రాజకీయ ఎత్తుగడలో చిత్తైన ఆర్టీసీ కార్మికులు

ఒక బి హెచ్ పి వి గతించిన నాలుగు శతాబాల ఈ దేశ చరిత్రలో కార్మికులు పోరాటాలు చేసిన సంస్థలన్నీ పలుమీ తదుపరి రోజుల్లో ఏకంగా వాటి వాటి మనుగడనే కోల్పోయాయి. ఆ మాటకొస్తే అవి మనుగడ కోల్పోయే దశప్రారంభానికి నాందిగా నాయకులు, ఆయా సంఘాలు కార్మికుల శ్రేయస్సు పేర, ఉనికి అదిపత్యం కోసం ఉద్యమాలను తలకెత్తుకొనేవారంటే అతిశయోక్తి కాదేమో! కారణం విశ్లేషిసే మాత్రం, ప్రభుత్వ పెదల సార రాజకీయాలకు తోడు, చిత్తశుద్దిలేని ఉద్యమాలు, అంతర్లీన అజెండాతో ముందుకొచ్చే స్వార్థ ఉద్యమనాయకులు అని తేలుతుంది. ఒక రిజెన్సీ సిరామిక్స్, ఒక అల్విన్, ఒక ఐడిపిఎల్,ఒక బి హెచ్ పి వి ఇలా చెప్పుకుంటూపోతే ఎంతో ఉదాత్తమైన ఆశయాలతో, బలహీన వర్గాల జీవనోపాధికి, దేశ మౌలిక వసతుల బలోపేతానికి, పంచవర్ష ప్రణాలికల పుణ్యమా అని, పబ్లిక్ సెక్టారులో దేశం గర్వించే రీతిలో నెలకొల్పబడి, ఉన్నత శిఖరాలను అందుకొని, తదుపరి పాలకుల స్వార్థపూరిత దుష్పరి ణామాల ధాటికి వాటి కార్మికులను రోడ్డున పడవేసి నేడు కాలగర్భంలో కలిసిపోయినవి చాలానే ఉన్నాయి. కొండనాలుకకు మందువేయాడానికి బదులు ఉన్ననాలుకను ఊడబెరికినట్లు, సంస్థను ప్రక్షాళణ చేయకుండా, విక ృత రాజకీయ రాక్షసక్రీడ పరాకాష్టగా, ప్రజల ఆకాంక్షలు, మేలుకొలుపుతో సంబంధం లేకుండానే, ఆ దారిలో బిఎస్ఎన్ఎల్, బిపిసి, చివరకు ఓ ఎన్ జిసి, రైల్వేలు సైతం చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయ్! ఇక్కడ రెండు కారణాలను విశ్లేషించాలి- ఒకటి ఆయా సంస్థలలో సమకాలీన నిరుద్యోగ యువతకు అసూయ కలిగే అసంతుల్య అధిక వేతనం, రెండు ఆ వేతనానికి సమాంతరంగా సరితూగని పని ఉత్పాదన. వీటికి తోడు ఆయా సంస్థల కార్మికులకు కలిగిన ఉద్యోగ భద్రతతో పుట్టుకొచ్చిన నిర్లక్ష్య ధోరణి దాని పిల్లగా పుట్టుకొచ్చే “జవాబుదారీతనం ఇలాంటి ఉద్యోగులు స్వతహాగానే కొల్పోయే ప్రజల విశ్వాసం అందుకు తార్కాణం. ప్రజల విస్వాసం లేని ప్రభుత్వాలెలాగో, అలాగే ప్రజల సానుభూతిని ఆవస్యకత రూపంలో పొందలేని పబ్లిక్ రంగ సంస్థల పలు దోచుకోవడానికిమనుగడ కూడా అంతే! - ప్రభుత్వ ఉద్యోగులకైతే వారి చేసే పనికి విలువకట్టే ఉత్పాదన కొలమానమేదీ లేకపోవడం వల, వారిని నిలదీసే అవకాశం లేదు. అవేవో "పెర్ఫార్మెన్స్ ఇండెక్స్” లని ఆ మధ్య వారికి నచ్చేటట్లు వారే పెట్టుకొన్న కొలమానాల వల్ల ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఉద్యోగులకు ఖచ్చితమైన "బయోమెటిక్” విధానాన్ని అమలు చేయ చేయసాహసించలేని ప్రభుత్వాలు! ఒకవేళ సి.