సంపాదకీయం | శుక్రవారం 15 నవంబర్, 2019 20, 401 డెబ్బయి ఏళ్ల కమ్యూనిస్టు పాలన ఉక్కు పిడికిళ్ల మధ్య తొలిసారి చైనా, భారత్ తో వియ్యానికి కాలు ముందుకు వేసింది. ఇది ఊహించని పరిణామం. డోక్లాం వద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన చైనా ఒక్కసారే యూటర్న్ తీసుకొని భారత్ తో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవడాన్ని బట్టి గమనిస్తే చైనాలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది అంతర్జాతీయంగా శాంతియుత వాతావరణం నెలకొనడానికి సూచికగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఆసియాలో పెద్దన్నగా వ్యవహరించడానికి, అదే విధంగా ప్రపంచ దేశాలకు పెద్దదిక్కుగా నిల్చోవడానికి చైనా ఉవ్విళ్లూరుతోంది. కారణం ప్రపంచ దేశాల్లో బలమైన ఆర్థికవ్యవస్థను ఈ దేశం నిర్మించుకోగలిగింది. ప్రపంచ పోలీసులుగా చెప్పుకుంటున్న అమెరికా ఆగడాలను సైతం చైనా అడ్డుకోగలిగిందంటే కారణం అమెరికాలాంటి దేశాలకే చైనా అప్పులు ఇస్తోంది. ఇదే సమయంలో భారత్ తో విభేదించిన పాకిస్థాన్ వంటి దేశాలకు సైతం ఉదారంగా సాయం అందిస్తూ, భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వస్తోంది. అనేక సందర్భాల్లో పాక్ దుందుడు వైఖరిని సమర్ధిస్తున్న చైనాలో భారత్ పట్ల ఉన్న వ్యతిరేకత క్రమంగా మారుతూ వస్తోంది. దీనికి కారణం ఎన్నైనా చెప్పుకోవచ్చు. భారత్ లో అతి పెద్ద మార్కెట్ చైనా వస్తువులదే. భారత్ ను వ్యతిరేకిస్తే జరిగే పరిణామమేమింటే చైనా వస్తువులకు గిరాకీ తగ్గిపోతుంది. ఇప్పటికే చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ ప్రజల నుండి వస్తుంది. ఇదే జరిగితే చైనా ఎక్కువగా నష్టపోతుందిఅందుకే భారత్ పట్ల ఆచుతూచి అడుగులు వేస్తున్న చైనా, తన వైఖరిని మార్చుకొని భారత్ తో స్నేహ హస్తం చాచింది. చైనాలో ఈ మార్పులకు కారణం జిన్ పింగ్. చైనా ప్రగతికి కొత్త బాటలు పరచిన డెంగ్ జియావోపింగ్ శకానంతరం- జియాంగ్ జెమిన్, హు జింటావోల ఏలుబడి పంథాలోనైతే జిన్ పింగ్ పాలన 2022తో ముగిసిపోవాలి. ఆ తరవాతా చైనా ప్రస్థానగతికి తానే దిక్సూచి కావాలన్న జిన్ పింగ్- 2013 నుంచి స్వయంగా ప్రస్తావిస్తున్న 'చైనీయుల కల'ను తానే సాకారం సాకారం చెయ్యాలని అభిలషిస్తున్నారు. అంతకుమించి నయా సిద్ధాంత ప్రయోక్తగా జిన్ పింగ్ సామ్యవాద ఆలోచనా విధానం చైనా రాజ్యాంగంలో చోటు దక్కించుకోనుంది. సజీవులై ఉన్నప్పుడే స్వీయసిద్ధాంతంతో పాటు రాజ్యాంగంలో చోటు దక్కించున్న మావో జెడాంగ్ సరసకు చేరుతున్న జిన్ పింగ్- అవినీతిపై జిన్ ఎత్తిన కత్తిగా పర్యవేక్షక సంఘా (సూపర్‌వైజరీ కమిషన్)నికి రాజ్యాంగబద్ధత కల్పించడం ద్వారా అధికారాల్ని మరింతగా గుప్పిట పట్టనున్నారు. భావిసవాళ్లకు ముందస్తు జవాబుగా చైనా అధికార మీడియా కీలక రాజ్యాంగ సవరణల్ని ఎంత సమర్థిస్తున్నా, ఏక వ్యక్తి నియంతృత్వంపై వెల్లువెత్తుతున్నాయి. ఎన్నో భయసందేహాలు! దార్శనికుడు డెంగ్ సారథ్యంలో చైనా ఆర్థిక సంస్కరణల ఏరువాక ప్రారంభించి ఈ ఏడాదికి నలభయ్యేళ్లు. పేదరిక నిర్మూలన కోసం బీజింగ్ సాగించిన కృషి మానవేతిహాసంలో మహాధ్యాయమన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు- నాలుగు దశాబ్దాల్లో చైనా 80 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దాటించగలిగిందని ృత్వంలో ఘనంగా శ్లాఘించారు. 