భవిష్యతులో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలె

తందూరు టిఆర్ఎస్. ఆటంకాలకు తలవొగ్గి తలపెట్టిన కార్యాన్ని మధ్యలోనే వదిలి పెట్టేవాళ్లు మధ్యములు. ధీరులు మాత్రం ఎల్లప్పుడు అవరోధాలను అధిగమిస్తూ... ఆటంకాలను దిక్కరిస్తూ రెట్టించిన ఉత్సాహంతో గమ్యం చేరేదాకా, ఫలితం దక్కేదాకా పట్టినపట్టు వదలరు. ధీరతత్వానికి మారు పేరు టిఆర్ఎస్. అందరూ అసాధ్యమని తలచిన, కొందరు ప్రారంభించి నడుమనే కాడె ఎత్తేసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలకెత్తుకుంది టిఆర్ఎస్ పార్టీ. కేసిఆర్ పిడికెడు మంది తో 2001 ఏప్రిల్ 27న టిఆర్ఎస్ పార్టీని స్థాపించి, సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపి,తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నిరాహార దీక్ష చేపట్టి, రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడిండు, గుండెబలంతో గులాబీ జెండా చేతబట్టి ఉత్తుంగ తరంగాలై ఉద్యమించి స్వరాష్ట్రం స్వప్నాన్ని సాకారం చేసి, నేడు బంగారు తెలంగాణకు బాటలు నిర్మిస్తున్న టిఆర్ఎస్ పార్టీ. కాలం కూడా నివ్వెరపోయి చూసే ఘన విజయాలను సాధించిన పార్టీ టిఆర్ఎస్, అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వం లో సామాన్య కార్యకర్తగా చేరి, వివిధ పదవులను చేపట్టి, పార్టీ బలో పేతం కోసం అహర్నిశలు కృషిచేస్తూ, దశాబ్ద కాలం పాటు ఎమ్మెల్యేగా అనుభవం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో మొదటిసారిగా పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ, ఐటీశాఖ మంత్రి పదవి చేపట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకొని అద్భుతమైన పాలన సాగించి ఐటీ రంగంపై చెరగని ముద్ర వేశారు. వారసత్వం అన్న ముద్ర పడకుండా తన సత్తా చాటుకుంటూ దూసుకెళ్తున్న యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్... కల్వకుంట్ల తారక రామారావు....సరిగ్గా నేటికి ఏడాది.. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్, కేటిఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటిఆర్ పదవి బాధ్యతలు చేపట్టి సరిగ్గా నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా. సాధించిన విజయాలు.... కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ ఎన్నో అద్భుతాలను,విజయాలను సాధించాడు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని, మున్సిపాలిటీలను, చేనేత, ఐటీ రంగాన్ని అభివృద్ధిలో ముందుంచిన ఘనత కేటీఆర్ దే. నేటి సమాజంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న ప్రజాప్రతినిధులను మనం వేళ్లపై లెక్కించ వచ్చు, కేటీఆర్ అందరివాడు ఎల్లప్పుడూ ఆయన ముఖంలో చిరునవ్వుతో పలకరిస్తాడు. ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఆదుకుంటాడు. ప్రభుత్వ కార్యక్రమమైన, ప్రైవేటు కార్యక్రమమైనా సందర్భానుసారం సమయస్పూర్తితో మాట్లాడే ఆయన మాటలు కత్తుల పదునైనవి, హేమ హెమిలైన రాలో సంవత్సర కాలంలో ఎన్నో విజయాలను తను సందర్శకులైన, నాయకులైన, ప్రజా ప్రతినిధులైన, అధికారులతో నైనా ఆప్యాయంగా పలకరించే ఆయన మాటతీరు సామాన్యులను మంత్రము గుల్ని చేస్తుంది. పల్లెల్లో ముసలవ్వతోనైనా, అమెరికా ప్రతినిధితోనైనా తాను మాట్లాడే విధానానికి ఫిదా కావాల్సిందే, అంతటి వాక్చాతుర్యం కలవాడు. ఎలాంటి విషయంపైనైన అనర్గళంగా మాట్లాడి ఆయన వాగ్దాటితో హేమహెమిలైన రాజకీయ నాయకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సంవత్సర కాలంలో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధించినవి, అదే ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీ చూస్తే ప్రజల అభిమానం పొందడం మాత్రమే కాదు.. రాజకీయాల్లో అడుగు పెట్టిన అనాతికాలంలోనే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో ఎవరైనా తన తర్వాతే అని నిరుపించుకున్నాడు కేటీఆర్. తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయిలో అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో రోజుకు రెండు, మూడు సభలు, రోడ్ షోలతో హజరై ఎన్నికల సన్నాహక సభలు పూర్తిచేశారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఎంఐఎం మినహా 16 స్థానాల్లో మెజారిటీ స్థానాలు 09 స్థానాలు గెలిపించడంలో సఫలీకృతుడయ్యాడు. తర్వాత మండల పరిషత్ ఎన్నికల్లో కారు స్పీడును ఎవరు అందుకోలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిటిసి, జడ్పిటిసి, ఎంపీపీ స్థానాలు అత్యధికంగా గెలుచుకోవడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్తు అన్నింటిలోనూ 32 జిల్లా పరిషత్ చైర్మన్లను గెలుచుకొని తనదైన శైలిలో ముద్రవేసుకోని రికార్డు సృష్టించాడు. తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కేటీఆర్ కృషి ఫలించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి రోజువారి సమాచారాన్ని స్వయంగా తెలుసుకుని సమీక్షలు నిర్వహించి, కార్యకర్తలకు డైరెక్టుగా ఫోన్ చేసి మరి సమాచారాన్ని సేకరించాడు. 