అణు కుంపటు!

నాయకులు భూమండలాన్ని క్షణమాత్రంలో భస్మీపటలం చేసే అణ్వాయుధాలను అన్ని దేశాలూ వదులుకోవాలన్న డిమాండ్లు ఈనాటివి కావు. దశాబ్దాలుగా అనేక దేశాలు ఐక్యరాజ్య సమితి వేదికగా ఈ విషయమై గళం వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు మద్దతుగా 'సమితి' సైతం అణ్వాయుధరహిత ప్రపంచాన్ని కాంక్షిస్తూ వివిధ ద్వారా వేదికలపై తీర్మానాలు వెలువరిస్తూనే ఉంది. 2013 నుంచి ఏటా సెప్టెంబరు 26ను నోట 'సంపూర్ణ అణ్వాయుధ రహిత దినోత్సవం'గా నిర్వహిస్తోంది. అణ్వాయుధాల రూపంలో పొంచి ఉన్న ముప్పును తెలియజెప్పి, వాటిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరంపై సర్వత్రా అవగాహన విస్తరించడమే లక్ష్యంగా 'సమితి' ఈ రోజును నిర్వహిస్తోంది. మరోవంక అనేక చిన్న దేశాలు అణ్వాయుధాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతూ 'సమితి' ప్రయత్నాలకు గట్టి అండదండలు అందిస్తున్నాయి. ఆస్ట్రియా, మార్షల్ ఐలాండ్స్, కజకిస్థాన్ వంటివి ఈ విషయంలో ముందువరసలో ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలకు, భారీ అణ్వస్త్ర పరీక్షలకు కేంద్రాలుగా వర్ధిల్లిన దేశాలవి! తొలి, ద్వితీయ ప్రపంచ సంగ్రామాల పాలబడి ఆస్ట్రియా పూర్తిగా అతలాకుతలమైంది. 1946-1958 మధ్యకాలంలో 67 అతిపెద్ద అణ్వస్త్ర పరీక్షలకు మార్షల్ ఐలాండ్స్ కేంద్రస్థలి! సోవియట్ యూనియన్ నిర్వహించిన ఎన్నో అణ్వస్త్ర పరీక్షలకు కజకిస్థాన్ సాక్షీభూతంగా నిలిచింది. ఆ అణ్వస్త్ర పరీక్షలు కజకిస్థాన్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి. తరాలకు తరాలే అవకరాలతో జన్మించడానికి కజకిస్థాన్ లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలు కారణమయ్యాయి. చిన్నదేశాలు అణ్వస్త్ర రహిత ప్రపంచాన్ని ఆకాంక్షిస్తుంటే- మరోవంక పెద్ద దేశాలు గిరిజనం మాత్రం అణుశక్తి సంపన్నంగా మారడానికి ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పిచ్చివాడి చేతిలో రాయి ఎంత ప్రమాదకరమో, పరిణతి లేని పాలకుల అధీనంలోని అణ్వస్తాలూ అంతే నష్టదాయకం. వివిధ దేశాల్లో అణ్వస్త్రాలు నియంత్రణ లేని నాయకుల స్వాధీనంలోనే ఉండటం దురదృష్టకరం. ధరణీతలాన్ని 2019 భస్మీపటలం చేయగల దారుణ మారణాస్త్రాల గురించి సరైన అవగాహన లేని నాయకులు ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఐక్యరాజ్య సర్వప్రతినిధి సభ సమావేశంలో ప్రసంగిస్తూ 'ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తా'నంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరినీ గ్రాంతపరచాయి. దేశాలన్నీ పరస్పర సంప్రతింపులు, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తున్న 'సమితి' సమావేశంలో ట్రంప్ నోట ఇంతటి బాధ్యతారహిత వ్యాఖ్యలు వెలువడటం ఆందోళన కలిగించే పరిణామం. ట్రంప్ నోటి దురుసుకు ఏమాత్రం తీసిపోని ఉత్తర కొరియా అధినేత కిమ్, 'ఎవరూ వూహించలేని స్థాయిలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా అణ్వస్త్ర పరీక్ష నిర్వహిస్తాం' అని ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. గతంలో వివిధ దేశాల నాయకులు పోటాపోటీగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే ప్రపంచ యుద్ధాలు సంభవించాయి. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియాల తీరు ప్రపంచ యుద్ధాలకు ముందునాటి స్థితిని గుర్తుకు తెస్తోంది. చరిత్ర నుంచి మన నాయకులు పాఠాలు నేర్వకపోవడమే బాధాకరం. ప్రపంచ వ్యాప్తంగా వేలసంఖ్యలో అణ్వాయుధాలున్నాయి. భూమండలాన్ని అనేకమార్లు దగ్దం చేయగల శక్తి వీటికి ఉంది. ఏ దేశమైనా మరో దేశంమీద అణ్వాయుధం ప్రయోగిస్తే ప్రపంచవ్యాప్తంగా మానవాళి పై ఆ ప్రభావం తప్పక ప్రసరిస్తుంది. అణ్వాయుధం ప్రయోగిస్తే లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడతారు. ప్రపంచ దేశాలకు లక్షలకోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. మొత్తం మానవాళే భూమ్మీదనుంచి తుడిచి పెట్టుకుపోయే ప్రమాదమే ఎక్కువ. ఒకవేళ అదృష్టం బాగుండి మానవజాతి బతికి బట్టకట్టినా కొన్ని దశాబ్దాలపాటు అనారోగ్య సమస్యలు వారిని వేధించడం ఖాయం. వేలంవెర్రిగా అణ్వస్త్రాలను పోగేసుకోవాలని తహతహలాడుతున్న దేశాలకు నిజంగా వాటిని ప్రయోగిస్తే కలిగే దుష్పలితాలపై సరైన అవగాహన లేదనే చెప్పాలి. చరిత్రను ఒక్కసారి సమీక్షిస్తే హిరోషిమా, నాగసాకి, చెర్నోబిల్, కజకిస్థాన్ వంటి వణుకు పుట్టించే ఉదంతాలు కళ్లముందు మెదలుతాయి. సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ముందు కజకిస్థాన్ అందులో అంతర్భాగంగా ఉండేది. సోవియట్ సర్కారు కజక్ లోని ఎసీఎస్ ప్రాంతంలో 456 అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత కలిగిన ప్రాంతమది! సోవియట్ విచ్చిన్నానికి రెండేళ్ల ముందు 1989లో ఈ ప్రాంతంలో చిట్టచివరి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించారు. ఆ తరవాత 1991లో దీన్ని శాశ్వతంగా మూసివేశారు. సుమారు మూడు దశాబ్దాల తరవాత కూడా అక్కడి ప్రజలు ఇప్పటికీ అణు ధార్మికత ప్రభావాల ఫలితంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటమే బాధాకరం. అణ్వస్త్ర పరీక్షలు జరిగిన కేంద్రాన్ని 17 సంవత్సరాలపాటు రష్యా, అమెరికా, కజకిస్థాన్ సంయుక్తంగా కలిసి అత్యంత రహస్యంగా శుద్ధి చేశాయి. శుద్ది కార్యక్రమంలో భాగంగా అణ్వస్త్ర పరీక్షల కేంద్రంలో పోగుపడిన ప్లుటోనియాన్ని ప్రత్యేకంగా గుహలు తవ్వి పూడ్చి పెట్టారు. అందుకు అప్పట్లోనే 15 కోట్ల డాలర్ల ఖర్చయింది! సోవియట్ యూనియన్ పతనం తరవాత ఐక్యరాజ్య సమితి అండదండలతో వివిధ సంస్థలు, వ్యక్తిగత ఆసక్తి కొద్దీ కొందరు పరిశోధకులు కజకిస్థాన్లో అణ్వస్త్ర పరీక్షల ప్రభావంపై నిర్వహించిన అధ్యయనాల్లో గుండెలవిసే వాస్తవాలు వెల్లడయ్యాయి. రెండు లక్షలమంది ప్రజల ఆరోగ్యాలపై అణ్వస్త్ర పరీక్షలవల్ల ప్రత్యక్ష ప్రభావం పడిందని ఈ అధ్యయనాల్లో తేలింది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్యయనంలో అక్కడి ప్రజల జన్యురీతి పూర్తిగా మారిపోయినట్లు స్పష్టమైంది.