దెశంలో సగం జనాభాకు ప్రధాన ఆధారమైన వ్యవసాయ రంగం ఆశించిన పురోగతి సాధించలేకపోతోంది. దీనిపై ఆధారపడ్డవారు స్థిరమైన ఆదాయాలు దక్కక ఒక్క పూట తిండికీ నోచుకోలేకపోతున్నారు. సాగుభూమి ఉన్న రైతులే సేద్యం లాభసాటిగా లేక సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. భూమిపై ఎలాంటి హక్కులూ లేని ఈ రైతుల్ని వాస్తవ సాగుదారులుగా గుర్తించి అన్ని రకాల ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరముంది. ఈ దిశగా చట్టాలను అమలు చేయడం ద్వారా కౌలుదారులతో సహా సాగుదారులందరికీ సేద్యంపై భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే! సాగుచేసే ప్రతి రైతుకూ సేద్యం లాభసాటి అయినప్పుడే నిజమైన హరిత విప్లవ ఫలితాలు అందుతాయని పాలకులు గుర్తించాలి. దేశంలో వ్యవసాయం వదిలేస్తున్నవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సొంతభూమి ఉన్నవారూ గిట్టుబాటు కాని సేద్యంకన్నా కూలిపని చేసుకుంటే కుటుంబాన్ని పోషించుకోవచ్చన్న ధీమాతో సాగుకు స్వస్తి చెబుతున్నారు. ఓ ప్రణాళిక ప్రకారం సేద్యంచేస్తూ మార్కెట్ నైపుణ్యాలను అలవరచుకుని వ్యవసాయంలో పలువురు రైతులు రాణిస్తున్నప్పటికీ, ఈ కొందరి విజయాలపట్ల అందరిలో అవగాహన కల్పించాల్సిన అవసరముంది. సేద్యాన్ని వదిలేస్తున్న భూ యజమానుల నుంచి సొంతభూమిలేని రైతులు, కూలీలు కూడా పొలాలను కౌలుకు తీసుకుని సేద్యం సాగిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం ఇలా క్రమంగా చేతులు మారుతోంది. పట్టా భూములున్న రైతుల కన్నా కౌలుదారుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మారిన పరిస్థితుల్లో కౌలు సేద్యం మొత్తం సాగుభూమిలో 50 శాతం వరకు ఉండొచ్చని రైతుసంఘాల అంచనా. పలురకాల వృత్తుల్లో సంపాదించుకున్నవారంతా గ్రామాల్లో భూములు కొనుగోలు చేస్తుండటంతో సాగుభూముల్లో అధిక శాతం కౌలుదారులే పండించాల్సి వస్తోంది. దురద ృష్టవశాత్తూ భూయజమానులకు అందే ఎలాంటి రాయితీలూ వీరికి అందకపోతుండటం వల్ల సేద్యంలో మిగులుబాటు ప్రశ్నార్థకమవుతోంది. కౌలు ధరలు పెరిగిపోతుండటం, కూలీల కొరత తదితర సమస్యలతో కౌలుదారులకు తిప్పలు తప్పడం లేదు. దేశంలోని మొత్తం సాగుభూమిలో సుమారు 40 శాతానికి పైగా కౌలురైతులే ఉన్నారని అంచనా. ఒక రైతుకు ప్రభుత్వపరంగా అందుతున్న ఇన్పుట్ సబ్సిడీలు, పంట రుణాలు, బీమా సదుపాయాలు కౌలుదారులకు దక్కడం లేదు. భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోవడంవల్ల వీరికి ప్రభుత్వరంగ బ్యాంకులేవీ అప్పులివ్వడం లేదు. దేశంలో ఏటా సుమారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైగా పంట రుణాలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని మొత్తం సాగుదారుల్లో నిజానికి 25 శాతానికైనా పంటరుణాలు దక్కడం లేదన్నది వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కౌలుదారులకు రుణాలు అందించేందుకు రైతుమిత్ర బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కాలంలో వీటిని తొలగించారు. 