60 లక్షల సభ్యత్వాలతో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. వెనువెంటనే సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క కార్యకర్త కి ప్రమాద బీమా వర్తించేలా ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ తరపున కేటీఆర్ నగదును చెల్లించి, ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలను చెల్లించే విధంగా అనుమతులు ఇస్తూ, ఆదేశాలు జారీచేసీ, అనుకున్న సమయంలోనే పూర్తి చేశాడు కేటిఆర్. అదేవిధంగా బూత్, డివిజన్, గ్రామ,మండల కమిటీ లన్నిటిని దాదాపు తొంభైశాతం పూర్తి చేయించాడు. పార్టీ కమిటీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనారిటీ వర్గాల ప్రజలకు 50 శాతం ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించి, ఆ వర్గాల నిర్ణయించి,ఆ వర్గాల ప్రజల మనసును గెలుచుకున్నాడు. దాదాపు నేటికి 98 శాతం వరకు కమిటీల భర్తీ పూర్తయ్యాయి. కేటీఆర్ పార్టీ రాష్ట్ర మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారంటి సమస్య ఎదురైనా కమిటీతో తరచుగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ,పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు. అన్ని జిల్లా కేంద్రాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. నిర్మాణ పనులను కూడా స్వయంగా తానే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కొన్ని జిల్లాలో ఇప్పుటికే ప్రారంభించ డం కూడా జరిగిపోయింది. మరికొన్ని జిల్లాల్లో 95% కార్యాలయాల నిర్మాణాలు పూర్తిచేయించాడు. రాజకీయాల్లో ఎంత చురుకుగా ఉంటాడో, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటాడు కేటీఆర్. కేటీఆర్ అంటే యువతరానికి మార్గదర్శి ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా విద్యావంతులైన యువతకు వెంటనే గుర్తొచ్చే పేరు కేటీఆర్. తన సమస్యను ప్రస్తావిస్తూ ఒక్క ట్వీట్ చేస్తే చాలు, క్షణాల్లో స్పందించి వచ్చిన సమస్యను పరిష్కరిస్తాడు, ఎంతోమంది ప్రాణాలను కాపాడి, వేల మంది జీవితాలకు వెలుగులు నింపింది టిఆర్ఎస్ కేటీఆర్ ట్విట్టర్. అదేవిధంగా చేనేత కుటుంబాల్లో వెలుగులు నింపిన చంద్రుడు కేటీఆర్ చేనేత రంగంలో ఎన్నో వినూత్నమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టి చేనేత బతుకులకు భరోసా కల్పించాడు. అదేవిధంగా త్వరలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని మున్సిపాల్టీల్లో గులాబీ జెండా ఎగరవేయడం కోసం కార్యచరణ మొదలుపెట్టారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండలని పార్టీ సమావేశంలో తేలియాజేస్తూ,పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కమిటీలను కుడా వేశారు. తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వచ్చిన మొదటి ఉప ఎన్నిక హుజూర్ నగర్ ఎన్నిక, అక్కడ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపుకు సహకరించినవి కేటీఆర్ రోడ్ షో లు, ప్రసంగాలే అని చెప్పక తప్పదు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండాను ఎగురవేశాడు కేటీఆర్. రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కకుండా చేయడంలో కేటీఆర్ దిట్టా. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్ తండ్రిని మరిపిస్తూ ఒంటిచేత్తో స్వీకరించిన ప్రతి పనిలో విజయాలను సాధిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఐ.టీ,మున్సిపాలిటీ పరిశ్రమల శాఖ మంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం.1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, నేటి యువతకు దిక్సూచిగా నిలుస్తున్నాడు, రాష్ట్రానికి భారీ స్థాయిలో పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ నిరుద్యోగులకు లక్షలల్లో ఉద్యోగావకాశా లు కల్పిస్తున్నాడు. అదేవిధంగా ఉద్యమ సమయం నుండి పార్టీకోసం పనిచేసిన నాయకులను స్వయంగా తానే గుర్తించి నామినేటెడ్ పదవులను కట్టబెడుతున్నారు. అదేవిధంగా రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బల్దియాలో టిఆర్ఎస్ పార్టీ అనుకున్న అన్ని స్థానాల్లో గెలవడం కూడా ఖాయమే. భవిష్యత్తులో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ - శోభ అమ్మ ఆశీస్సులతో ఉన్నతమైన పదవిని స్వీకరించాలని కోరుకుంటున్నది తెలంగాణ ప్రజానీకం. గుండమల్ల సతీష్ కుమార్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.