రాజకీయ ఉమ్మడి ఓరుగుల్లు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నకిలీ ఎలక్రో హెమియో ఫిజిషియన్లకు అడ్డుకట్ట వేయటం సవాలే..! ఒర రకంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఓరుగుల్లు బ్రాంచీ నూతన ఐఎంఏ కార్యవర్గానికి పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే ఓరగుల్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ ఎలక్ట్రో హెూమియో ఫిజిషియన్లు యధేచ్చగా వైద్యశాలలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిబంధనల ప్రకారం తెలంగాణలో చెల్లుబాటులో లేని వైద్య చదువులు ఎక్కడో పక్కరాష్ట్రాల్లో చదివినట్లుగా సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకొని అరకొర చదువులున్న వారు ఎలక్ట్రో హెమియో ఫిజిషియన్లుగా చలమణిలో ఉండటం బహిరంగ రహస్యంగా మారింది. గతం నుంచి వీరంతా ఐఎంఏ కార్యవర్గానికి, వైద్యారోగ్యశాఖ మంత్రులకు, పలుకుబడి కలిగిన నాయకులకు భజనలు చేస్తూ తమ వైద్య వ్యాపారాన్ని కొనసాగిస్తూ రోగుల ఆరోగ్యాలతో ఆటలాడుకోవటం జరుగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నూతనంగా ఓరుగల్లు బ్రాంచీ నూతనంగా ఎన్నికకాబడిన ఐఎంఏ కార్యవర్గానికి ఇదో సవాలుగా , ప్రశ్నగా మారిందనటంలో సందేహం లేదు. నూతనంగా ఎన్నిక కాబడిన ఓరుగల్లు ఐఎంఏ కార్యవర్గం దృష్టి సారించటానికి నకిలి సర్టిఫికెట్లతో కొనసాగుతున్న 'వైద్యదుకాణాలను' మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం...హన్మకొంగ ఓల్డు బస్సు డిఫో పక్కన గల గాయత్రి క్లీనికు ( నిర్వహకుడు ఎ. లక్ష్మిపతి )ఎలక్రో హెూమియో ఫిజిషియనుగా చలామణి అవుతున్నారు. అందుకనుగుణమైన వైద్యవిద్య లేనప్పటికీ సర్టిఫికెట్లు చూపించి యధేచ్చగా వైద్య దుకాణాన్ని నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేకపోవటం, పర్యవేక్షణలు, చర్యలు లేకపోవటం చాలా విడ్డూరమేనని చెప్పాలి. మరో కోణంలో ఆలోచిస్తే నిత్యం పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ఆశీస్సులు ఉన్నట్లు కూడా భావించక తప్పదు. ములుగు జిల్లా కేంద్రంలోని వినయ ఆసుపత్రి నిర్వహకులు డాక్టరు సంతోష్ కుమారుది కూడా ఇదే తంతు. దీనికి తోడు ఓపెనింటర్మిడియేటు బైపిసి చదివిన వ్యక్తి ఏకంగా ఆసుపత్రినే నడిపే విధంగా ఎలక్ట్రో ఫిజియో వైద్య చదువు చదివినట్లుగా సర్టిఫికెట్లు సంపాధించి ఆసుపత్రి నిర్వహిస్తున్నారంటే వైద్యరంగం ఎలా ఉందో ఆలోచించాలి. భూపాలపల్లి జయశంకరు జిల్లా ములుగు ఘనపూరంలో గాయత్రి క్లీనికు నిర్వహకులు సంతోష్ కుమారుది ఇదే తంతు. ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారంలో వినయాసుపత్రి పేరుతో నిర్వహించబడుతున్న ఆసుపత్రిలోనూ వైద్యులు నకిలీ సర్టిఫికెట్ల వీరులే కావటం గమనించాల్సిన అంశం.ములుగు ఘనపూరులో సంపతు కుమారు అనే వ్యక్తి కూడా మరో ఆసుపత్రిని నర్వహించటం బహిరంగ రహస్యమే. ఇవి మచ్చుకు మాత్రమే. ఇందులో కొంత మంది ఘనులు అన్ని అరిహతలు కలిగిన వైద్యుల పేరుతో రిజిస్ట్రేషను పొందుతూ ఆసుపత్రులు, క్లీనికుల నిర్వహణకు కావాల్సిన పత్రాలు పొందారు అంటే వైద్య మాఫియా ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసి ఉన్నతంగా తీర్చిదిద్దటంలో ఐఎంఏ పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఇంతటి బహిరంగంగా కొనసాగుతున్న నకిలీ ఎలక్ట్రో హెూమియో ఫిజిషన్లపై చర్యలు చేపడుతారా లేదా అనేది ఐఎంఏ కు ప్రశ్నగా ఉందనేది కాదనలేని వాస్తవం. గతంలోనూ ఐఎంఏ చేతులు ముడుచుకొని భజనలు పొందారే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అట్టహసంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఓరుగల్లు బ్రాంచీ ఐఎంఏ నూతన కార్యవర్గం అడుగులు ప్రక్షాళన వైపు ఉంటాయా..? లేక పాత పద్ధతుల్లో ఉంటాయా అనేది నూతన కార్యవర్గం చిత్తశుద్ది పైనే ఆధారపడి ఉంది.
రాజేందర్ దామెర జర్నలిస్టు,
వరంగల్ సెల్ : 8096202751