సి కెమారాల నిఘాలో బలవంతంగా సీట్లో కూర్చోబెట్టినా కూడా వారినుండి ఊడిపడని అక్కరకు రాలేదువచ్చేపని! గుర్రాన్ని నీటివరకైతే తీసుకు రాగలం గాని, దానిచేత నీరైతే తాగిపించలేం కదా! సంకల్ప సిద్ధి లేని పని, పనే కాదుగా! మన రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య వ్యవస్థ, ఉద్యోగ గణాలు, రాజకీయ నాయక గణాల పవితకలయికతో ఈ దేశ ప్రగతికి బాటలు వేయగల మహతర పరిపాలనా విధానాన్ని రూపొందిస్తే, నేడు ఆ లేమి”! కోల్పోయే ప్రజల విశ్వారా ప్రజల - ఇరువురి అపవిత్ర కలయికల పెడధోరణి ఎటుపోతోందో మనకు తెలిసి తెలిసిందేకదా! ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో శ్రమకు కొల ఇక ప్రభుత్వ రంగ సంస్థలలో శ్రమకు కొలమానాలు కల్పించుకొని, లాభనష్టాల భారిజుతో, లాభనష్టాల భేరీజుతో, అంకిత భావం, ఉత్తమ ప్రణాళికా రచనాచాతుర్యంగల ఉన్నతోద్యోగులతో, మెచ్చిన జీతాలతో తృప్తిగా జీవనం సాగిస్తూ సంస్థ ఉన్నతే తమ ఉన్నతిగా భావించి చెమటోడ్చే కార్మికులతో పైన తెలిపిన రకం సంస్థలు, వాటి పనితనంతో స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడంతో బాటు, ఎంతో ఉచ్చస్థితికి వెళ్ళడం జగమెరిగిన నాటి సత్యం. నేటి " మహా రత్న” సంస్థలూ అందుకు నిదర్శనం. సరిగ్గా అలాంటప్పుడే స్వార్థశక్తులు, అలాంటి సంస్థల సంపదలు . దోచుకోవడానికి, రకరకాల రూపాలలో రంగంలోకి దిగుతాయ్. అవి రాబోవు ప్రభుత్వ పథకాల తళుకుబెళుకులు కావచ్చు, కార్మిక సంఘాల నాయకుల రహస్య అజండాలు కావచ్చు. మయమర్మాలు తెలియని కార్మికులు వాటి రహస్య అజెండాలు కావచ్చు. మాయమర్మాలు తెలియని కార్మికులు వాటి ఆగమనాన్ని పసికట్టలేని రీతిలో ఉంటాయి. వాటి జిత్తులమారి వేషాలు. మాసంలోకి నెట్టబడి, ఉనికిన కల్పం మోసంలోకి నెట్టబడి, ఉనికినే కోల్పోయే దశకు చేరుకొన్న నేటి ఈ రోడ్డురవాణా కార్మికులే అందుకు ఉదాహరణ. సగటు కార్మికుని పని లోపం వల్ల సంస్థకు నష్టం రాలేదని నివేదికలు కోడై కూస్తున్నాయ్. కార్మికునికి నాడు ఇస్తున్న వేతనం వల్ల సంస్థకు నష్టం రాలదు. సంస్థకు ఆస్తులు సమకూర్చడం వల్ల నష్టం రాలదు. పైగా వాటి రాలేదు. సంస్థకు ఆస్తులు సమకూర్చడం వల్ల నష్టం రాలేదు. పైగా వాటి విలువ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది కూడా! మరి ఎందుకు నష్టం? పిడుగునుసంస్థకు చేసి విచక్షణా రహిత కొనుగొళ్ళు అంటే విడిభాగాలు, టైర్లు వగైరా వాటి కొనుగోలులో చూపే చేతివాటం. లాభదాయక రూట్లను ప్రైవేటుకు దొడ్డిదారిన వదలి, నష్టం వచ్చే పల్లె రూట్ల వంటి వాటిని ఆదుకోవడానికి, రకరణ సంస్థకు రుద్దడం. అలాగే లాభాల రూట్లలో అద్దె బస్సులను అనుమతిస్తూ వాటి వల్ల సంస్థకు నష్టం లేదని లెక్కలు చూపి వాటి అద్దెభారాన్ని సంస్థకు రుద్దడం. పైసా అవినీతికి ఆస్కారం లేని కండక్టరు పై తనిఖీ కి స్కాడ్స్ పేర, అలాగే అక్కరలేని