'సంయుక్త బాధ్యతా బ ృందాలు' ( జాయింట్ లయబిలిటీ గ్రూపులు)గా మార్చారు. వీరిలో కనీసం ఎనిమిది శాతం మంది కౌలుదారులకైనా రుణాలు అందించలేకపోయారు. సొంత భూమి కలిగి సేద్యం చేస్తున్నవారికయ్యే ఎకరా సగటు ఖర్చులతో పోల్చితే కౌలుదారులకు రెట్టింపు పెట్టుబడి అవుతోంది. ఎకరా కౌలుకు ఎకరా కాలుకు కోస్తాలో సగటున రూ.30 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో కౌలురైతుకు మిగిలేదేమీ ఉండటం లేదు. కౌలు ఎంత ఉండాలనే అంశంపై రెవిన్యూ చటాలోని పలు సెకను సషంగా నిర్వచించినా అవి అమలు కావడంలేదు. కౌలు ధరలపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నియంత్రణ లేకుండాపోయింది. చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు అమలుచేసిన మలుచేసిన రుణమాఫీ వల్ల రెండు రాష్ట్రాల్లో పట్టాదారు పాసుపుస్తకాలున్న రైతులకే కులకు ప్రయోజనం దక్కింది. పాసుపుస్తకాలున్న ప్రతి రైతుకూ ఉచిత ఎరువుల పథకం వర్తింపజేస్తామని, ఎకరాకు నాలుగు వేల రూపాయలు నేరుగా కౌలుదారుల వారి ఖాతాలో వేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి నిరుడు ప్రకటించారు. వాస్తవంగా పంటలు సాగుచేస్తున్న తమకు దీనివల్ల ఎలాంటి మేలు జరగదన్న ఆందోళన కౌలురైతుల్లో వ్యక్తమవుతోంది. అయితే వాస్తవ సాగుదారుల అంచనా కోసం త్వరలోనే సర్వే చేపట్టి, వారి ఖాతాల్లోనూ కాకపోయినాఉచిత ఎరువులకిచ్చే మొత్తాన్ని వేస్తామని ప్రభుత్వం ప్రకటించడం తెలంగాణ కౌలుదారులకు పెద్ద ఊరట. ఇదే తరహాలో ఆన్లైన్లో పాసుపుస్తకాల ఆధారంగా విత్తనాల పర్మిట్లు జారీచేసే విషయంలోనూ కౌలు రైతులకు మేలు చేకూర్చాలి. ప్రకృతి విపత్తులవల్ల వాటిల్లే నష్టాలు తట్టుకునే శక్తి కౌలురైతులకు ఉండదు. భూయజమానుల పేరిట వచ్చే పరిహారం చెక్కులు దక్కించుకోవడానికి ఒక్కోసారి నానాపాట్లూ పడాలి. భూమి కౌలుపత్రాలు లేకపోవడమూ దీనికి కారణం. ఈ దుస్థితిని కమిషన్ వాస్తవ సరిదిద్దడానికి ఏర్పడిన జయతీఘోష్ కమిషన్ వాస్తవ సాగుదారులను గుర్తించి, వారికి ప్రభుత్వపరంగా అందే రాయితీలన్నీ అందించాలని సూచించింది. కౌలుసేద్యానికి ఎలాంటి భరోసా లేకపోవడం, వ్యవసాయ పెట్టుబడులు పెరుగుతున్న తీరును దృష్టిలో పెట్టుకుని సొంతభూమి ఉన్న రైతులతో సమానంగా వీరికి అన్ని ప్రయోజనాలు దక్కాలని, వారందరినీ సంస్థాగత పంపి సంస్థాగత పరపతి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొంది. ఈ సూచనలూ అమలు కానేలేదు. విభజనకు ముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు విడివిడిగా కౌలుచట్టాలున్నాయి. తెలంగాణ చట్టం ప్రకారం మహిళలు, చిన్నపిల్లలు, వికలాంగులు, మాజీ సైనికులు మినహా అసలు భూమిని ఎవరూ కౌలుకు ఇవ్వడానికి వీలులేదు. ఒకవేళ ఇతరులెవరైనా కౌలుకు తీసుకున్నా వారికి ఎలాంటి రాయితీలూ దక్కవు. ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం భూమన ఎవరైనా కలుకు ఇవ్వవచ్చు. ఇస్తే కనీసం ఆల్లు ప్రకారం భూమిని ఎవరైనా కౌలుకు ఇవ్వవచ్చు. ఇస్తే కనీసం ఆరేళ్లు ఇవ్వాలి. అయితే వీరిమధ్య ఒప్పందం రిజిస్టరు కావాల్సి ఉంటుంది. పండే వారు తమ వంమధ్య దప్పందం రద్దలు కొని ఉంటుంది. ఎందన్న పంటను బట్టి కౌలు ధర ఉంటుంది. ఈ రెండింటిని క్రోడీకరించి మధ్యే మార్గంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011లో కౌలు రైతుల కష్టాలు తీరుస్తామంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'భూమి లైసెన్స్ కలిగిన వ్యవసాయదారుల చట్టం-2011'ను అమలులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం పండించే భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కు లేకపోయినా సొంత భూమి కలిగిన రైతులతో సమానంగా ఈ చట్టం ద్వారా ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. అమలు చేసిన ఏడాది కేవలం ఆరు లక్షల మందికి ప్రయోజనం కల్పించి, తరవాత మమ అనిపించింది. ఈ నేపథ్యంలో గతేడాది నీతి ఆయోగ్ కౌలుదారుల సంక్షేమం కోసం నమూనా కౌలు చట్టం ముసాయిదా రూపొందించి రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. పాత