లేదు. ఇందుకు అనేక ఉదాహరణలు కళ్లముందే ఉన్నాయి. అయితే ముందే ప్రమాదాలు జరుగటానికి అవకాశం ఉండే నిర్మాణాల అనుమతులు, ఒక వేళ వేల ప్రమాదాలు జరిగిన సందర్భంలో వాటిని వెంటనే అరికట్టేందుకు అవసరమైన చర్యలను పాటించే విధంగా చూడటంలో ఆయా శాఖలు విఫలమవుతున్నాయనటంలోనూ వెనుకాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సేవా దృక్పధం మరిచి వ్యాపారమే ధ్యేయంగా కొనసాగుతున్న ప్రయివేటు ఆసుపత్రుల పట్ల అనుమతులు ఇవ్వాల్సిన సంబంధిత శాఖలు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. అగ్ని మాపకశాఖ నుంచి తీసుకోవాల్సిన నిరభ్యంతరకర అనుమతులు అసలు తీసుకుంటున్నారో.. లేదో... తెలియని పరిస్థితులున్నాయి. ఒక వేళ అనుమతులు ఉన్నాయని అనుకుందామా అంటే అసలు అందుకనుగుణమైన నిర్మాణాలు లేని భవనాల్లో కొనసాగుతున్న ప్రయివేటు ఆసుపత్రులకు అగ్నిమాపక శాఖ ఎలా గుడ్డిగా అనుమతులు ఆ ఇస్తుందో వారికే తెలియాలి. ఉదాహరణకు వరంగల్ నగరంలో సుమారు రెండేండ్ల కిందట రోహిణి ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి ఆస్థినష్టంతో పాటు, ప్రాణనష్టం జరిగి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన - విషయాన్ని మరువరాదు. రోగులు అగ్నికి ఆహుతి అవటం ఇప్పటికీ మా మదిని తొలిచే అంశంగానే ఉంది. ఈ ఘటన మరువకముందే వరంగల్ కాశిబుగ్గ ఏరియాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే నిబంధనల ప్రకారం ఆసుపత్రులకు 15 మీటర ఎత్తు, 500 చదరపు మీటర్ల వైశాల్యంలో భవనాలు నిర్మించాల్సి ఉందని, పూర్తి స్థాయిలో నీటి వసతి, చుట్టూ అంబులెన్స్ తిరిగే విధంగా స్థలం, ఉండాలని, అగ్నిమాపక వాహనం తిరిగే విధంగా ఆసుపత్రి భవనం ఉండాలని, వాహనం రాకపోకలకు అనువుగా ఉండే విధంగా గేట్లు ఉండాలని అధికారులే తెలుపుతున్నారు. ఇలాంటి నిబంధనలు పాటించటంలో ఆసుపత్రుల నిర్వహకులు నిబంధనలకు నీలొదులుతున్నారనటంలో సందేహం లేదు. అగ్నిమాపకశాఖ అధికారులు గార్డియన్ సైతం నిబంధనలు పాటించకపోయినా అనుమతులు తీసుకోకపోయినా చర్యలు చేపట్టకపోవటం చర్యలు చేపట్టకపోవటం అధికారుల తీరు ఎలా ఉందో తెలుపుతుంది. ఒక ఆసుపత్రులే కాదు హోటళ్లు, షాపింగ్ మాలకు సైతం అగ్నిమాపకశాఖ నిరంభ్యంతర అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టనట్లుగా నిర్వహించబడుతున్న హోటళ్లు, షాపింగ్ మాల్లు కళ్లముందే యధేచ్చగా నిర్వహించబడుతున్నాయి. ఒక వరంగల్ నగరంలోనే ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయంటే అతియోశక్తి లేదు. అగ్ని ప్రమాదాలు జరిగిన ఉదంతాలు కూడా అనేకం కళ్లముందే ఉన్నాయి. ఉన్నాయి. గతంలో ఇదే నగరంలో హోటల్ అశోక, సిటీగ్రాండ్ లాంటి వాటిలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఉదాంతాలు సూటళ్ల దుస్థితిని జరిగినప్పుడు తెలుపుతున్నాయి. ఫైర్ నిరంభ్యంతర ధృవీకరణ పత్రాలు అవసరం ఉన్న భవనానాల చుట్టు అగ్నిమాపక వాహనం తిరుగటానికి 6 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలని, జీఓ నెంబర్ 168 07.04.2012 మున్సిపల్ పరిపాలన, అర్బన్ డెవల మెంట్ శాఖ ఉత్తర్వులు తెలుపుతున్నాయి. ఇక భవనాల లోపలికి ప్రవేశించటానికి, తిరిగి బయటకు రావటానికి 6 మీటర్ల వెడల్పు గల ఇగేట్, అవుట్ గేట్ తప్పనిసరిగా అనే నిబంధనలు కూడా ఇన్ గేట్, అవుట్ ఉన్నాయి. ఇవన్ని అగ్నిమాపకశాఖ అధికారికంగా తెలిపిన వివరాలే. ఈ లెక్కన soone, పాస్మిక వరంగల్, హన్మకొండ పరిధిలోని షాపింగ్ మాల్స్, హెూటళ్లు, సినిమా వ థియేటర్లు ఫైర్ నిరభ్యంతర అనుమతులు పాటించటం లేదనేది గమనార్హం. ఇందుకు సాక్ష్యమేమిటంటే నగరంలోని కళ్యాణలక్ష్మి, అక్షయలక్ష్మి, భద్రకాళిశారీ సెంటర్, నక్కలగుట్టలోని మాంగళ్యషాపింగ్ మాల్‌కు ఎలాంటి ఫైర్ అనుమతులు లేవని అగ్నిమాపకశాఖ అధికారికంగా పేర్కొంటుంది. మరి ఫైర్ అనుమతులు లేకున్న అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. మరో వైపు నగరంలోని పేరుపొందిన గార్డియన్ ఆసుపత్రి, విశ్వాస్ ఆసుపత్రి, అమృత పిల్లల ఆసుపత్రి లాంటివాటి భవనాల పరిస్థితి చూస్తే ఫైర్ అనుమతులకు విరుద్ధంగా ఉన్నాయనటానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఇలాంటి పరిస్థితులు ముమ్మాటికీ అధికారులకు, నిర్వహకులకు రహస్యపు ఒప్పందాలు ఉన్నాయనే అనుమానాలనే వ్యక్తపరుస్తుండనటంలో సందేహం లేదు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గతంలో అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్థినష్టం జరిగన ఉదాంతాలు ఉన్నప్పటికీ మళ్లీ ఉనారావృతం కాకుండా ముందే చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ఎందుకో ప్రభుత్వానికి, అధికారులకే తెలియాలి. వీటిని పరిశీలిస్తే " అంతా అయిపోయాక అస్థిపంజరాలు' ఏరుకోవటం కాకా ఏమవుతుంది..?. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయటం ఆ తరువాత పట్టింపులేకపోవటం " మతిమరుపు చర్యలు”గానే భావించక తప్పదు. ఇప్పటికైనా అగ్నిమాపక శాఖ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఫైర్ అనుమతులు పాటించని ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల పట్ల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందే చెప్పినట్లుగా అంతా అయిపోయాక అస్థిపంజరాలను ఏరుకోవటం కంటే ముందే జాగ్రత్తలు పాటించటం ఉత్తమమని గుర్తించాలి.
రాజేందర్ దామెర జర్నలిస్టు -
వరంగల్ సెల్ : 8096202751