జీవజాతుల సంరక్షణకు పాటుపడదాం

జీవజాతుల వన్యప్రాణు అనేక సంస్థలుం భూమి పైన వన్యప్రాణి అంటే మనుషులతో సేహంగా కానీ కలిసి జీవించలేని మచ్చిక చేసుకోలేని కలు, జంతువలె సమాజంలో మనుషులతో ఇమడలేక ,మనకు దూరంగా అడవులలో , పెద్ద పెద్ద పొదలలో నివాసాన్ని ఏర్పరచుకుంటాయో వాటిని వన్య ప్రాణులు అంటారు. వన్య ప్రాణి సంరక్షణ : ప్రపంచ వ్యాప్తంగా వన్య ప్రాణి సంరక్షణ వాటి మనుగడ ప్రశ్నార్లకమ వుతున్న ప్రస్తుత తరుణంలో వాటి సంరక్షణ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రతీ సంవత్సరం అక్టోబర్ 4 నుండి 10 వరకు అన్ని దేశాలు ప్రపంచ వన్యప్రాణి వారోత్సవాలు ఘనంగా జరుపుతారు. మొదటి సారిగా మార్చ్ 24, 1925 న జర్మనీ లోని బెర్లిన్ లో జంతు ప్రేమికులు ఈ దినోత్సవాన్ని జరిపినారు. ఆనాటి కార్యక్రమానికి కేవలం 5000 మంది మాత్రమే హాజరయినారు. ఆ తరవాతి కాలంలో ప్రపంచ వన్య ప్రాణి వారోత్సవాలను అక్టోబర్ 4 నుండి 10 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలు చాల ఘనంగా జరపడం ఆరంబించారు. జంతు ప్రేమికుడు జిమ్మర్మన్ కృషి కారణంగా ఇది అన్ని దేశాలకు విస్తరించింది. అడవులు అంతరించడం వల్ల వన్యప్రాణుల కు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుంది.. వన్యప్రాణుల సంరక్షణకు అనేక సంస్థలు వెలిశాయి. వన్యప్రాణుల సంరక్షణ రెండు దశలలో చేస్తారు. మొదటిది భూమిపైన గల భౌతిక పరిసరాలను, మొక్కల సమాజాన్ని కాపాడడం, రెండవది జీవవైవిధ్యాన్ని సంరక్షించడడం. అంతరించిపోతున్న అటవీ ప్రాంతాలు ప్రపంచంలోని ఎన్నో రకాల జీవకోటికి ఆశ్రయం ఇస్తున్న గ్రహం భూమి. ఈ వన్య ప్రాణులను సంరక్షించడం కోసం ప్రత్యేకమైన సంస్థలు వెలిశాయి. అవి ప్రకృతి వనరుల సంరక్షణ గురించి అంతర్జాతీయ యూనియన్ (ఐయుసిఎన్) మరియు ప్రపంచ వన్య ప్రాణుల నిధి(డబ్ల్యుడబ్ల్యుఎఫ్) అనేవి. మన దేశం లో పులులు ఏనుగులు వన్యమ ృగాలు గణనీయంగా తగ్గుతున్నాయి. వరల్డ్ యానిమల్ డే యాక్టు ప్రకారం జంతువుల ఆకలి, కవి దాహాలు తీర్చాలి. వానిని ఎటువంటి బాధ అసౌకర్యం కలిగించరాదు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. అనేక దేశాల వారు వన్యప్రాణుల ప్రాముఖ్యతను తెలియజేయడానికి వన్యప్రాణులను జాతీయ జంతువులుగా గుర్తించారు. ఉదాహరణకు భారతదేశం పులి, ఆస్ట్రేలియా కంగారు లాంటి వాటిని ప్రకటించి వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జాతుల మొక్కలను, జంతువులను కాపాడవలసిన నైతిక భాద్యత మానవునిదే. కానీ మానవుని తీవ్ర అత్యాశ ఆహారం కోసం అన్వేషణ, స్థలం కోసం వెతుకులాట,పంటల పండించుట నుండి తు బలులు నిరు.. వన్యనున్నాయని పవైఖరి అరుస్తున్నాయికొరకు భూమి ,పరిశ్రమలు స్థాపన కోసం , జలాశయములు, ఆనకట్టలు నిర్మించడం మొదలైన కారణాల వలన రోజు రోజుకి అడవుల వైశాల్యం క్రమేణా తగ్గుతూ వస్తుంది. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన వన్య ప్రాణులకు నిలువ నీడ లేకపోవడం చేత,జనారణ్యంలో ఇమడలేక అవి క్రమేణా అంతర్గాన మవుతున్నాయి. కనుమరుగైపోతున్నాయివన్యప్రాణుల వేటాడడానికి కారణాలు అనేకం. వానిలో కొన్ని నగిషీలు కళాకృతులకోసం దంతాలు , మాంసం కోసం , లైంగిక ఔషదాల కోసం వానిని సంహరించడం, అడ్డంగా అడవుల నరికివేత, నీటి నిల్వ కోసం ఆనకట్టలు , రిజర్వాయర్‌ నిర్మాణం, అడవులలో మంటలు, పర్యావరణం జంతువులను కాలుష్యం ఇలాంటి కారణాల వల్ల చాల జాతులు అంతరించిపోతున్నాయి. భూమి సగటున రోజుకు ఒక జాతిని కోల్పోతుంది. ఇలా అంతరించిపోయే వానిలో మనదేశంలో ఈ మధ్యనే అంతరించి పోతున్న జీవులు చిరుతపులులు . అంతర్జాతీయ గణాంక సంస్థవారు అంతరించిపోయే అవకాశం వున్న వానిని ఒక పట్టికను మామూళ్ల తయారుచేసి దానిని రెడ్ డేటా బుక్ లో ప్రచురించడం జరిగింది. వన్యప్రాణి సంరక్షణ విషయంలో ప్రభుత్వం అవలంభిస్తున్న అనాలోచిత వైఖరి కారణంగా అరుదైన జంతువులు అంతరించిపోతున్నాయని పర్యావరణ విభాగంప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వన్యప్రాణి చట్టాలను గట్టిగా చూస్తున్నాయన్న అమలు పర్చాలని, జంతు బలులు నిషేధించాలని కోరుతున్నారు. వరల్డ్ యానిమల్ డే యాక్టు ప్రకారం జంతువుల ఆకలి, దాహాలు తీర్చాలి, వాటికి ఎటువంటి అసౌకర్యం, బాధ కలిగించ రాదు. వ్యాధులు గాయాల నుండి కాపాడాలి. జంతువులను క్రూరమైన హింస యాతనలనకు గురి చేయరాదు. వర్షం, చలి, ఎండల నుండి కాపాడాలి పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. కానీ, భారతదేశంలో జనాభా విస్పోటనం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి మొదల్కెన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. ఒకపుడు దాదాపు 35%గా ఉన్న అడవులు నేడు 21శాతానికి పడిపోయింది. దీంతో పర్యావరణ సమతా ల్యానికి విఘాతం కలుగుతాంది. అడవులు "పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే జీవ ,వృక్ష సమగ్రాభివృద్ధి ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని రూపొం దించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని వాటి అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని, 2006లో జా తీయ కన్పించే పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చింది. వాతా వరణ మార్పు (క్లైమేట్ చేంజ్) , గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి అడ వుల పరిరక్షణ ఎంతో అవసరం. అడవుల పరిరక్షణ, నిర్వ హణ అనే అం శం భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అడ వులను వాణిజ్య సంబంధాలు ప్రాణి సంరకు అంగళ్లు, సభులను, అరుస్తున్నాయి. ఆ మునిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా నిర్వహి స్తున్నాయి. ఎరిగిపోతున్న జనాభాతోపాటు మనిషి పోకడల కారణంగా అడవులు అన్యాక్రాంతమవుతున్నాయి. ఒకప్పుడు విశాలంగా ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిన అటవీ ప్రాంతములు రానురాను కనుమరుగైపోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ అటవీ ప్రాణుల వేట యధేచ్చగా జరుగుతుంది. జింకలు ,ఏనుగులు , దుప్పిలు, అడవిపందులు, కుందేళ్లు, నెమళ్లు, కొండగొర్రెలు,పులులు తదితర జంతువులను వేటాడి వాని మాంసాన్ని విక్రయిస్తున్నారు. కొన్ని జంతువుల చర్మాలకు డిమాండ్ పెరగడంతో వానిని అధిక ధరలకు అమ్ముతున్నారు. పక్షులను కూడా వేటాడుతున్నారు. మన దేశానికి వచ్చే వలస పక్షులను, అరుదైన జాతి పిట్టలను చంపి సమీపంలో గల అంగళ్లు, సంతలలో అమ్ముతున్నారు. వీనిని అరికట్టే వన్యప్రాణి సంరక్షణ అధికారులు కొందరు మామూళ్ల మత్తులో మునిగి ఉంటున్నారనే ఆరోపణలు అక్కడక్కడ వినవస్తున్నాయి. ఈ తరహా అక్రమ వేటను, జంతు మాంస విక్రయాలను అరికట్టి మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన వన్యమృగ సంరక్షణ విభాగం, అటవీ శాఖ, మూగ జీవాల సంరక్షణ సంఘాలు చోద్యం చూస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దిగువ స్థాయి సిబ్బంది వేటగాళ్ళ తో కుమ్మక్కై వాటిని రక్షించే ప్రయత్నం చేయడము లేదని తెలుస్తోంది. మరి కొన్ని ప్రాంలలో వేటగాళ్లతో కుమ్మకై మాంసంను పట్టణాలకు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రాంతములో దట్టమైన అడవులు గల జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ తదితర ప్రాంతములు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలలో విస్తరించి వున్న శేషాచలం అటవీప్రాంతం కూడా క్రమంగా అంతరించిపోతుంది. దీనితో ఈ ప్రాంతములో కనిపించే అరుదైన జంతువులు కనుమరుగైపోతున్నాయి. మన దేశంలోనే ప్రకృతి సిద్ధంగా ఉన్న అతి పెద్ద జంతు ప్రదర్శనశాల లలో మొదటిస్థానంలో ఉన్న తిరుపతి ఎస్వీ జూపార్క్, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోనే అరుదైన జంతువు "పునుగుపిల్లి"తో "పునుగుపిల్లి”తో పాటు అడవికోళ్ళు, కొండగొర్రెల సంరక్షణ కూడా ఇక్కడే చేపడుతున్నారు. తిరుపతి అటవీశాఖ అధికారులు అరుదైన జంతువుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గతంలో అంతరించిపోయే దశకు చేరుకున్న అడవికోళ్లు, కొండగొర్రెలను రక్షించి వాటి ఉత్పత్తిని పెంచారు. శేషాచలం అటవీప్రాంతంలో అరుదుగా కన్పించే జంతువులను ఎస్వీ జూపార్క్ అధికారులు పూర్తిస్థాయిలో సంరక్షిస్తు జంతువుల పరిరక్షణకై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తూ అరుదైన జంతుజాలాన్ని కాపాడుతోంది.


ఈ కాళంరాజు వేణుగోపాల్ పెద్ద నాగులవరం


మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412