చట్టంలోని ఎన్నో అంశాలకు పరిష్కారాలు చూపుతూ రూపొందించిన ఈ ముసాయిదా ప్రకారం భూయజమాని, కౌలుదారు మధ్య ఒప్పంద పత్రం రిజిస్టరు కాకపోయినా, సర్పంచి లేదా స్థానిక అధికారులు వీరి మధ్య లీజును ధ్రువీకరించినా, దీని ఆధారంగా కౌలుదారులకు అన్ని ప్రయోజనాలు దక్కుతాయి. ఒకవేళ వివాదాలు ఏర్పడితే సివిల్ కోర్టుల జోక్యం లేకుండా కిందిస్థాయిలోనే పరిష్కారానికి పలు సూచనలు ఇందులో ఉన్నాయి. నీతి ఆయోగ్ ముసాయిదాలోని ఒకటి రెండు మంచి అంశాలను తీసుకునేందుకు కొన్ని రాష్ట్రాలు ఉత్సాహపడినా, ఒడిశా తప్ప ఏ ఒక్క రాష్ట్రమూ ముసాయిదాను పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇష్టపడలేదు. ఇది చట్టరూపం దాలిస్తే కార్పొరేట్ వ్యవసాయానికి తలుపులు తెరచినట్లేనన్న భయాలు తీవ్రస్థాయిలో వ్యక్తమయ్యాయి. ఇలా చట్టాలు, చర్యలు కార్యాచరణలో విఫలమవుతుండటంవల్ల కౌలుదారుల శ్రేయం నీటిమీద రాతలవుతున్నాయి. కౌలుదారులకు రక్షణ లేకపోవడం, వ్యయనియంత్రణ వ్యూహాల లోపం, సాగు పద్ధతులు ఆచరించకపోవడం, విపణిలో దోపిడి, మద్దతు ధరలు కొరవడటం, మార్కెట్ నైపుణ్యాల లేమి సేద్యాన్ని భారంగా మార్చేస్తున్నాయి. చట్టాల సరళీకరణ అవసరం చట్టాల సరళీకరణ అవసరం దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరాభివృద్ధికి వ్యవసాయం ఊతం కావాలంటే సాగుచేసే ప్రతి ఒక్కరికీ సేద్యం లాభసాటిగా ఉంటుందనే భరోసా ఇవ్వాలి. కౌలు రైతుల ప్రయోజనాలను విస్మరించి ముందడుగు వేయలేమని పాలకులు గుర్తించాలి. అప్పుల కింద పంట అమ్మేశాక పోషణ కోసం రైతుల బియ్యం కూడా కొనుక్కోవాల్సి వస్తోంది. పిల్లల చదువులు, శుభకార్యాలు, ఆరోగ్య వ్యయాలు అన్నీ భరించాల్సి రావడం రైతులపాలిట శాపమవుతోంది. ఈ పరిస్థితి మారాలి. సొంత భూమి ఉండి పట్టణాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడినవారు తమ దగ్గర కౌలు తీసుకున్నవారికి ఒప్పంద పత్రాలు ఇచ్చి సహకరించడం ద్వారా పరిస్థితుల్లో కొంతమేర మార్పు తీసుకురావచ్చు. ఈ పత్రాలు చూపి భూమిపై కౌలుదారులు యాజమాన్య హక్కులను ఎక్కడ లేవనెత్తుతారో అంటూ భయపడాల్సిన అవసరం లేదు. దీనిపై ప్రభుత్వాలు పలుమార్లు భరోసా ఇచ్చినా భూయజమానుల్లో భయం పోలేదు. ఒప్పంద పత్రాల వల్ల ఆరుగాలం కష్టపడే రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీలతో పాటు పరిహారాలు అందే వీలుంటుంది. కౌలు చట్టాలను సరళీకరించి ప్రతి ఒక్కరికీ రాయితీలు అందేలా ప్రభుత్వాలు చూడాలి. నగదు బదిలీలో భాగంగా రాయితీలను యజమానుల ఖాతాల్లో జమ అయితే వాటిని కౌలుదారులకు అందించేలా, లేదా వాస్తవ సాగుదారులను గుర్తించి సబ్సిడీలు అందజేసేలా ఏర్పాట్లు చేయగలిగితేనే ప్రయోజనం ఉంటుంది. దేశంలో తుల జీవన ప్రేమ రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్న సత్యాన్ని పాలకులు గుర్తించాలి. రెండో హరిత విప్లవం ఎందన్న సత్యాన్ని పాలకులు గుర్తించాలి. 00డా వాంత విప్లవం సాధించాలని డాక్టర్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు పిలుపిస్తున్నా ప్రభుత్వ చర్యలు ఆ దిశగా లేవు. పంట పండించే క్రమంలో అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వాటికి పరిష్కారాలను సత్వరమే చూపాలి. సాగువ్యయం తగ్గించే మార్గాలు తెలియజేసి, అధిక దిగుబడులు సాధించి మంచి ధరలు పొందే పరిస్తితులు కల్పించాలి. కరు కదలించే ప్రతి రైతుకూ వ్యవసాయం లాభసాటిగా మారేలా సేద్య సంస్కరణలను సత్వరమే చేపట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలి.
| కౌలు రైతు ఇంట సిరులపంట!