ఊరుమ్మడి సొమ్ముగా చెప్పు కునే గుట్టలను చూస్తుండగానే కరుగదీస్తున్నా, నిబంధనలు com యథేచ్ఛగా అతిక్రమిస్తున్నా, చెల్లించాల్సిన పన్నులల్లో కోతలు పెడుతున్నా, ప్రభుత్వ భూములను అప్పనంగా వినియోగించు కుంటున్నా కళు న్నా చూడలేని శాఖలుగా సంబంధిత శాఖలు ఉంటున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందుకు ఉదాహరణగా ఓరుగల్లు జిల్లాలోని స్టోన్ క్రషర్లు, క్వారీలు, డాంబర్ ప్లాంట్ల నిర్వహణ సాక్ష్యంగా నిలుస్తుంది. నిర్వహకులు, అధికారుల కలయిక తీరు ఎలా ఉందంటే... వడ్డించేవారు మనవారైతే బంతిలో ఏ మూలకు కూర్చున్న కొదవలేదన్నట్లుగా స్టోన్ క్రషర్ల నిర్వహణ తీరు ఉంది. మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే ఇట్టి విషయం బోధపడుతుంది. ఇంకా సూటిగా చెప్పాలంటే అధికారుల ఆశీస్సులున్నాయి, ప్రభుత్వ పెద్దల అండ ఉంది. ఇక మాకేమీ కొదవ అన్నట్లుగా ఊరుమ్మడి సొమ్ము అయినటువంటి గుట్టలకు క్రషర్లు పెట్టి యధేచ్చగా కరుగదీస్తున్నారు. బోబ్లాస్టింగ్లు చేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా డాంబర్‌ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. గుట్టలను కరుదీస్తూ గుట్టల అడుగుభాగాన్ని తోడేస్తున్నా, క్రషర్లు, క్వారీలు చెల్లించే సీనరేజ్ చార్జీలను సక్రమంగా చెల్లించకున్నా చర్యలు చేపట్టకుండా ఆయా శాఖలు చర్యలు చేపట్టడం లేదంటే వీరి కలయిక ఎలా వర్ధిల్లుతుందో అర్థంచేసుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేట, ర నిర్వహణ తీరు ఆత్మకూర్ మండలాల్లోని స్టోన్ క్రషర్ల నిర్వహణ తీరు చూస్తే గుట్టలను కరుగధీయటం మా హక్కు అన్నట్లుగా ఉంది. శాయంపేట, ఆత్మకూర్ మండలంలోని సాయిరాం, అధిజా స్టోన్ క్రషర్ నిర్వహణపై విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్ విచారణ జరిపితే అసలు వెనుకాల జరిగే తతంగం బయటపడుతుందనేది గమనిర్హం. ప్రభుత్వ భూములను ఎలా వాడుకుటుంన్నారో, చెల్లించాల్సిన సీనరేజ్ చార్జీలకు ఎలా కోతలు పెటుతున్నారో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నతాధికారులకే మాయమవుతున్న ఊరుమ్మడి ఉంది. ఇదే శాయంపేట మండలంలోని ఎస్సీసీ స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్ నిర్వహణ తీరును కూడా పరిశీలిస్తే కాలుష్య నియంత్రణశాఖ పర్మిషన్ ఎలా ఇచ్చిందో తేలిపోతుంది. గట్ట అడుగు భాగం తోడేయటానికి ఉన్న నిబంధనలు, పరిమితులు ఏమిటనేది కూడా బహిర్గతమవుతుంది. దామెర మండలంలోని మాధవ స్టోన్ క్రషర్‌కు సంబంధించిన వాహనాలు ఎస్ఆర్ఎపి కాలువను వినియోగించుకోవటానికి ఉన్న నిబంధనలు ఏమిటనేది కూడా ఆయా శాఖలే సమాధానం చెప్పాలి. గోవిందాపూర్‌లోని స్టోన్ క్రషర్ నిర్వహకులు సైతం కాలువగట్లను వారి సొత్తుగా భావిస్తూ యధేచ్ఛగా వినియోగించుకుంటుంటే చర్యలు చేపట్టకుండా ఎస్ఆర్ఎపి గుమ్మనకుండా ఉంటున్నారంటే ఇది రహస్యపు ఒప్పందాలు కాక ఏమవుతుందో ఉన్నతాధికారులే చెప్పాలి. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే సహజ వనరులను విధ్వంసం చేస్తున్నప్పటికీ చర్యలు చేపట్టకపోవటం పక్కన పెడితే కనీసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ చార్జీలు ( పన్నులు) సైతం సక్రమంగా వసూళ్లు చేయకపోవటం అధికారులకు, నిర్వహకులను మద్య ఉన్న ఒప్పందాన్ని బలపరుస్తుంది. ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రషర్లు, క్వారీలు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణ తీరుపై ప్రత్యేక దృష్టి సారించి పర్యావరణానికి ముప్పుతెచ్చే విధంగా నిబంధనలు అతిక్రమించే చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. మరో వైపు వీటి నిర్వహకులు చెల్లించే చార్జీలను సక్రమంగా వసూళ్లు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని ఉన్నతాధికారులు, సంబంధిత శాఖలు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాజేందర్ దామెర-(జర్నలిస్టు)
సహజ వనరుల పరిరక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు-వరంగల్సెల్: 8096202751