బాలలకు అత్యంత ఇపమైన రోజు ఈ రోజు పిల్లలచే ముద్దుగా చాచా అని పిలిపించుకునే మన మొట్ట మొదటి భారత ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రు గారి జయంతి నేడు . నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన తన కోటు పై ఎప్పుడూ గులాబీ పువ్వును పెట్టుకునేవారు. వీరి నాయకత్వంలో దేశం చాల పురోగమించింది. తన జీవిత కాలంలో నెహ్రూ భారతదేశంలో ఒక ఆదర్శ మూర్తిగా గుర్తింపబడి, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆదర్శవాదము మరియు రాజకీయ సమర్ధత ప్రశంసించ బడ్డాయి. బాలల మరియు యువజనుల పట్ల నెహ్రూకు గల వాత్సల్యానికి, వారి శ్రేయస్సుకు, విద్యాభివ ృద్ధికి ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా, ఆయన జన్మ దినమైన 14 నవంబర్ ను భారతదేశం “బాలల దినోత్సవం” గా జరుపుకుంటున్నది. దేశ వ్యాప్తంగా బాలలు ఆయనను “చాచా నెహ్రూ” అని గౌరవిస్తారు. ఓటమి ఎరుగని జాతీయ వాదిగా నెహ్రూ స్థానం, ప్రాంతీయ భేదాలను గుర్తిస్తూనే అణచి వేయబడిన సామాజిక వర్గాల కొరకు విధానాలు అమలు పరచుటకు దారి చూపింది. స్వాతంత్ర్య - అనంతర కాలంలో ఆంగ్లేయులు ఉపఖండం నుండి విరమించు కొన్న తరువాత, ఉపఖండంలో అంతకు ముందు ఒకే సామాన్య విరోధికి వ్యతిరేకంగా మిత్రులుగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఇక నుండి ఒకరికొకరు సంబంధం లేకుండా విభేదాలు పొడసూపిన కాలంలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది. సాంస్కృతిక వైవిధ్యం ప్రత్యేకించి భాషా వైవిధ్యం దేశ ఐక్యతను భంగపరచేదిగా ఉన్న సమయంలో, నెహ్రూ నేషనల్ బుక్ ట్రస్ట్ మరియు నేషనల్ లిటరసీ అకాడమీ వంటి సంస్థలను ఏర్పరచి వివిధ భాషల మధ్య అనువాదాలను ప్రోత్సహించారు మరియు విషయ పరిజ్ఞాన బదిలీలను ప్రోత్సహించారు. సమైక్య భారతదేశం కోసం నెహ్రూ “కలసిఉండడం లేదా నశించడం” అని నినదించారు జవాహర్లాల్ తొలి నుంచీ లౌకిక వాది. దానికి బీజాలు బాల్యంలోనూ, ముస్లింలతో సాధారణంగా కాశ్మీరీ పండిట్లు చూపే ఏకీభావంలోనూ లోతుగా ఉన్నాయి. మతసమస్యను జవాహర్‌లాల్ ఏనాడూ విలువనిచ్చి చర్చించదగ్గ విషయంగా భావించలేదు. అందుకు ప్రతిగా మతకలహాలు కేవలం ఊహాత్మకమైన విషయాలపై ఆధారపడ్డవని తిరస్కరించేవాడు. ఇందుకు జవాహర్ దృష్టిలో ఉన్న పరిష్కారం మతమనే దాన్ని దుర్బలపరిచి అదుపులో పెట్టడం, రాజకీయాల్లో లౌకిక భావనలు హృదయడం. నెహ్రూకు ఒక ఒక్క కుమార్తి ఆమె వ్యాప్తి చేయడం. నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ పోరాటం చేసినపుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సివచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేం చెప్పాలనుకునేవారో వాటన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాల్ని చదివి భద్రపరిచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేవారు జవహర్ లాల్ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వ్రాస్తూ పోయాడు. ఒక ప్రణాళికను అనుసరించి వ్రాసిన ఆ ఉత్తరాలే క్రమేపీ “గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ” గ్రంథంగా తయారయ్యాయి. 1928లో ఇందిర ముస్సోరీలోనూ, తాను దూరంగా భారత జాతీయోద్యమ కార్యకలాపాల్లోనూ ఉండగా భూమి ఎలా లోనే పుట్టింది అన్నదాని నుంచి మొదలుపెట్టి క్రమేపీ 1930 నాటికి వర్గాల ఏర్పాటు, వ్యవస్థీకృతమైన మతం ఏర్పాటు, భారతదేశానికి ఆర్యుల రాక వంటివి సంక్షిప్తంగా రాశాడు. తర్వాత 1930లో రెండవ సారి అరెస్టు చేసినప్పుడు సహాయంగా గ్రంథాలు లేకపోయినా జ్ఞాపకశక్తి మీద ఆధారపడి మొహంజదారో, ప్రాచీన గ్రీసు నుంచి తన సమకాలం వరకూ గాంధీయే పలు అంశాలపై ఉత్తరాలు రాశాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంవత్సరాలలో, తన