మహిళాభ్యుదయంపై చితశుది ఏదీ

 అమ్మ కడుపులోనే ఆడపిల్లకు అమానుషంగా సమాధి కట్టేయడానికి తెగబడుతున్న సామాజిక దుర్విచక్షణే, దేశంలో స్త్రీ సాధికారత సాధనకు అక్షరాలా గొడ్డలిపెట్టు అవుతోంది. భ్రూణ హత్యలే కాదు- మహిళల్లో ముమ్మరిస్తున్న ఆరోగ్య సమస్యలు, పోషకాహార ఎదుగుదల లోపాలు ఆడపుటక పట్ల వేళ్లూనుకున్న చులకన ధోరణుల్ని కళ్లకు కడుతున్నాయి. వనితలపై హింసను అరికట్టడంతో పాటు అమ్మాయిల హక్కుల్ని పరిరక్షించేందుకంటూ మూడేళ్ల క్రితం 'బేటీ బచావో బేటీ పఢావో' పథకం తెరపైకి వచ్చింది. తొలుత వంద జిల్లాల్లో శ్రీకారం చుట్టి, మలి అంచెలో ఇంకో 61 జిల్లాలకు విస్తరించిన పథకాన్ని కేంద్రప్రభుత్వమిప్పుడు మొత్తం 640 జిల్లాల్లో అమలుపరుస్తామంటోంది. పథకం ఆరంభించిన హరియాణాలో, తాజా విస్తరణకు వేదికైన రాజస్థాన్ లో సానుకూల మార్పులు నమోదయ్యాయంటున్న ప్రధాని మోదీతక్కినచోట్లా ఆడశిశువుల భ్రూణహత్యల్ని నిలువరించి నారీశక్తితో నవభారతం నిర్మిద్దామని రాష్ట్రాలకు పిలుపిస్తున్నారు! ఎనిమిది నెలల క్రితం కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి మేనకాగాంధీ ఈ పథక సాఫల్యాన్ని వివరిస్తూ వెల్లడించిన గణాంకాలు ఎందరినో విస్మయపరచాయి. గతంలో వెయ్యిమంది అబ్బాయిలకు 758మంది అమ్మాయిలే నమోదైన కార్నల్ జిల్లా (హరియాణా)లో బేటీ పథకం ప్రవేశపెట్టాక ఆ సంఖ్య 884కి పెరిగిందట! కడలూరు (తమిళనాడు) 856 నుంచి 957, ఘజియాబాద్ (యూపీ) 899 నుంచి 977 వరకు మెరుగుపడ్డాయని- పథకానికి మోకాలడ్డిన పశ్చిమ్ బంగలో మాత్రం ఆ సంఖ్య 1022 నుంచి 898కి పడిపోయిందన్న అధికారిక వివరణపై నాడు ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. క్షేత్రస్థాయిలో అనేక ప్రసవాలు రికార్డులకు ఎక్కని దృష్ట్యా లింగ నిష్పత్తిలో మార్పుల్ని ఇదమిత్థంగా నిర్ధారించగల వీల్లేదు. బాలికా సంరక్షణను ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తున్న కేంద్రం, జాతీయ స్థాయిలో ఏకోన్ముఖ కార్యాచరణకు ఎంతమేర దోహదపడుతున్నట్లు? కేంద్రస్థాయిలో రూపుదిద్దుకొని, రాష్ట్రాలతో అర్థవంతమైన సమన్వయం కొరవడిన కారణంగా చతికిలపడ్డ పథకాల జాబితాలో పట్టణ పునరుద్ధరణ మిషన్ (జేఎన్ఎన్‌యూఆర్ఎమ్)ది ముందంజ. ఏడేళ్ల వ్యవధిలో అరవై నగరాల ముఖచిత్రాల్ని గణనీయంగా మార్చేస్తామంటూ వేలకోట్ల రూపాయలు గుమ్మరించిన తరవాతా ఎక్కడి గొంగడి అక్కడే కావడం- యూపీఏ విఫలగాథ. మునుపటి ఏలుబడిలో మొదలై ఎడీఏ జమానాలోనూ భూరి నిధులు వ్యయీకరించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిదీ అదే పద్దు. అటువంటి చేదు అనుభవాలతో 'బేటీ బచావో...' విషయంలో ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. కేంద్ర సీ శిశు సంకేమ శాఖ సారథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మ మహిళాభివృద్ధి, విద్యా ఆరోగ్య విభాగాలు కలిసికట్టుగా పట్టాలకు ఎక్కించాల్సిన = విశిష్ట పథకమిది. వాస్తవంలో దేశవ్యాప్తంగా ప్రధాన రాష్ట్రాలు 21లో 17 లింగనిష్పత్తిలో ఆందోళనకర తరుగుదలను నమోదు చేసినట్లు 'నీతి ఆయోగ్' అద్యయనమే వెలడిస్తోంది. ఆ వరసలో గుజరాత్, హరియాణా రాజసాన్. అధ్యయనమే వెల్లడిస్తోంది. ఆ వరసలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర ముందున్నాయన్నది 'స్వస్థ రాష్ట్రాలు- పురోగామి భారత్' శక్తిసామర్థ్యాలు నివేదిక సారాంశం. మధ్యప్రదేశ్, గోవా, ఛత్తీస్ గఢ్ వంటివి బాలికా సంరక్షణ పదకాలను లోగడే పటాలకు ఎకించాయి. 