పెను వివాద కేంద్రమైన పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా ఈశాన్య భారత వాసుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం వాటిలబోదని కేంద ప్రభుత్వం భరోసా ఇస్తున్నా- అసోం, చుట్టుపక్కల రాష్ట్రాల్లో నిరసనోద్యమ ధృతి తగ్గడం లేదు. లోక్సభామోదం పొంది ఇంకా రాజ్యసభలో నెగ్గాల్సి ఉన్న ఆ బిల్లును ఉపసంహరించుకునేదాకా ప్రధానమంత్రిని, కేంద్ర అమాత్యుల్ని అసోమ్ లో అడుగుపెట్టనిచ్చేది లేదని ఆందోళనకారులు హామీని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. పౌరసత్వ చట్టసవరణ ప్రతిపాదన వెలుగుచూశాక నిరుడు మే నుంచి బ్రహ్మపుత్ర లోయలో రాజుకున్న నిరసనలు, బిల్లు పార్లమెంటు దిగువ సభలో నెగ్గడంతోనే ప్రజ్వరిల్లాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్లకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్రమంత్రిమండలి సమ్మతించడం తరువాయి - ఎన్డీయేతో అసోం గణపరిషత్ తెగతెంపులు చేసుకొంది. ఇటీవలి ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపట్టిన మిజో నేషనల్ ఫ్రంట్ తోపాటు నాగాలాండ్ లో గిరిజన సమితి (ఎన్డీసీ), మేఘాలయ మంత్రివర్గం, వివిధ రాజకీయపక్షాలు, ఈశాన్యభారత విద్యార్థి సంస్థ(నెసో)... బిల్లును చాపచుట్టేయాల్సిందేనని గళమెత్తుతున్నాయి. పోటెత్తుతున్న అక్రమ వలసల మూలాన సొంతగడ్డపై తామే మైనారిటీలయ్యే దుస్థితి దాపురించిందంటూ ఎనభై దశకంలో ఆసు(ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్) ఆరేళ్లపాటు కొనసాగించిన ఆందోళన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆసు, కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎమ్ఎస్ఎస్) సహా నలభైకి పైగా సంస్థలు ఉద్యమపథంలో కదం తొక్కుతున్నాయి. భారీయెత్తున వలసదారులకు అధికారికంగా భారత పౌరసత్వం దఖలుపడితే స్థానిక భాషలు, సంస్కృతి, ఆర్థిక సామాజిక రంగాలు ఛిద్రమైపోతాయన్న భయాందోళనల లావా ఎగదన్నుతున్న వేళ- ఈశాన్య భారతం కుతకుతలాడుతున్న అగ్నిపర్వతాన్ని తలపిస్తోంది! | మొన్నీమధ్యే వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, ఒక్క అసోమ్ లోనే తిష్ఠ వేసిన 'విదేశీ అక్రమ వలసదారుల' సంఖ్య సుమారు 35 లక్షలు. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో బంగ్లాదేశీ అక్రమ వలసదారులు రెండు కోట్లకు పైబడినట్లు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభాముఖంగా ప్రకటించింది. అంతగా చిలవలు పలవలు వేసుకుపోయిన సమస్యకు పరిష్కారాన్వేషణలో ఏం జరిగింది? 