నీటిపై సమర శంఖం మొదలైంది..!

రాణాధారమైన నీటికోసం అలమటిస్తున్న కోట్లాది జనం ఆక్రోశంతో ది జనం ఆరోశంతో గుండెలు మండే కాలం రెండుమూడు నెలల్లో వస్తోంది. ఏటా తప్పని పీడలా రాపాడుతున్న నీటి కరవు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలనూ నిరుటి కంటే ఎక్కువగా ఇక్కట్లపాలు చెయ్యనుందన్న ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలనే పరిగణనలోకి తీసుకొంటే వర్షపాతం లోటు 80 శాతంగా నమోదైన ఆంధ్రప్రదేశ్ లో సగటున 14 మీటర్ల మేర భూగర్భజలాలు పడి పోయినట్లు గణాంకాలు చాటుతున్నాయి. పర్యవ సానం గా రాయలసీమతోపాటు వేలాది పల్లెపట్టుల్లో మంచినీటి కటకట ముమ్మ రించ నుంది. తెలంగాణలో భూగర్భ జలమట్టాలు వేగంగా అడుగంటి అనునిత్యం వందలకొద్దీ బోర్లు వట్టిపోతుండటంతో పక్షం రోజుల్లో చేతికి అందాల్సి ఉన్న యాసంగి పంట చేజారిపోతోంది. 20 మీటర్ల దిగువకు భూగర జలమట్టాలు పడిపోయిన పదులకొద్దీ మండలాల్లో పరిస్థితి దారుణంగా మారింది. 40 బస్తాలు పండే పొలాల్ని నాలుగు వేలకు పశుగ్రాసానికి అమ్ముకొంటున్న బడుగు రైతుల కళ్లలో రక్తాశ్రువులు చిందుతున్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా లాంటి పెద్దనదులే కాక- పదు ల సంఖ్యలో చిన్న నదులూ ప్రవహించే తెలుగు రాష్ట్రాల్లో బతుకు పచ్చద నాన్ని హరించేటంత స్థాయిలో నీటి కరవు గట్టె - కట్టడాన్ని అందరొక్కటై ప్రతిఘటించాల్సిన తరుణమిది. విచ్చలవిడిగా వృక్షాల నరికివేత సహా యథేచ్చగా సాగిన పర్యావరణ విధ్వంసంతో రుతువులు గతి తప్పి పెను సామాజిక ఉత్పాతాలకు కారణభూతమవుతుంటే, ప్రకృతి విసరుతున్న ఆ సవాలును మొక్కవోని సంకలు దీకతో ఎదురోవడానికి యావమందీ. ఒకు కదలాలి. తన పూర్వీకుల కోసం దివిజ గంగను భువికి రప్పించాడు భగీరథుడు.ఓ ప్రమాదంలో చిక్కుకొని నట్టనడి సముద్రంలో తిండీ తిప్పలు లేకుండా ప్రమాదంలో చిక్కుకొని నట్టనడి సముద్ర రెండు నెలలు గడపాల్సి వచ్చిన ఫిలిప్పీన్స్ మత్స్యకారుడి బొందిలో ప్రాణాలు నిలిపింది- వర్షపు నీరు. ప్రతి వాననీటి చుక్కనూ ఒడుపుగా ఒడిసిపడుతూ రెండు దశాబ్దాలుగా నీటి ఇక్కట్లను తన ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చేసిన బెంగళూరు వాసి ఏఆర్ శివకుమార్ ఆదర్శం ఎంతో స్ఫూర్తిమంతం అనడంలో మరోమాట లేదు. ప్రాణం నిలిపే నీటిని ప్రాణసమానంగా పరిరక్షించుకొంటేనే బతుకు, భవిత ఉంటాయని రుజువు చేస్తున్న నిజాలవి. 