కొండెక్కి చూడండి.. లోగుట్టు తెలుస్తుంది..!

వీటి నిర్వహణ ఎలా ఉంటుంది..? నిబంధనలు పాటిస్తున్నారా? చెల్లించాల్సిన సినరేజ్ చార్జీలను సరైన విధంగానే చెల్లిస్తున్నారా..? అనే అంశాలను నిత్యం పరిశీలించి పర్యవేక్షణ చేయాల్సిన సంబంధిత శాఖలు ఆలోచించాలి. " అభివృద్ధి లో భాగమైన క్రషర్ల నిర్వహణను తప్పుపడుతారా” అంటూ ఎవరైన ఉలిక్కిపడితే పడొచ్చు కానీ, అభివృద్ధి అభివృద్ధి అంటూ రాగాలు తీసే అభివ ృద్ధి కారులు ప్రభుత్వానికి చెల్లించే రాయితీ పన్నులు సక్రమంగానే చెల్లిస్తున్నారా..? చూపించే రికార్డుల లెక్కలు, అసలు పని జరిగిన లెక్కలు సజావుగానే ఉన్నాయా అనే అంశాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సీనరేజ్ చార్జీలు చెల్లించడంలో అనేక లోటుపాట్లు ఉన్నట్లుగా చెప్పటానికి వెనుకాడాల్సిందేమీ లేదు. ఎందుకంటే వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట మండలం పత్తిపాక గ్రామ పరిధిలోని ఎస్వీసి స్టోన్ క్రషర్ , ప్రగతి సింగారం గ్రామ పరిధిలోని సాయిరాం, అధిజా స్టోన్ క్రషర్లు, ఆత్మకూర్ మండలం కొత్తగట్టు గ్రామ పరిధిలోని సాయిరాం స్టోన్ క్రషర్లపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపితే చాలు అభివృద్ధి అంటూ నీతులు వల్లించే మేధావులకు అసలు నిజం తెటతెల్లం అవుతుంది. స్టోన్ క్రషర్లు పన్నుల చెల్లింపు లోని నిర్లక్ష్యం బట్టబయలవుతుంది. గనులు , భూగర్భ జల శాఖ రికార్డులే ఇందుకు సాక్ష్యం గా ఉంటుంది. అందుకోసమే క్రషర్ల నిర్వహణపై ఐటీ రిటర్న్స్ ,ఆడిట్ లేక్కల పై సమగ్రమైన విచారణ జరుపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కోడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా పన్నుల చెల్లింపు లెక్కల వివరాలను పరిశీలించాలి. స్టోన్ క్రషర్లపై వాణిజ్య పన్నుల శాఖ , ఆదాయ పన్నుల శాఖ దృష్టి సారించి తగు చర్యలు చేపట్టాలి. ఈ నాలుగు స్టోన్ క్రషర్లు మచ్చుకు మాత్రమే. స్టోన్ క్రషర్లన్నీ ఇదే తరహాలో ఉన్నాయనటంలోనూ ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అందుకోసమే విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్రమైన విచారణ జరుపాలి. పన్నులు ఎగ్గిడుతున్న క్రషర్ల నిర్వహకులపై కేసులు నమోదు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తు బోర్ బ్లాస్టిం గ్స్ చేయడం, అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా గుట్టలను మిం గే యడం వెనుక జరుగుతున్న లోగుట్టు తెలియాలంటే గుట్టేక్కి చూ స్తేనే అసలు గుట్టు తెలుస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం , సంబం ధిత శాఖలు తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


రాజేందర్ దామెర ( జర్నలిస్ట్) సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు - వరంగల్- సెల్ : 80962 02751