అనుత్పాదక ఉద్యోగులను పైలెవెల్లో పెంచేసుకొని, వారికి కార్లు, లక్షల అలవెన్సులతో సంస్థకు గుదిబండగా మారడం. ప్రభుత్వం, పౌరపాలనా సంస్థలు సకాలంలో రాయితీలు విడుదల చేయకపోవడం. ఇన్నేళ్ళనుండి ఆయా డిపోలకనుబంధంగా ఉన్న విలువైన ఖాళీ స్థలాలను లాభసాటిగా మలుచుకోలేకపోవడం, పైగా వాటి కట్టాలను నిలువరించలేక పోవడం. అభివృద్ధిచెందిన దేశాల ప్రభుత్వాలు సైతం ప్రజారవాణా సంస్థలకు 40 శాతం వరకు వ్యయాన్ని భరిస్తూ వుంటే, పేద దేశాలు వాటి పేద ప్రజల రవాణాకు ఇంకా ఎక్కువే కేటాయించవలసింది పోయి, మొండిచేయి చూపిస్టున్నా, గళమెత్తలేని అసహాయ, చైతన్యలేమితో ప్రజలు కొట్టిమిట్టడుతున్నారు. ప్రజా రవాణా పేద ప్రజలకు ఎంత మేలు చేస్తుందో అనడానికి నేడు మెట్రో రైలులో గ్రామీణ పేదలు కానరావకపోవడం కంటే మించిన ఉదాహరణ వేరే అక్కరలేదుకదా! ఇలా కర్ణుడి చావుకు నూరుకారణాల చందాన, కార్మికులపై పెత్తనం చెలాయించే ఉన్నతోద్యోగుల హ్రస్వ దృష్టి, సకాలంలో లేని రాష్ట్ర పాలనా జోక్యం కలిసి నేడు సంస్థను అంపశయ్యపై చేర్చాయి. ఇక సంస్థ చేరుకున్న నేటి అవసానదశను ఒడిసిపట్టుకున్న ఒకానొక రాజకీయ ఆధిపత్య ఎత్తుగడను కూడా కొట్టిపాడేయలేము. మలి దశలో ఐనా రాష్ట్ర పాలనా పగ్గాలు దక్కుతాయని ఆశించిన మెజారిటీ సామాజిక వర్గానికి చేదు అనుభవం ఎదురైంది. అలా దక్కకపోగా, నేటి పాలన కుటుంబం మరింత బలోపేతానికి పడే అడుగులు చూసి, అందివచ్చే ప్రతి అవకాశం కోసం ఎదురుచూసే అసంతృప్త వర్గం, ఈ సమ్మెను ఒక ఆయుధంగా మలచుకో చూడటంలో రాజకీయ కోణం ఉందనే ఊహాగానాలను కూడా కొట్టిపారేయలేం. మారిన కోణంలో పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, హస్తినాపురం అండతోనే ఈ పథక రచన అనే గుసగుసలూ లేకపోలేదు. అది వూహాగానమే ఐతే ఢిల్లీ పెద్దలు ఈ సమస్యకు శుభం కార్డు వేసి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవడమేకాక రాబోవు కాలానికి ప్రజా మన్ననలు కూడా పొందే శుభ తరుణమిది. ఏదిఏమైనా గాని, రెండు ఆబోతుల పోరాటంలో మధ్యన చిక్కిన లేగదూడలా నలిగిపోయింది, పోతున్నదీ అమాయక ఆర్టీసీ కార్మికులైతే, గురితప్పిన ఈ శరాఘాతానికి శాస్వతంగా మిగిలేది మాత్రం, సామాన్య ప్రజల రవాణా జేబులకు పెద్ద చిల్లు. రాజకీయ వర్గాల ఆధిపత్యానికి అనేక దారులు ఉంటాయ్. ఈ దారే అలాంటి దారి కాకూడదని, సంస్థను సమూలంగా ప్రక్షాళణ గావించి, అమాయక కార్మికులను పావులు చేయకుండా వెంటనే ప్రభుత్వాధినేత తనదైన వినూ తనదైన వినూత్న శైలిలో పెద్దమనసు చేసుకొని, కార్మికుల జీవనోపాధికి భరోసా ఇచ్చి, సామాన్య ప్రజలకు చార్జీల రూపంలో పడే “ప్రైవేటు పిడుగును” ఆపాలని కోరుకుందాం!


పొలమూరి ప్రసాదరావు


సామాజిక, పర్యావరణ సాంకేతిక విషయ నిపుణులు.