70 శాతం వానలు పట్టుమని వంద రోజుల్లోనే కురిసి వెలిసిపోయే భారతావనిలో భూమిపైకి చేరుకునే వర్షపు నీటిలో ఎకాయెకి 90 శాతం దాకా సముద్రంలో కలిసిపోవడం, ఆవిరైపోవడంవల్ల ఎందుకూ కొరగాకుండా పోతోంది. డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారన్న గతకాలపు నానుడిని చెల్లని కాసు చేస్తూ- ఎంత డబ్బు వెచ్చించినా మంచి నీళ్లు దొరకని దురవస్థను దశా బాల నిర్లక్ష్యం దేశవ్యాప్తంగా పరచేసింది. ప్రభుత్వాల నుంచి సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి సక్రమ నిర్వహణపరంగా మేట వేసిన నిర్లక్ష్యం- లక్షలకొద్దీ జనావాసాలు మంచినీటికి మొహం వాచే దౌర్భాగ్యస్థితిని దాపురింప జేసింది. 'వానకాలంలో వరదలు, వేసవిలో కన్నీటి ధారలు- ఇలా ఇంకెన్నాళ్లు?” అని ప్రశ్నిస్తూ దయనీయ గతానికి, దుర వర్తమానానికి చెల్లుచీటీ రాసేలా నీటియజ్ఞానికి సమాయత్తమవుదామంటూ ఏళ్లతరబడి జన చేతన కేతనాన్ని ఎగరేస్తోంది. ప్రతి నీటి బొట్టు నూ ఒడిసిపట్టే మేలిమి పథకాల సాఫల్యమే లక్ష్యంగా వ్యక్తికి బహువచనం శక్తి అని నిరూపిస్తూ విజయవంతం అయ్యేలా కదనోత్సా హంతో అంతా కూడి రావాలి!మంచినీళ్లు తేవడం కోసం ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, పిల్లలు అందరూ కలిసి రోజూ వెచ్చిస్తున్న సమయం ఎంత? ఆ మొత్తాన్ని కలిపితే - దాదాపు 20 కోట్ల పని గంటలు అంటే 22 వేల ఎనిమిది వందల ఏళ్లనియునిసెఫ్' ఇటీవలి అంచనా! ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల మందికి మంచినీరు అందుబాటులో లేదని స్వఛమైన తాగునీటికి కటకటలాడుతున్న భారతీయుల సంఖ్య ఆరు కోట్ల 31 లక్షలని అంతర్జాతీయ అధ్యయనాలు ఉదోషిస్తున్నా యి. దేశానికి స్వాతంత్ర్యం లభించేనాటికి ఉన్న తలసరి నీటి లభ్యత నేడు నాలుగోవంతుకు కుంగిపోయింది. విచ్చలవిడిగా తోడేస్తుం డటంతో దేశవ్యాప్తంగా 160 జిల్లాల్లో భూగర్భజలాలు ఉప్పునీటి మయమైపో యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, యూపీ, బిహార్, పశ్చిమ్ బంగ లాంటి రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఫ్లోరైడ్ భూతం జడలు విరబోసుకుంటోందని నిరూపితమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభావాన్విత కార్యాచరణ ఏ తీరుగా ఉండాలో- శ్రీరాం వెదిరె సారథ్యంలో జలయజ్ఞం చేపట్టిన రాజస్థాన్ అనుభవం చాటుతోంది. 'ఇంటినీరు ఇంటివద్దే- పంట నీరు పొలంవద్దే' అన్న నినాదంతో ఏడు శాఖల్ని సమన్వయపరచి 'జల స్వావలంబన్ అభియాన్' పేరిట చేపట్టిన కార్యక్రమం ఏడాది వ్యవధిలోనే ఎడారిలో చిరునవ్వులు పూయిస్తోంది. శాస్త్రీయ పంథాకు సంఘటిత కృషి జతపడితే అద్భుతాలు సాధించవచ్చునని ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, సింగపూర్ లాంటి దేశాలు నిరూపిస్తున్నాయి. కేప్ టౌన్ పరిస్థితి ఎలా దాపురించిందో ఊహించుకుంటుంటే వళ్లు జలదరిస్తుంది. అలాంటి పరిస్థితి మనకు మేలుకుంటే రాకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పటికెనా మంచిది.