బాగోగులు చూడడానికి మరియు వ్యక్తిగత కోల్పోయేవాడిలా వ్యవహారాల నిర్వహణకు, నెహ్రూ తరచుగా తన కుమార్తె పై ఆధార పడేవారు. ఆయన నాయకత్వంలో, 1952 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజారిటీని సాధించింది. ఇందిర, తన తండ్రి లిటరసీ సంరక్షణకై ఆయన అధికారిక నివాసం లోనికి మారారు. వాస్తవానికి ఇందిర నెహ్రూ సిబ్బందిలో ముఖ్యురాలిగా ఉంటూ ఆయన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలలో నిరంతరం తోడుగా ఉన్నారు. ఆ విధంగా భవిష్యత్తులో ఒక మంచి ప్రధానిగా ఇందిరకు ఎదిగే అవకాశం కల్పించాడు. చాలా జవహర్ లాల్ నెహ్రూ 1889వ సంవత్సరం నవంబరు 14న జన్మించా రు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్ప ట్లో పేరు మోసిన లాయరు. నెహ్రూ అలహాబాద్లో స్కూల్ కి వెళ్లి చదివిం ది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడుక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటుచేశారు మోతీలాల్. 15 ఏళ్లపుడు నెహ్రూ చదువుకోసం ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్లు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్ వివాహమయింది. మామూలుగా మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులం దరూ మధ్యతరగతి, సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి చదువులన్నీ ఎక్కువగా విదేశాలలో చదవడం వల్ల మన భారతీయ సమాజం ప్రభావం కంటే విదేశీ సమాజ ప్రభావం అతడి మీద ఎక్కువగా పడింది. ఆ కారణం చేతనే అతడు సంస్కృతం పై పెద్ద పట్టు సాదించలేక పోయాడు. న్యాయవాదిగా ఆనాటి వలస సమాజంలో ఉన్నతస్థాయిని పొందిన మోతీలాల్ కుమారుడికి బ్రిటీష్ విద్యాబోధనే ప్రధానమని భావించాడు. మోతీలాల్ సహా కాశ్మీరీ పండిట్లయిన వారి పూర్వీకులంతా సంస్కృతం వంటి ఇతర భారతీయ భాషలకన్నా అరబ్బీ, ఫారసీ, ఉర్దూ వంటి భాషల లోనే ఎక్కువ ప్రవేశం కలవారు. ఇలా కుటుంబ సామాజిక స్థితి, సంప్రదా యానుశీలంగా వారి వాతావరణంలో ఈ భారతీయ విద్యల పట్ల ప్రత్యేకా భిమానం లేకపోవడం కూడా జవహర్ సంస్కృతం నేర్వలేకపోవడాన్ని ప్రభావితం చేశాయి. గాంధీ అంటే నెహ్రూకి వల్లమాలిన అభిమానం. దేశంలో దారితప్పిపోయి న తనకు సుపరిచితుడైన స్థానంలో కేవలం గాంధీయే ఉన్నాడని జవాహర్ లాల్ భావించేవాడు. గాంధీ నిరాహారదీక్ష లకు దిగినప్పుడల్లా తన జీవితం లో ఉన్న ముఖ్యమైన ఆధారం కోల్పోయేవాడిలా తల్లడిల్లేవాడు. గాంధీ కూడా జవహర్‌లాల్ ఇటువంటి మన:స్థితిలో ఉంటాడని అర్థం చేసుకుని హృదయాన్ని ఊరిడించి, హత్తుకునే లేఖలు రాసేవాడు .స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూని తండ్రి ఉద్దేశిస్తూ గాంధీ వ్రాసిన సందర్భంలో “చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తల పడ్డాము, ఇప్పుడు మనం అమిత ధృడంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకొనే సమయం వచ్చినది. అర్ధరాత్రి సమయంలో, ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారతదేశం తన స్వతంత్ర జీవనానికై మేల్కొంది. మనం పాత నుండి క్రొత్తకి అడుగు వేసేటపుడు, ఒక యుగం అంతమైనపుడు, చాలా కాలం అణగ దొక్క బడిన ఒక దేశం తనను తాను బహిర్గత పరచుకొనే ఒక క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది. భారత దేశం కొరకు మరియు దాని ప్రజల కొరకు ఇంకా ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకిత మవుతామనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుక్తమైనది” .అణు ఆయుధాల బెదిరింపులను ప్రపంచం వ్యాప్త వత్తిడులను తగ్గించడానికి నెహ్రూ కృషి పలువురి ప్రశంసలు అందుకుంది. (మిగతా రేపు)
కాళంరాజు వేణుగోపాల్ పెద్ద నాగులవరం
మార్కాపురం ప్రకాశం జిల్లా 8106204412