మనిషి బతకడానికి శుభమైన ఆహారము. మంచి నీరు,మంచి గాలి, విద్య, వైద్యం ఎంత అవసరమో పారిశుద్ధ్యం కూడా అంతే అవసరం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి దేశానికి శక్తి అన్నట్లుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి పారిశుద్ధ్యం కూడా ప్రభావం చూపెడుతుంది. ప్రతి సంవత్సరం | ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19న 'ప్రపంచ టాయిలెట్ డే జరుపుకుంటున్నాము. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దేశాలలో నివసిస్తున్న ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, ప్రత్యక్ష హింస కంటే సురక్షితమైన నీరు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చే విరేచన వ్యాధుల నుండి సగటున దాదాపు 20 రెట్లు ఎక్కువ. అని యునిసెఫ్ నివేదిక తెలిపింది. 2001లో ప్రపంచ టాయిలెట్ సంస్థ ఏర్పడింది. 2013 లో ఇది ప్రపంచవ్యాప్తంగా అమలులోకి రావడం జరిగింది. ఈ 2019 సంవత్సరం ను ,(లీవింగ్ నో వన్ బిహైండ్ )వెనుక ఎవరూ లేరు” అనే నినాదంతో జరుపుకుంటున్నాం.మన పని మనమే చేసుకోవాలి. మన ఆరోగ్యం, పారిశుద్యం మన చేతుల్లోనే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య సమస్య పూర్తిగా పరిష్కరించడం కోసం 2030 నాటికి అందరికీ పారిశుద్ధ్యాన్ని వాగ్దానం చేస్తున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయడం కోసం దీనిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో మూడు వంతులకు సురక్షితమైన టాయిలెట్స్ లేవు. మూడింట ఒక వంతు కి మాత్రమే సురక్షితమైన మంచినీరు అందుబాటులో ఉంది. నీటి వనరులు అన్ని కలుషితం అవుతున్నాయి. దీనికి కారణం బహిరంగ మల మూత్ర విసర్జన చేయటమే. నీటి కాలుష్యం వలన కలరా , డయేరియా , టైఫాయిడ్ , విరేచనాలు మరియు స్కిస్టోసోమియాసిస్ వంటి నీటి ద్వారా వచ్చే వ్యాధులు దీని ప్రభావంతో పిల్లలు పెద్దలు నీరసించి పోయి అనారోగ్యం బారిన పడుతున్నారు. నీటి పారిశుధ్యం పరిశుభ్రమైన మంచినీరు అందుబాటులోకి రావడం అనేది ప్రాథమిక హక్కు. ఇది ఆరోగ్య హక్కు మరియు విద్యా హక్కు తో ముడిపడి ఉన్నది. ప్రపంచ వ్యాపంగా కనీసం రెండు బిలియన్ల ప్రజలు మలం కలుషితమైన తాగునీటిని ఉపయోగిస్తున్నారు. దీనివలన నీళ్ల విరేచనాలు, కలరా, దీర్ఘకాలిక పోషకాహార లోపం, ఇతరత్రా అనారోగ్య సమస్యలు రావడం వలన తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు. చాలామంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ సరి అయిన అవగాహన లేక ప్రాణాలను కోల్పోతున్నారు. సాధారణంగా మానవుడు జీవ క్రియల ద్వారా వ్యర్థ పదార్థాలను ఘన, ద్రవ, వాయు స్థితులలో వాతావరణంలోకి వదిలి వేస్తాడు. అలాగే మానవునికి శక్తి నిచ్చే పదార్థాలను ఘన ద్రవ స్థితులలో వాతావరణం నుంచి శరీరంలోకి తీసుకుంటాడు. మానవుడు విసర్జించే బహిరంగ మలమూత్రాలు అనేక రకాల బ్యాక్టీరియా,హానికర సూక్ష్మ దాదాపు జీవులు ఇతర పరాన్నజీవులను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అలాంటివి కారకాలు మానవుడు తీసుకునే ఆహార పదార్థాలలో కలవడం వలన అవి వాతావరణంలో చేరి గాలిని, నీటిని, నేలను, కలుషితం చేస్తున్నాయి. అటువంటి గాలిని నీటిని ఆహారపదార్థాలను తీసుకోవడం వలన తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలను కోల్పోతున్నారు. సరి అయిన పారిశుద్ధ్యం లేకపోవడం వలన మహిళలు బాలికలు మల మూత్ర విసర్జన ఆపు కోవడం వలన ఆరోగ్యం అధికంగా దెబ్బ తింటుంది. సరైన మరుగు దొడ్డి సౌకర్యం లేకపోవడం వలన స్త్రీలు, విద్యార్థినిలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. అనారోగ్యం కారణంగా బాలికలలో విద్య శాతం తగ్గుతుంది విద్యకుంటు పడుతుంది. బహిరంగ మల మూత్ర విసర్జన చేయడం వలన పరిసరాలు కలుషితమై అనేక రకాల వ్యాధులకు గురి అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో సంవత్సరానికి 9 శాతం నీళ్ల విరేచనాల వల్ల చనిపోతుంటే మన భారతదేశంలో లక్షల వరకు చనిపోతున్నారు వల్ల నీళ్ల విరేచనాల వల్ల పోషకాహార లోపం పెరుగుతోంది. జ్వరాలతో ఇతర వ్యాధులతో బరువు తగ్గడం పోషకాహార లోపం వల్ల పిల్లల శారీరక మానసిక ఎదుగుదల దెబ్బతినడం జరుగుతుంది. ఒకగ్రాము మలములో పది లక్షల వైరస్లు బ్యాక్టీరియాలు ఇతర పరాన్నజీవులు సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చుట్టూ ఉన్న పరిసరాలను కలుషితం చేస్తాయి తద్వారా గాలి నీరు నేల కలుషితం అయిపోతాయి. పోతాయి. అందువలన వ్యక్తిగత మరుగుదొడ్లను ఉపయోగించుకోవడం చాలా ఉత్తమం దీనిద్వారా పరిసరాలను కలుషితం కాకుండా కాపాడవచ్చు . తద్వారా విరేచనాలు కలరా ఇతర వ్యక్తిగత వ్యాధులు కూడా రాకుండా ఆపవచ్చు. దీనివలన ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు వ్యాధులు రాకుండా నివారించుకునే వాళ్లమవుతాం. ప్రపంచంలో లో ప్రతి ఏటా 4 లక్షల 32 వేల మంది నీళ్ల విరేచనాలు, డీహైడ్రేషన్ తో మరణిస్తున్నారు. దాదాపు సగం మందికి అంటే 420 కోట్ల మందికి సురక్షితమైన పారిశుద్ధ్య సేవలు అందుబాటులో లేవు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన, కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు . దాదాపు రెండు వందల కోట్ల మంది తాగేనీరు మలంతో కలుషితమై ఉండడం వలన అనేక వ్యాధుల బారిన పడుతున్నారు చాలా ఎక్కువగా సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ శు భ్రంగా ఉండేటట్లు చూడాలి. నేడు 'ప్రపంచ టాయిలెట్ డే”.
నెరుపటి ఆనంద్, జీవశాస్త్రం ఉపాధ్యాయులు, టేకుర్తి. 9989048428