భవిష్యత్తులో ఇంధన ముప్పు తప్పదేమో

 దిన దినం ప్రపంచ జనాభా పెరిగిపోతు న్నది. దీనితో పాటు మానవులకు శక్తి అవస రాలు కూడా విపరీతంగా పెరిగి పోతున్నా యి. ఈ శక్తి ప్రాముఖ్యత ను వివరించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 న మన దేశంలో 'జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం” ను 1991 నుండి జరుపుకుం టున్నాము. విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీ. ఈ. ఈ). ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇందన పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదా దాని పున స్తాపన కోసం ఇతర వనరులను అభివృద్ధి చేయడం వంటి అంశాలపైనా ఈ రోజు చర్చించి అవగాహన కల్పిస్తారు. విద్యుత్ శక్తిని అనేక పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. నీటి ద్వారా జల విద్యుత్, బొగ్గు ద్వారా ధర్మల్ విద్యుత్, రేడియోధార్మికత ద్వారా న్యూక్లియర్ విద్యుత్తు, గాలి ద్వారా పవన విద్యుత్తు, సముద్రపు అలల ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నాం, విద్యుత్ శక్తి లేకపోతే మన రోజువారీ దినచర్యలు అన్నీ కూడా అస్తవ్యస్తం అవుతాయి. చాలాభాగం విద్యుత్ శక్తి మనం వ ధాగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఆధునిక యుగంలో రోజు రోజుకీ ఇంధనం అవసరం పెరుగుతూనే ఉంది. 'బికాన్” అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రకారం ఇంధన వినియోగం భవిష్యత్తులో ఎక్కువ ఉండే వినియోగం పెరుగుదలను అంచనా వేస్తే ప్రస్తుతం ఉన్న సహజ ఇంధన వనరులు మరో వంద సంవత్సరాలకు మించి సరిపోవు కాబట్టి మనం అన్ని ఆలోచించి న్యాయబద్దంగా వాడాలి. శక్తి పరిరక్షణ అంటే విద్యుత్తు పరిరక్షణ వృధా చేయకుండా వినియోగించుకోవడం అనవసరంగా ఉపయోగించడం అనేది చేయకపోవడం, వినియోగంలో ఏర్పడే నష్టాలను నివారించడం ప్రాథమికంగా విద్యుత్ వినియోగానికి అయ్యే ఖర్చులను తగ్గించడం. విద్యుత్ ఉత్పాదనకు కారణమైన బొగ్గు, సహజ వాయువు, మరియు ముడి చమురు, వంటి నిల్వలను చాలా పొదుపుగా వాడుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే ఇవి పునరుత్పాదక ఇందన వనరులు కావు. వీటిని ఒకసారి వినియోగిస్తే మరల తిరిగి భవిష్యత్తులో ఏర్పడవు. ఒక వేళ తిరిగి ఏర్పడాలన్న చాలా సంవత్సరాలు పడుతుంది. భారీగా తగ్గి పోతున్నారు ప్రతి ఒక్కరూ దీనిని బాధ్యతగా తీసుకొని సమాజంలో అవగాహన తీసుకురావాలి దీనికోసం నిరంతరం కృషి చేయాలి. పరిరక్షణ ఎలా చేయాలంటే అవసరానికి మాత్రమే అంటే మన పని అయ్యాక ఫ్యాను లైటు ఇతర ఎలక్ట్రిక్ వంటి వస్తువులను స్విచ్ ఆఫ్ చేయడం దీనిని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వలన మనం విద్యుత్తును ఆదా చేసిన వారమవుతాం. మార్కెట్లో వివిధ కంపెనీల సహకారంతో లభ్య మయ్యే విద్యుత్ వస్తువులు, గృహోపకరణాలు, ఫ్రిజ్, కూలర్, ఏసీ, వాషింగ్ మెషీన్, మైక్రో ఓవెన్, హీటర్, లాంటి విద్యుత్ పరికరాలు స్టార్ రేటింగ్ గల వస్తువులను వినియోగించాలి. ఎందుకంటే వీటికి తక్కువ కరెంటు తీసుకుని ఎక్కువ పనిచేసే శక్తి ఉంటుంది. దీని వలన విద్యుత్ వినియోగంలో కలిగే నష్టాలను నివారించవచ్చు. అలాగే మామూలు బల్బులు స్థానంలో ఎల్ ఈడీ బల్బుల ఉపయోగిం చడం ద్వారా మనం చాలా విద్యుత్తును ఆదా చేయవచ్చు. ముందుగా విద్యుత్, గ్యాస్, పెట్రోలు, బొగ్గు మొదలైనవన్నీ పొదుపుగా వాడు కోవలసిన పునరుద్దరింపలేని ఇంధన వనరులను పరిమితిని మించి వాడుకుంటున్నాము. అందువల్ల రాబోయే ఐదు దశాబ్దాల తర్వాత ఇవి పూర్తిగా అడుగంటి పోయే ప్రమాదం ఉంది. దీని ద్వార మానవుని మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. కాబట్టి ఇందన వనరులను పొదుపుగా వాడుకోవడం తో పాటు ఇతర మార్గాలను వెతుక్కోవాలిఎందుకు సౌరశక్తిని పవన శక్తిని విద్యుత్ వినియోగించుకుంటున్న అన్వేషించడం అవసరమే అయినప్పటికీ ఉన్న వనరులు అత్యంత పొదుపుగా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. వీధిలైట్లు వృధాగా వెలుగుతూ ఉండడం, అవసరం ఉన్నా లేకపోయినా లైట్లు, ఫ్యాన్లు, టీవీలు పనిచేస్తూ ఉండటం మొదలైన వాటి వలన ఎంతో విద్యుత్ వృధా అవుతుంది. అనవసరంగా టీవీ, కంప్యూటర్మొబైల్, గీజర్, ఏసీ, ల వాడకం తగ్గించాలి. గదిలో నుండి బయట కు వెళ్ళేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనిని మన ఇంట్లో నుండి ప్రారంభించాలి అలాగే మనం పనిచేసే కార్యాలయంలోనూ, గ్రంథాలయాల్లో, ఆసుపత్రిలోనూ, అలాగే అనేక ప్రదేశాలలో దుబారా విద్యుత్ ను తగ్గిస్తాను అనే బాధ్యత కొనసాగించాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే విధ్యుత్ ను ఆదా చేసే అలవాట్లను తెలియ జేసి ప్రోత్సహించాలి. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వాణిజ్య ఇంధనాలలో దాదాపు 50 శాతం పరిశ్రమల రంగంలోనే వినియోగం అవుతున్నది కొన్ని పారిశ్రామిక రంగాలలో ఇంధనం 65శాతం వినియోగమవుతుంది. అల్యూమినియం ఉత్పత్తి వ్యయంలో దాదాపు 40 శాతం ఇంధనం ఖర్చుదే. మొత్తం వినియోగం అయ్యే ఇంధనంలో విద్యుత్ 80 శాతం ఉంటే బొగ్గు చమురు కూడా ఉపయోగించబడుతున్నాయి. టెక్సైల్ మొత్తం ఉత్పత్తి వ్యయంలో బొగ్గు విద్యుత్ ఫర్నేస్ ఆయిల్ లు కలిపి 12 శాతం నుండి 15 శాతం వరకు ఉన్నాయి. ఇంధనం ఆదా అధికంలో అధికంగా 23 శాతం వరకు సాధించవచ్చు.