2018 డిసెంబరు చివరిదాకా సాగిన అసోం పౌరుల వడపోత మహాయజం- సంక్షుభిత హృదయాలకు సాంత్వన ప్రసాదించే మాట ఎలాగున్నా, లక్షల మందిలో ఆరని ఆవేదన రగిలించింది. జాతీయ పౌర రిజిస్టర్ (ఎస్ఆర్‌సీ)లో 40 లక్షలమంది వరకు పేర్లు లేకుండాపోవడం గగోలు తేదీ పుట్టించింది. సమీక్ష దరిమిలా అదృశ్యమైన పేర్ల సంఖ్య కొంతమేర తగ్గిందంటున్నా, నిరసన ధ్వనుల జోరు ఉపశమించలేదు. ఈ దశలో జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదముద్ర పొంది చట్టరూపం ఈశాన్య భా భారతీయ పౌరులైపోతారన్న ఆలోచనే, ఆందోళనకారుల్ని కుపితుల్ని కేంద చేస్తోంది. మూడున్నర దశాబ్దాల క్రితం అక్రమ వలసల నిర్ధారణ నిరసనోద్యమ బ్రద్యులను విరుద్ధమైనదంటూ 2005 జులైలో సర్వోన్నత న్యాయస్థానం అడ్డంగా నెగ్గాల్సి కొట్టేసింది. ఆ పరిణామంతో 'జాతీయ నాయక్'గా ప్రాచుర్యంలోకి వచ్చి అసోం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన శర్బానంద సోనోవాల్, ఎన్నికల ఆందోళనకారులు హామీని భాజపా నిలబెట్టుకున్నదంటూ పౌరసత్వ బిల్లును స్వాగతించేసరికి ప్రతిపాదన ఆందోళనకారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మతం ప్రాతిపదికన రాజుకున్న పౌరసత్వం దఖలుపరచడమేమిటన్న ఘాటు విమర్శలు ఒకవంక, . చరిత్రాత్మక అసోం ఒడంబడిక స్ఫూర్తినే కాలరాస్తున్నారన్న పరుష వ్యాఖ్యలు మరోవైపు- అసోమ్లో సెగలుపొగలు కక్కుతున్న రాజకీయ చిత్రాన్ని కళ్లకు కడుతున్నాయి. గతంలో కుదిరిన అసోం ఒడంబడిక ప్రకారం- 1971, మార్చి 24వ తేదీ తరవాత ఈ గడ్డమీద అడుగిడిన బంగ్లా ప్రవాసులు (హిందువులైనా, ముస్లిములైనా) అందర్నీ విదేశీయులుగానే పరిగణించాల్సి ఉంటుంది. జాతీయ పౌర రిజిస్టరుకూ అదే తేదీ ప్రామాణికమైంది. ఈ అంశాన్ని ఉపేక్షించి డిసెంబరు 2014 లోగా ఇక్కడికొచ్చిన హిందూ బంగ్లాదేశీ వలసదారులకు భారత పౌరసత్వం దఖలుపరుస్తామనడం ఎంతవరకు సహేతుకమన్న ప్రశ్నలిప్పుడు దూసుకొస్తున్నాయి. బిల్లు చట్టమైతే ఎస్ఆర్ సీ హెూమియో ఫిజిషియన్లకు 'ఐఎంఏపేరిట ఇన్నాళ్లూ చేపట్టిన కసరత్తు వ్యర్థమే కదా అన్న అభ్యంతరాలకు సరైన సమాధానం కరవు! పౌరసత్వ సవరణ వల్ల ఏ దశలోనూ రాష్ట్రం పై అదనపు భారం పడే ప్రసక్తే లేదని కేంద్రప్రభుత్వం, శర్బానంద సర్కారు పదేపదే హామీలిచ్చాయి. స్థానికులకు ఏ అసౌకర్యమూ కలగకుండా వలసదారులు కుదురుకునేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్న సంయుక్త పార్లమెంటరీ సంఘం నివేదిక బహిర్గతం కావడం తరవాయికొలిమంటుకుంది. నష్ట నివారణలో భాగంగా, అసోం ఒడంబడికలోని ఆరో షరతు ప్రకారం- స్థానికుల రాజకీయ హక్కుల పరిరక్షణకు కేంద్రం గొడుగు పడతామంటోంది. 371 రాజ్యాంగ అధికరణను వర్తింపజేసి పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాల్లో స్థానికులకు కోటా కట్టబెడతామంటోంది. అదే జరిగితే హిందూ బెంగాలీలతో పాటు ముస్లిమ్ బెంగాలీల నుంచి నిరసన తప్పదు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా పరిణమించిన ఈ ఇరకాటం నుంచి కమలనాథులు ఎలా గట్టెక్కుతారో చూడాలి. పార్టీగతమైన సమస్య ఎలాగున్నా, ఈశాన్యంలో మళ్ళీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయన్నది యథార్థం. దీటైన పరిష్కారాల సాధనలో ఏమాత్రం జాగుచేసినా దేశం మరింత మూల్యం చెల్లించుకోకతప్పదన్నదే ఆలోచనాపరుల ఆక్రోశం!
సూరజ్-హైదరాబాద్