నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఉంటాయి 1,విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ 2. కర్నూల్ న్యాయపరమైన క్యాపిటల్ 3 అమరావతి శాసన సంబంధిత రాజధానిగా ఉంటుందని ప్రకటించి రాష్ట్ర ప్రజలే కాదు దేశం మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడేలా చేసినారు . వింత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిగా ఒక్కరోజులోనే చరిత్ర ఎక్కడ జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు అయినా చాలా మంది చెప్పేది ఏమంటే రాజధాని అమరావతి ఏ మేరకు అనుకూలము కాదు అన్న విషయాన్ని పరిశీలించడానికి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ తన నివేదికను ఇవ్వకముందే ఇలాంటి నిర్ణయం ప్రకటించడం ద్వారా అసలు కమిటీ దేనికి వేసినట్లు , కమిటీ వాళ్ళు ఏదైతే రికమండేషన్స్ చేస్తారో దాని తర్వాత వాటిని కూలంకషంగా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంది కానీ ఆ నివేదిక రాకముందే తనకై తానే రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయి అని ప్రకటన అసెంబ్లీలో చేయడం ద్వారా ఆయన ప్రభుత్వ పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో పాటించాల్సిన నియమ నిబంధనలు పూర్తిగా తొలగించి తనకు ఏమి తోస్తే అది చేస్తాను అన్న ధోరణిలో అసెంబ్లీలో ప్రకటన చేసిన ట్లుగా చాలా మంది ప్రజల అభిప్రాయం . అదే అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన ప్రస్తావించినట్లు చంద్రబాబు ఆయన రు వేల ఎకరాలు అమరావతి పరిసర ప్రాంతాల్లో కొనడం వాటిని సిఆర్తిఏ పరిధిలోకి అడ్డగోలుగా తెచ్చుకున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన చెపుతున్న మాటలు వాస్తవమే ఆయితే దానికి చట్ట పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించి అందులో జరిగిన అవకతవకలను సరిదిద్దాల్సిన దానికి బదులుగా మూడు రాజధానిలు పెడతాను సౌతాఫ్రికాలో మూడు రాజధానులు లో ఉన్నాయి అని చెప్పటం అంత పెద్ద అర్థవంతంగా ప్రజలకు కనిపించడం లేదు . ఒక వైపు డబ్బుల్లేక నానా బాధలు లు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఎలా కడతారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది .కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్న విషయాలను తుంగలో తొక్కి చంద్రబాబు గారి మీద కోపంతో నిధులు విడుదల కాకుండా చేసి ఇన్నాళ్ళు ఒకవైపు ఏడిపిస్తే ఇప్పుడు మీరు అత్యంత బలమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొత్త వివాదానికి తెరలేపి అమరావతి కాకుండా ఇంకో రెండు రాజధానులు రాజధానులు అదనంగా ఉంటాయి అని చెప్పడంలో ప్రజలు గందరగోళ పరిస్థితులకు గురి కావటం జరిగింది.. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి రాష్ట్రాల్లో దేనికి కూడా కనీసం రెండు రాజధానులు లేవు కేవలము జమ్మూ అండ్ కాశ్మీర్ కు మాత్రమే రెండు ఉన్నాయి ఇక మహారాష్ట్రలోని నాగపూర్ లో కొంతకాలం అసెంబ్లీ నడుపుకునే సౌకర్యమ మాత్రమే ఉంది. రాజధాని మాత్రం ముంబై లోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు రావటం అనేది అనటానికి వినడానికి వింతగా కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి గారు మూడు రాజధానుల్లో ఎలా పని చేస్తారు అనేది కూడా చెప్పాల్సి ఉంది .ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి ఒకే ప్రదేశంలో అంటారు అంతేకానీ మూడు రాష్ట్రాల్లో ఒకే ముఖ్యమంత్రి పని చేయడం అసాధ్యమే .ఇక ముఖ్యమంత్రి మంత్రులు మూడు రాష్ట్రాలు రాజధానులు పని చేయాలంటే అక్కడ వాళ్లకు వసతి సౌకర్యాలు కల్పించాలీ ఈ ఖర్చు రాష్ట్రం మీద భరించలేనిడి గా మారక తప్పదు. ఫలితంగా ఈ రాష్ట్రం మీరు ఎన్ని కొత్త ప్రయోగాలు చేసిన ఇప్పటికీ ఎప్పటికీ ముందుకు పోదు తిరోగమనంలో ప్రయాణించాల్సిన సంస్థ ఆవరంగా ఏర్పడక తప్పదని ఎదైనా ఒక నిర్ణయం తీసుకున ముందు తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా దానికి సంబంధించిన అన్ని విషయాలు అన్ని విభాగాలతో చర్చించి దానిమీద ఆర్థికంగా నిధులు ఎంత అవసరం ఉంది ఎలా సమకూరుతాయి అన్న విషయాలను పూర్తిగా విశ్లేషించి నిర్ణయాలు ప్రకటించమని ప్రజల విజ్ఞప్తి . జగన్ మోహన్ రెడ్డి గారు యువకుడు మంచి పరిపాలన ఇస్తాడు అని నమ్మి ప్రజలు 151 స్థానాలు ఆయనకు కట్టబెడితే ఆయన ఈ రకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకొని దాని పర్యవసానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా పూర్తిగా బలహీన పరిచే విధంగా చేయడం చేయడం సరైన పద్దతి కాదు. రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఒక హైకోర్టు ఒక శాసన సభ ఉంటుందని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ మూడు రాజధానులు పెడతాను అన్న వింత ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందో కానీ అది ఏ మేరకు చట్టబద్దం రాజ్యాంగబద్దం అన్న విషయాలు ఆయనకు ఆయన చేత నియమించబడిన ఎంతోమంది అడ్వైజర్స్ ఉన్నారు. ఎవరు కూడా ఆయనకు సరైన పద్ధతిలో సలహా ఇచ్చినట్టుగా కనిపించటం లేదు . అమరావతి ప్రాధాన్యత తగ్గించి ఇతర ప్రాంతాల్లో ప్రాంతాల రాజధానులు చంద్రబాబు మీద ఆయన కులస్తులు రాజధాని పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాలు కొన్ని అడ్డగోలుగా దాని CRDA పరిధిలోకి తీసుకొని వచ్చి వందల కోట్ల లబ్ది పొందుతున్నారు అన్న దాన్ని నిరోధించడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయ దలుచుకుంటే ఇది సరైన విధానం కాదు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు కానీ ఆయన బంధువర్గం కానీ లేక ఆయన కులస్తులు కానీ చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను బలవంత పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్న అభియోగాలు కూడా ఇంతకుముందు వినటం జరిగింది అదే నిజమైతే చట్టాన్ని ఉపయోగించి వాటిని రద్దుచేసి తిరిగి భూములను బలవంతంగా తీసుకున్నవారు ఎవరైతే అసైన్డ్ భూములు కూడా కొన్నారు వాటిని రద్దు చేయడానికి ఈ ప్రభుత్వానికి అన్ని రకాల అధికారాలు ఉన్నాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి దొడ్డిదారిన అమరావతి ప్రాధాన్యత తగ్గించాలని చేస్తున్న ఆలోచన సరైనదిగా వివేక వివేకవంతమైనదిగా ప్రజలకు కనిపించటం లేదు, అందువలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారికి మరొక సారి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ప్రకటించిన మూడు రాజధానులు అనేది సరైన నిర్ణయం కాదు నివేదిక నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానులు పెట్టి రాష్ట్ర ప్రజల మీద అనవసరమైన ఆర్థిక భారాన్ని మోపి మీరు మంచి పనుల చేసే బదులు అనవసర నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము
నేరెళ్ల కోటేశ్వరరావు