2021- సీపీసీ శతవార్షికోత్సవ సంవత్సరం. అప్పటికల్లా ఒక మోస్తరు సౌభాగ్య సమాజాన్ని ఆవిష్కరించి దేశంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించబోతున్నామన్న షి జిన్ పింగ్- మరో మూడు దశాబ్దాల కార్యాచరణ ప్రణాళికను పందొమ్మిదో మహాసభల్లో సమర్పించారు. 2050నాటికి పటిష్ఠ, ప్రజాస్వామ్య, సామరస్య, ఆధునిక, సామ్యవాద దేశ సాక్షాత్కారమే లక్ష్యమంటూ ప్రణాళికాబద్ధంగా రెండు కాలావధుల్లో దాన్ని సాధిస్తామని సీపీసీ ప్రకటించింది. 2020- 35 మధ్య సంపూర్ణ ఆధునిక దేశంగా చైనా రూపాంతరీకరణ పూర్తి అవుతుందని, తరవాత పదిహేనేళ్లలో శాంతి సౌభాగ్యాల గొప్ప సమాజంగా పరిఢవిల్లుతుందని ఘనంగా చాటింది. అసమతుల, అసమగ్ర ప్రగతి దేశాభివృద్ధికి తానే సవాళ్లు రువ్వే ప్రమాదం ఉందన్న షి జిన్ పింగ్ - అవినీతిపై తీవ్ర పోరాటం సాగిస్తున్నారు. ఆ క్రమంలో తన రాజకీయ ప్రత్యర్థుల్ని కర్కశంగా అణచివేస్తున్నా రన్న ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. నిరంకుశ పోకడలు ఎప్పటికైనా తనకు ఎసరు పెట్టే ప్రమాదం ఉందన్న భీతితోనే రాజ్యాంగ సవరణలతో స్వీయస్థానాన్ని జిన్ పింగ్ సుస్థిరం చేసుకొంటున్నారన్న విమర్శలు ధాటిగా దూసుకొస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సామాన్య చైనీయుల నిరసన గళాలను అధికార యంత్రాంగం తొక్కిపడుతున్న తీరు- ఆందోళనకర భవిష్యత్తుకు ముందస్తు సూచిక అనడంలో సందేహం లేదు! ప్రపంచీకరణ, అంతర్జాల శకంలో చైనా అమేయ ఆర్థిక శక్తిగా అవతరించినా- సైద్ధాంతికంగా, సమాచార రంగంలోనూ ప్రబల శక్తిగా అవతరించలేదంటూ ఆ లోటుపాట్లను పూరించి ప్రపంచ గమనంపై తనదైన ముద్ర వేయాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తోంది. షీ జిన్ పింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి రెండేళ్ల ముందే జపాన్ ను తోసిరాజన్న చైనా, అమెరికా తరవాత రెండో ప్రబలార్థిక శక్తిగా అవతరించింది. 2010 నాటి స్థాయికి రెట్టింపు తలసరి ఆదాయం , స్థూల దేశీయోత్పత్తి లక్ష్యాల సాధనలోనూ దూసుకుపోతోంది. సైన్యం ఆధునికీకరణ వ్యూహాలు, ఇండో-పసిఫిక్ తీరంలో దుందుడుకు ధోరణులు షి జిన్ పింగ్ నేత ృత్వంలో చైనా విస్తరణవాద కాంక్షకు అద్దం పడుతున్నాయి. రష్యాలో అధికారం అప్పటికల్లా చేజారనివ్వని పుతిన్ రాజకీయ చాణక్యానికి దీటుగా చైనాలో జిన్ పింగ్ వ్యూహాలు - మునుముందు అంతర్జాతీయ ముఖచిత్రంలో గణనీయ మార్పుల అవకాశాన్ని ప్రస్ఫుటీకరిస్తున్నాయి. తాజాగా మాల్దీవులు సహా భారత్ చుట్టూ ముత్యాలసరం మాదిరిగా పద్మవ్యూహాన్ని పన్నుతున్న బీజింగ్- కడుపులో కత్తెర, నోట్లో చక్కెర చందంగా పావులు కదుపుతోంది.
మారుతున్న చైనా