సదా సత్యమే పలకాలి 

మానవుడు తన నిత్య జీవితంలో అసత్యానికి తావులేకుండా సదా సత్యమే పలకడానికి ప్రయత్నించాలి. ఇదిగనక సాధ్యపడితే నిజంగా ఇది దైవకృప. సంకల్పం ఉంటే ఇదేమీ అసాధ్యమైనపనికాదు. కాని, ఈనాడు చాలామంది సత్యాన్ని గురించి అంతగా పట్టించుకుంటున్నట్లుగాని, సత్యాసత్యాల మధ్య విచక్షణ చూపుతున్నటుగాని కనిపించడంలేదు. తమకు సంబంధించినంత వరకు ఇతరులు అబద్దమాడకూడదని, తమ తరులు అబద్ధమాడకూడదని, తమ విషయంలో వారు నిక్కచ్చిగా ఉండాలని కోరుకుంటారు. తాము మాత్రం ఇతరుల వ్యవహారంలో ఎలా వ్యవహరిస్సున్నామో ఆత్మపరిశీలన చేసుకోరు. సత్యమనే ఈ మహత్తర సుగుణాన్ని గురించి దైవప్రవక్త అని గురించి దివపవు హెచ్చరికతో కూడిన సందేశమే చ్చారో గమనిద్దాం. 'సత్యం మానవులను మంచివైపుకు మార్గదర్శకం చేస్తుంది. మంచి వారిని స్వర్గం వైపుకు తీసుకుపోతుంది. అలాగే, అసత్యం మానవులను చెరుపకు మారదర్శకం చేస్తుంది. చెడువారిని వరకం దాకా తోరాని వెళుతుంది.” సత్యానికి ఇంతటి మహత్తు, ప్రాముఖ్యత ఉన్నాయని అందరికీ తెలుసు. నోరుతెరిస్తే పచ్చి అబద్దాలు పలికేవారు కూడా సత్యానికి మించిన సంపద మరొకటి లేదని అంగీకరిస్తారు. అయినా ఆచరణలో మాత్రం తప్పులో కాలు వేస్తుంటారు. అసత్యాన్నే ఆశ్రయిస్తారు. తిమ్మిని బమ్మిని చేసి పబ్బం గడుపుకోడానికి ప్రయత్నిస్తారు. ఈనాటి పరిస్థితుల్ని మనం కాస్త నిశితంగా గమనిస్తే, 'అసత్యం' అన్నది చెడు అని ఈనాడు ఎవరూ అనుకోవడం లేదు. అది చెడుల జాబితా నుండి మినహాయింపు పొంది, ఒక కళగా రూపాంతరం చెం దింది. పరిస్థితి చూస్తుంటే, సత్యానికి అసత్యానికి మధ్య అసలు కాస్త కోడానికి తమకు ప్రయోజనాన్ని, లాభాలను చేకూర్చి పెట్టే ఒక సాధ నంగా అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. స్వార్ధం, స్వలా భాల కోసం ఎంత పెద్ద అబద్దం పలకడానికైనా ఏమాత్రం సంశయిం చడంలేదు. కాని, ముహమ్మద్ ప్రవక్త(స) ఎట్టిపరిస్థితి లోనూ అబద్దమాడవద్దని , ! సత్యం పలికిన కారణంగా మీరు సర్వస్వం కోల్పోయినా సరే అసత్యాన్ని ఆశ్రయించవద్దని హితవు పలికారు. ఇంట్లో పిల్లలకు సైతం ఏదైనా తెస్తానని, ఇస్తానని ఆశజూపి తేకపోవడం, ఇవ్వకపోవడం కూడా తప్పే అన్నారు. ఇదికూడా అసత్యమే అవుతుందని, అసత్యాన్ని గురించి రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవలసి ఉంటుందని సెలవిచ్చారు. కావడానికి ఒకవేళ మానవ సహజ బలహీనత కారణంగా, పొరపాటున ఏదైనా అసత్యం దొర్లిపోతే, దానికి చింతించి, పశ్చాత్తాపంతో దైవాన్ని క్షమాపణ వేడుకోవాలని సూచించారు. ఈనాడు చాలామంది చిన్నచిన్న ప్రయోజ కోరుకుందాంనాలకోసం చాలా తేలిగ్గా అబద్ధాలాడేస్తుంటారు. ఇక వ్యాపార లావాదేవీల విషయమైతే, అబద్దాలాడనిదే వ్యాపారం సాధ్యంకాదని, అబద్దమాడకుండా లాభాలు గడించలేమన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కొందరైతే అసత్యాన్ని వ్యాపార చతురతగా భావించి గర్వపడుతుంటారు. కాని, సత్యవంతుడైన , వ్యాపారి ఇహలోకంలో ప్రజల ప్రేమపాత్రుడవు తాడని, ప్రజల దీవెనలు అసత్యాన్ని పొందుతాడని, పరలోకంలో దైవ ప్రసన్నతను చూరగొంటాడని ముహమ్మ ద్ ప్రవక్త(స) చెప్పారు. కనుక, సాధ్యమైనంతవరకు, సర్వకాల సర్వావస్థల్లో సత్యమే గురించి పలకడానికి, అబద్దాలకు దూరంగా ఉంటూ దేవుని ప్రేమకు పాత్రులు . కావడానికి ప్రయత్నించాలి. అబదాల కోరును ప్రజలు ఎన్నటికీ నమరు. విశ్వసించరు, ప్రేమించరు, ఆదరించరు, గౌరవించరు. ఇదినిజం. క్షమాపణ అల్లాహ్ మనందరికీ సదా సత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. లావాదేవీల - యండి. ఉస్మాన్ ఖాన్ అసత్యాన్ని సీనియర్ జర్నలిస్టు సత్యవంతుడైన


యండి. ఉస్మాన్ ఖాన్ సీనియర్ జర్నలిస్ట