నకిలీ ఎలక్ట్రో హెూమియో ఫిజిషియన్లకు 'ఐఎంఏ' అడ్డుకట్ట వేసేనా..?

కు నెల 20వ తేదిన వరంగల్ బాంచీ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) నూతన కార్యవర్గం అట్టహసంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరైవైద్య వృత్తి మహోన్నతాన్ని కొనియాడారు. వరంగల్ ఐఎంఏను ఆదర్శంగా తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. నూతనంగా అధ్యక్షులుగా డాక్టర్ కొత్తగట్టు టు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బి. లక్ష్మినారాయణ వరంగల్ బ్రాంచీ ఐఎంఏ బాధ్యతలు చేపట్టారు. అయితే ఇక్కడ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐఎంఏ కార్యవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య రంగంలో అనధికార వైద్యసేవల పట్ల దృష్టి సారిస్తారా..? చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తారా లేదా అనేదే ప్రశ్న. ఎవరెన్ని మాటలు చెప్పినా వైద్య వృతి వ్యాపారంగా మారిందనటంలో సందేహం లేదు. వైద్యులు సేవ గుణం మరిచి వ్యాపార గుణాన్ని ఒంటపట్టించుకున్నారనటంలోనూ వెనుకాడాల్సిన అవసరం లేదు. అలా అని అందరు వైద్యులను, అన్ని చోట్ల వైద్య సేవలను తప్పు పట్టాల్సినఅవసరం లేదు. మెరుగైన వైద్య సేవలు అందటం, సేవా గుణంతో వైద్యులు వైద్య సేవలు అందించటం గాయత్రి జరుగుతూనే ఉంది. ఇలాంటి వాటిని అభినందించాల్సిందే. కానీ యధేచ్చగా వైద్య సేవలను వ్యాపారంగా మలుచుకోని నకీలి సర్టిఫికెట్లతో క్లీనిక్లు, నర్సింగ్ హెూంలు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకునే పరిస్థితులు ఉన్నాయనేది కూడా గమనించాల్సిన అంశమే. ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న నకిలీ సర్టిఫికెట్లతో ప్రారంభించిన వైద్య దుకాణాలు సాక్ష్యంగా చూడవచ్చు. మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే వరంగల్ ఐఎంఏ ముందున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కరించాల్సిన అంశాలు, దృష్టి సారించాల్సి తక్షణ కర్తవ్యం ఏమిటో అర్థమవుతుంది. మచ్చుకు కొన్నింటిని పరిశీలిద్దాం... హన్మకొండ ఓల్డ్ బస్సు డిఫౌ పక్కన గల గాయత్రి క్లీనిక్ ( ఎ.లక్షపతి) ఎలక్ట్రో హెూమియో ఫిజిషియన్‌గా చలామణి అవుతున్నప్పటికీ అందుకనుగుణమైన వైద్యవిద్య లేదనేది బహిరంగ రహస్యంగా ఉంది. అంతేందుకు తెలంగాణ లో చట్టబద్దత లేని ఎలక్ట్రో హెమియో పతిక్ అనే వైద్యకోర్సు చదివినట్లుగా చూపుతూ కోకొల్లలుగానే చలమణిలో ఉంటున్నా కనీసం పరిశీలించే వారే లేకపోవటం విడ్డూరం కాక ఏమవుతుంతో ఆలోచించాలి..? ములుగు జిల్లా కేంద్రంలోని వినయ్ ఆసుపత్రి నిర్వహకులు డాక్టర్ సంతోష్ కుమాది కూడా పైన పేర్కొన పరిస్థితే కావటం గమనార్హం. ఇంకా సూటిగా చెప్పాలంటే ఇతగాడు ఓపెన్ ఇంటర్లో బైపిసి చదివిన వ్యక్తి ఏకంగా ఆసుపత్రినే నడిపే విధంగా ఎలక్ట్రో హెూమియో వైద్యునిగా చలామణి అవుతున్నారంటే వైద్య సేవల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్లీనిక్స్ పట్ల, ఆసుపత్రుల నిర్వహణ పట్ల ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ ఎంతటి డొల్లతనంతో ఉందో కూడా అర్థం అవుతుంది. ఇది తంతులో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని ములుగు ఘన్‌పూర్‌లో గాయత్రి క్లీనిక్ నిర్వహకులు డాక్టర్ సంతోష్ కుమార్ కూడా నేనేమి తక్కువ తినలేదన్నట్లుగా నకిలీ సర్టిఫికెట్ తోనే క్లీనిక్ నిర్వహింస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇదే ములుగు జిల్లా పరిధిలోని ఏటూర్ నాగారంలో వినయ్ ఆసుపత్రి పేరుతో నిర్వహించబడే ఆసుపత్రిలోనూ వైద్యులు నకిలీ సర్టిఫికెట్ల వీరులేననేది గమనార్హం. ములుగు ఘనపూర్‌లో సంపత్ కుమార్ అనే వ్యక్తి కూడా మరో అసుపత్రిని నిర్వహించటం బహిరంగ రహస్యమే. అయితే ఇక్కడో అంశాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అంశమేమిటంటే ఇందులో కొంత మంది ఘనులు అర్హుత కలిగిన వైద్యుల పేరుతో రిజిస్ట్రేషన్ పొందినట్లుగా చూపుతూ ఆసుపత్రులు, క్లీనిక్స్ నిర్వహణకు కావాల్సిన పత్రాలు చూపుడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా ఉన్నప్పటికీ వైద్యసేవలు అందించేది, వీటిని నిర్వహించేది మాత్రం వీరే అనేది గమనించాల్సిన అంశం. పక్క రాష్ట్రాల్లో వైద్య చదువు చదువుకున్నట్లుగా సర్టిఫికెట్లు పొందిన వీరు స్వతహగా ఆర్ఎంపి లే అనేది గుర్తించాలి. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటివి కోకొల్లలుగానే నిర్వహించబడుతున్నప్పటికీ అరికట్టాల్సిన అధికారులు చర్యలు చేపట్టకపోవటం వెనుక కారణాలేంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. ఎందుకంటే నిజంగా వైద్య సేవల పట్ల చిత్తశుద్ధి ఉంటే చర్యలు చేపట్టాలి కదా..? వీరి దృష్టికి రాలేదని దాటేస్తారేమో కానీ, కనీస పరిశీలన పర్యవేక్షణలు లేవనటానికి ఇవి సాక్ష్యం కాకా ఏమవుతాయి..? ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ) వరంగల్ బ్రాంచీ నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. వీరైనా ఇలాంటి నకిలీ వైద్య సర్టిఫికెట్లతో క్లీనిక్లు, ఆసుపత్రులు, నర్సింగ్ హోంల నిర్వహణల పట్ల దృష్టి సారిస్తారా..? లేకా వీరు కూడా బజనలకు సరీసప్పుడు కాకుండా ఉంటారా అనేది వీరి ముందున్న ప్రశ్న. ఏదేమైనప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి వైద్య సేవా రంగంలో ఉందని చెప్పటానికి పైన పేర్కొనవి మచ్చుకు మాత్రమేనని గుర్తించాలి. ఇలాంటి వాటిపై ఐఎంఏ దృష్టి సారించి చిత్తశు ద్దిని చాటుకోవాల్సిన అవసరం ఉంది. రాజేందర్ దామెర జర్నలిస్టు - వరంగల్ సెల్ : 8096202751