కాలం చెల్లుతున్న కవితాకాలం

విజయనగర శ్రీరంగరాయల గారు దామెర్ల వెంకటాద్రి ద్వారా బ్రిటిష్ వాళ్ళకు మద్రాస్ (చెన్నై)లో “జార్జికోట" నిర్మాణానికి భూమి ఇచ్చిన పత్రంలోని ఇంగ్లీషు భాషను చదవడానికి ఆమధ్య ప్రయత్నం చేసాను. ఆ 17వ శతాబ్దపు దస్తావేజు ఇంగ్లీష్, నా పి.జి బుర్రకు ఓపట్టాన పట్టలేదు. నేడు అలంకారంగా మిగిలిన అంత క్లిష్టమైన బాటు పురాతన ఆంగ్లం అది. దాన్ని చదవమని, ప్రక్కనే ఉన్న పట్టభద్రుని సరదాగా కోరాను. చదవలేకపోయాడు సరికదా, పైగా నేడు మనందరితో బాటు ప్రపంచవ్యాప్తంగా అమోదించి అర్థం చేసుకొనే ఆంగ్లముండగా, ఆ ఓల్డ్ ఇంగ్లీష్ మనకంత అవసరమా అని ప్రశ్న ఒకటి సూటిగా సంధించి పోయాడు. ఔరా, తరాల అంతరం అంత బలీయమైనదా, అని విస్తుపోవడం నావంతైంది! అటువై పెళ్ళిన ప్రతిసారి కలకత్తా (కోల్ కతా)లో బ్రిటిష్ కాలపు ట్రాము బండిని ఎక్కి మరీ సరదా తీర్చుకోవడం అలవాటు నాకు. నేడు వాటిలో ఒకటో రెండో అలంకారంగా మాత్రమే నడుపుతున్నారు. కాని నేటి ప్రయాణవసరాలకు మాత్రం కాదనేది అందరికీ తెలిసిన సత్యము. అన్ని ప్రముఖ స్టేషన్ల దగ్గర నాటి స్టీమ్ ఇంజన్లను (నమూనాలను) గతవైభవ చిహ్నంగా ఉంచింది. రైల్వేశాఖ! మన సికింద్రాబాద్ రైల్ నిలయం దగ్గరకూడా అలాంటిది ఒకటి ఉంది. అలాంటి ప్రయత్నాలలో భాగమే మన కాకినాడ జె.ఎన్.టి.యు ఆవరణలో ఏకంగా నాటి వాయుసేన వాడిన ఖాళీ విమానాన్ని అదే వరవడిలో ఉంచింది! దాని గతవైభవాన్ని నెమరు వేసుకుంటామే గాని నేడందులో విహరించగలమా? దశాబ్దాల క్రితం మనం రష్యా దగ్గర కొన్న మిగ్ 20 రకం విమానాలు కాలం చెల్లి, యువ ట్రైనీలను పొట్టన పెట్టుకుంటూ పిట్టల్లా రాలిపోతున్నాయి. వాటి ఖరీదు దృష్ట్యానో లేక నాటితరం వాటి మోజును వీడలేకో గాని మన సైన్యంలోని పెద్దలు, వాటిని విడనాడకుండా, యువ సైనికులను నేల రాల్చేస్తున్నారు. దేశంలోని డిండిగల్, యలహంక లాంటి వాయు సైన్య శిక్షణ స్థావరాల సమీపంలోని రైతు సోదరులు వారి పొలాలో ఎప్పుడు ఏ మిగ్ మీదపడుతుందో అని బిక్కు బిక్కు మంటూ ఎగ్ లు ఎపుడెపుడు ఉంటారంటే అతిశయోక్తి కాదేమో! అంతటి బలీయమైందా పెద్దతరం ఉంటా మద్రాస్ సైనికాధికారుల పాతమోజు! నాడు రాజసంతో శతృవుకు దడ పుట్టించిన మేము, దాన్ని తలదన్నే నేటి ధనదాహంతోసాంకేతికత ముందు తల దించాం మొర్రో, అని మొత్తుకుంటున్నా వినలేని భాషను వాటి యజమానుల ముందు, మిగిలిన ఆ కొద్ది మిగ్ లు ఎపుడెపుడు వాటి యజమానుల ముందు, మిగిలిన ఆ కొద్ది మిగ్ రాలిపోదామా అని దీనంగా ఎదురు చూస్తున్నాయి! ఆ అశుభ కార్యం కాస్తా పూర్తైపోతే, మన యువ శిక్షణ సైనిక చోదకులతో బాటు మనమూ ఊపిరి పీల్చుకుందాం! అదీ కాలానికున్న బలీయమైన శక్తి! కాలానికణుగుణంగా గత వైభవ అనుభవాలను వేసుకుంటూ వర్తమానపు ఉద్దీపనల వరడిలో బ్రతుకు నావ సాగలానే ఆకాంక్షే దీనికి ప్రేరణ! కాలానికి ఎదురీద్దామని భీష్మించుకున్న కవులందరినీ కాలం తనగర్భంలో కలిపేసుకొని నవ శకపు నయా కవులకు జన్మనిస్తూనే ఉంది! వాడుక కాని సైన్సు పెంచిన ఆయుషు పుణ్యాన, వయసుడిగినా, నాటి బూజును మాత్రం దులుపుకోలేక, ధీరత్వం వదల్లేక, పటుత్వంలేని ఆ విత్తనాలు వెదజల్లుతూనే ఉన్నారు నేడు మిగిలిన నాటి ప్రముఖులు! ఏదేని ఒక వరవడి సృస్టింపబడినది అంటే అప్పటికది నవీనము, ఆచరణీయము, తదుపరి కాలానికది పురాతనము, త్యజితము. కాలానుగుణ మార్పులను ఆహ్వనించలేని పాతతరం వారి హృదయం బాహ్య వైశాల్యం మెండు అని చెప్పుకున్నాగాని, ఈ కోణంలో వారి అలా అభ్యుదయ కవులకు, యువతకు అనుప కచ్చడాలు సైతం అంతర్గత వైశాల్యం సంకుచితమే అనక తప్పదు! ఇక్కడిలాగే పాత తరం బూజు ఉండాలంటారు, అక్కడ ధనదాహంతో(సినిమా), కాలేజీ గడప తొక్కని కవిపుంగవులు సైతం, ప్రక్కదారిలో యువతను ఎర్రెక్కించే కిక్కిస్తూ వేడుకల వేదికలెక్కి అల్తామోన్ లుక్కిచ్చేస్తారు! ఆనక మళ్ళీ వెనుకనుంచి అదే వేదిలెక్కి ఝుళిపించి, సాంప్రదాయ చిందులు వేస్తూ ఇనుప కచ్చడాలు సైతం బిగింపజూస్తారు! ఈ రెండు నాల్కల (పాళీల) పెన్నుగాళ్ళ జెట్ స్పీడును చూసి విస్తుబోవడం మన సావధాన సమాజాభ్యుదయ కవి మిత్రులకది చర్విత చర్వణం! శార్డుల, చంపకమాల లెక్కడా నేడు రోజువారి చదవరులకు కానారావు! వాటి గతవైభవం వాటిది. నేటి యువతను వెనక్కి తీసుకుపోలేము సరికదా, మనమే వారితో ముందుకు సాగాలి! ఆవైభవాన్ని ఆస్వాదించే అర్హులు లేనపుడది ఎడారిలోని కోయిలకూతే కాగలదు. నాకూ నాటి వైభవం నవనీతమంత మోజే, కాని దాన్ని అట్టేపెట్టుకుందామంటే నేటి యువత వేడికి ఇట్టే కట్టలు తెంచుకొని కరిగిపోతుందే! మార్పుతో మమేకమవ్వండి, మందితో మెలగండి, నవశకం వైపు నడవండి. హద్దుల ఆటంకాలతో సుద్దులు సణగడం మానండి! సమాజ శ్రేయస్సే యెజెండాగా సాగండి! ఇప్పటికే జంగ్ ఫుడ్ లాంటి జంగిల్ భాషా వరవడిలో యువత కొట్టుకుపోతున్నారు! వచన, వ్యాసరాజముల కాలమిది. గ్రామ్యాలు, మాండలీకాలు కలగలిపిన వాడుక భాషల వంటకాల వేడుకలను యువత ఆస్వాదించే వేళ కాదనలేనంతగా కదిలి సాగే తరుణమిది. రండి ఆదారిలో వారికిష్టమైన వాటితోనే ఆరోగ్యకర వంట చేసి వారి భాషారోగ్యాన్ని కాపాడదాం!


పొలమూరి ప్రసాదరావు


హృదయం సామాజిక,పర్యావరణ సాంకేతిక విషయ నిపుణులు. 9440147978