అమెరికాతో వాణిజ్య సంబంధాలు

లాభం లేనిదే వ్యాపారి వరదన పోడను నానుడి అగరాజ్యమైన అమెరికాకు అతికినట్లు సరిపోతుంది. భారత్, అమెరికా దౌత్యసంబంధాలకు 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్నా- అవకాశాల స్వర్గంగా భారత్ ఎదిగిందని గుర్తించాకే వాషింగ్టన్, ఇండియావైపు నిశితంగా దృష్టి సారిస్తోంది. రెండు దేశాలకు చెందిన విదేశాంగ, రక్షణ శాఖ మంత్రుల మధ్య చర్చలకు 2018 జనవరి ముహూర్తాన్ని శ్వేతసౌధాధిపతి ట్రంప్, భారత ప్రధాని మోదీ నిరుడు జూలోనే నిర్ణయించారు. చర్చల ప్రక్రియ రెండుమార్లు వాయిదా పడినా, అవి నిస్సారంగా తెమిలిపోకుండా ఉభయదేశాలూ గట్టి కసరత్తే చేశాయని చెప్పక తప్పదు. భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపూ ఉత్సాహాన్నివ్వడమే లక్ష్యంగా ఈ తరహా భేటీని ఏటా నిర్వహించాలని నిశ్చయించారు. ప్రధాన రక్షణ భాగస్వామిగా ఇండియాకు ఇచ్చిన సూదాను మరింత విస్తృతం చేస్తూ, సమాచార అనుకూలత భద్రత ఒప్పందాన్ని (కామ్ కోసా) తాజాగా పట్టాలకెక్కించారు. అత్యధునాతన రక్షణ వ్యవస్థల్ని ఇండియాకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, వాటి సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోగల వెసులుబాటూ భారత్ కు ఈ ఒప్పందం ద్వారా చిక్కనుంది. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాల్నీ మరింత గట్టిగా ముడివేసేం దుకు కొత్తగా త్రివిధ దళాల విన్యాసాలకూ పాదుచేస్తోంది. అమెరికా ఇండియాల రక్షణ భాగస్వామ్యంలో అత్యధునాతన సాంకేతికత కీలక భూమికను గుర్తిస్తూ- ఉమ్మడిగా ప్రాజెక్టుల అభివృద్ధి, ఉత్పాదకతలనూ కొత్త ఒప్పందం ప్రస్తావించింది. సీమాంతర ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ను హెచ్చరించడం మొదలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంపై బీజింగ్ గుత్త పెత్తనం కూడదన్నట్లుగా సుతిమెత్తగా చేసిన వ్యాఖ్యలతో ఒప్పందం బహుముఖీనంగా ఉన్నా- ఇరాన్ రష్యాలతో ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా యథాపూర్వం గుడ్లురుముతున్న తీరు అగ్రరాజ్యం ఒంటెత్తు ధోరణులకే దర్పణం పడుతోంది! చెరువుకు నిటి ఆశ- నిటికి చెరువాశ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం పరితపిస్తున్న ఇండియా, తన వస్తూత్పాదనల విక్రయానికి ఆకర్షణీయ విపణి కోసం చూస్తున్న అమెరికాలు ఏనాటి నుంచో చెట్టపట్టాలు కట్టి సాగగలిగే వీలున్నా దానికి అడుగడుగునా అవరోధమవుతోంది- అగ్రరాజ్యం అత్యాశ! ఒకే రకమైన విలువల్ని విశ్వసిస్తూ, ఒకే విధమైన లక్ష్యం కోసం పరిశ్రమిస్తున్న భారత్, అమెరికాలు పరస్పర సంబంధాల్ని మెరుగుపరచుకుని పటిష్ఠ భాగస్వాములుగా గట్టి కృషి సాగించాలంటూ వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడిక రూపొంది పద్దెనిమిదేళ్లు అయింది. రక్షణ రంగంలో అమెరికా నుంచి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చు కోవడానికి నాలుగు ప్రాతిపదిక ఒప్పందాలు అవసరం కాగా, ఇప్పుడు కుదరింది మూడోది! ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారాన్ని పెనవేసేలా ఇంది ఆస్ట్రియల్ సెక్యూరిటీ అనెక్స్ (ఐఎస్ఏ) పైనా సంప్రతింపులు సాగించడానికి ఉభయ పక్షాలూ సంసిద్ధత చాటుతున్నాయి. దశాబ్దాల తరబడి ఇండియా ఆయుధాగారాన్ని పరిపుష్టీకరిస్తూ వచ్చిన రష్యాను వెనక్కినెట్టి అమెరికా ఇజ్రాయెల్ వంటివి రక్షణ రంగ సరఫరాదారులుగా అగ్రస్థానానికి చేరడం ఇటీవలి ముచ్చటే. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎజ్)లో ఇండియా చేరికను వ్యతిరేకిస్తున్న చైనా అభ్యంతరాల్ని తోసిరాజని భారత్ కు మార్గం సుగమం చేస్తామంటున్న అగ్రరాజ్యం- ప్రధానంగా అణురియాక్టర్ల విక్రయాలపైనే దృష్టి పెట్టిందన్నదీ తెలిసిన సంగతే! స్వేచ్ఛా వాణిజ్యం అంటూ ఇంతకాలం ప్రపంచ దేశాల్ని సతాయించిన అమెరికా, దేశి దేశీయంగా వాణిజ్యలోటు గూబలదరగొడుతున్నదంటూ, ఇండియాపైనా వాణిజ్య ఆంక్షల కత్తి ఝళిపిస్తున్న తిరు- ఏ : వాణిజ్య ఆంక్షల కత్తి ఝళిపిస్తున్న తీరు - ఏ విధంగానూ సమర్థనీయం కాదు! వ్యూహాత్మక భాగస్వామ్యంతో ఒక దేశానికి చేరువ అవుతున్నామంటే, మరే దేశానికో దూరం జరుగుతున్నట్లు కానే కాదని పద్దెనిదేళ్ల క్రితం వాజ్ పేయీ ప్రభుత్వం స్పష్టీకరించింది. అమెరికా పాలక శ్రేణిలో ఆ తరహా స్పృహ కొరవడటం- ఇతర దేశాలతో ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యంపైనా దుష్ప్రభావం చూపుతోంది. అమెరికా తో ద్వైపాక్షిక వాణిజ్యంలో ఇండియావైపే 2,300 కోట్ల డాలర్ల మొగ్గు కనిపిస్తోంది. దాన్ని చూసి కుపితులైన ట్రంప్- ఉక్కు అల్యూమినియం ఎగుమతులపై సుంకాలను అహేతుకంగా పెంచేయడం ఇండియాను బాగా నొప్పిస్తోంది. అది చాలదన్నట్లు, ప్రాధాన్య సదాతో సుంకాల్లో రాయితీలు పొందుతున్న ఇండియాను ఆ జాబితా నుంచి తొలగించే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్య సమతూకం కోసం వచ్చే మూడేళ్లపాటు ఏటా అదనంగా 1,000 కోట్ల డాలర్ల మేర కొనుగోళ్లకు ఇండియా సమ్మతించాలనీ అమెరికా నేతాగణం ఒత్తిడి తెస్తోంది. ఆ మేరకు పౌర విమానాలు, సహజవాయువు విక్రయాలపై ముసాయిదా ఒప్పందాల్నీ సిద్ధం చెయ్యడం- అగ్రరాజ్యం దాష్టీకానికి సంకేతం! అంతకుమించి, ఇరాన్ నుంచి చమురు, రష్యా నుంచి ఎస్-400 యుద్ధవిమానాలను భారత్ కొనుగోలు చెయ్యరాదని, తమ మాటకాదని వాణిజ్యం కొనసాగిస్తే ఆంక్షల వంపు తథ్యమనీ హెచ్చరించడం'వ్యూహాత్మక తప్పిదం! 'తనతో ఉన్నవారే మిత్రులు, లేనివారంతా శత్రువులే' అన్న అమెరికా ధోరణి దశాబ్దాలుగా అనేకచోట్ల అశాంతి అగ్నిగుండాల్ని ఎగదోసింది. సర్వసత్తాక, సార్వభౌమ దేశంగా ఏ దేశంతో ఎలాంటి వాణిజ్య ఒడంబడికలు కుదుర్చుకోవాలో నిర్ణయించుకోగల సంపూర్ణాధికారం ఇండియాకు ఉంది. ఈ విషయంలో అగ్రరాజ్యం ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే భారత్ గౌరవం ఇనుమడిస్తుంది!


సురేష్,మంచిర్యాల