29 రాపాలో రూ.300 కోటు పథకాలను లోగడే పట్టాలకు ఎక్కించాయి. 29 రాష్ట్రాల్లో రూ. 300 కోట్లు వెచ్చించిన 'బేటీ బచావో... 'తో పోలిస్తే రూ. 5,000 కోట్ల వ్యయంతో తాము భరతవాక్యం అమలుపరుస్తున్న కన్యాశ్రీ పథకం ఎన్నో విధాల మిన్న అని పశ్చిమ్ బంగ సర్కారు చాటుకుంటోంది. ఆడబిడ్డ జన్మించగానే ఆధార్ తరహా ప్రత్యేక సంఖ్యనొకదాన్ని కేటాయించి, పదిహేనేళ్ల వయసు నిండేదాకా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలన్నీ చేకూరుతున్నాయో లేదో పర్యవేక్షించాలని రెండేళ్ల క్రితం ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు సూచించింది. మేలిమి యోచనలు, అనుభవ పాఠాల్ని స్వీకరించి రాష్ట్రాలకు సరైన భాగస్వామ్యం కల్పిస్తేనే- 'బేటీ బచావో...” మౌలిక లక్ష్యం నెరవేరుతుంది! - రాజ్యాంగ పీఠిక దగ్గర నుంచి ఆదేశిక సూత్రాల వరకు అన్నీ స్త్రీ పురుష సమానత్వానికే ఓటేస్తున్నా, పార్టీలన్నీ ఆ స్ఫూర్తికి కట్టుబాటు చాటుతున్నామంటున్నా- మహిళా సాధికారత నేటికీ ఎండమావినే తలపిస్తోంది. చట్టసభల్లో వారికి మూడోవంతు కోటాకు ఏ పక్షానికాపక్షం పైకి సై అంటున్నా, లోలోపల నెరపుతున్న రాజకీయం వేరు. పదహారో లోకసభకు ఎన్నికైన 543 మందిలో పురుషులు 89శాతం. కాంగ్రెస్, భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్లు దక్కిన మహిళలు- వాటి తరఫున మొత్తం ఎంపీ అభ్యర్థుల్లో 12 శాతంలోపు. కొద్దిపాటి తేడాలతో, తక్కిన పార్టీలూ ఆ తానులో ముక్కలే. రువాండా (63.8 శాతం), బొలీవియా (53.1) వంటి దేశాల్లో మహిళా ప్రాతినిధ్యంతో పోలిస్తే భారత్ వెలాతెలా పోవడానికి తరతమ భేదాలతో ఇక్కడి రాజకీయ పార్టీల దొంగాటకాలే పుణ్యం కట్టుకుంటున్నాయి! స్త్రీశక్తి అనేది వట్టి ప్రకటనలతో ఇనుమడించదు. మహిళల సామాజికార్థిక దుస్థితిగతులపై వెలుగుచూసిన నిపుణుల విశ్లేషణలు - హింస, వేధింపులు, లింగ నిష్పత్తి క్షీణత, ఆర్థిక స్వావలంబన లేమిని ప్రధానంగా వేలెత్తి చూపాయి. ఆ కంతల్ని పూడ్చటానికి ఆడపిల్లల ఆరోగ్యం , చదువు, ఉపాధి, భద్రతలకు ప్రభుత్వాలు పెద్దపీట వేయ వేయాలి. పాలన నిర్ణయాల్లో సమధిక భాగస్వామ్యం దఖలు పడితేనే, స్త్రీల శక్తిసామర్థ్యాలు గరిష్ఠ స్థాయిలో జాతికి ఉపయుక్తమయ్యే వాతావరణం నెలకొంటుంది. ఈ యథార్గాన్ని కప్పిపుచ్చి, ఎన్నికల దృష్టితో ఎవరేమి యోజనలు వండి వండివార్చినా- అవి పరిమితుల చట్రంలో బందీలవుతాయి. లింగ విచక్షణకు భరతవాక్యం పలకడమే ధ్యేయమైతే- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ కార్యాచరణకు సన్నద్ధం కావాలి. చట్టసభల్లో మూడోవంతు కోటాపై పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే- అన్నిందాలా మహిళాభ్యున్నతి సాకారమవుతుంది!