నూతన మద్యం పాలసీలో తికమక పెట్టే ద్వంద్వ విధానాలు

ఎన్నో అంచనాల నడుమ, దిగ్గజ నాయకులతో రాజకీయ రంగంలో పోరాడి పోటీలో నెగ్గి, ప్రజల విశ్వాసాన్ని పొంది అధికారం చేపట్టిన ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై తనదైన ముద్రను అనతికాలంలోనే వేసున్నారు. ప్రజా సంక్షేమం కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతూ, తాను ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ మారంలోనే దశలవారీ మద్యపాన నిషేదం. హామీని అమలు చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. ఎపి పడుతం. ఈ మొదటి అడుగులో బాగంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలవుతున్నదే నూతన మద్యం విధానం. ఏ వ్యసనాన్నైనా ఒక్కరోజులో నా ఒక్కరోజులో మాన్పించలేమని, అలా మాన్పిస్తే ఆ వ్యసనాలకు బానిసైన మనిషి వ్యసనాన్ని మించిన వ్యతిరేక పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని అది ఆరోగ్య పరంగా కావచ్చు, లేదా మానసికంగా అయినా కావచ్చు అని సైన్స్ సైతం గంటాపథంగా చెబుతున్న నేపథ్యంలో మద్యపాన నిషేధాన్ని సీఎం వైఎస్. జగన్ సరైన రీతిలోనే దశలవారీగా నిషేధం విధించే విధంగా ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు సహ దయంతో స్వాగతించాల్సిందే.. కానీ ఎంతో సదుద్దేశ్యంతో సీఎం వై.ఎస్. జగన్ ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో పొందుపరచబడి ఉన్న కొన్ని నిబంధనల మూలంగా సమాజం ప్రతికూల పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ నూతన మద్యం విధానం ద్వారా ప్రభుత్వమే స్వయంగా ఔట్లెట్ లను నిర్వహించడమే కాకుండా, మద్యం అమ్మకాలపై అదనంగా అడిషనల్ గా అడిషనల్ రిటైల్ ఎక్సయిజ్ టాక్స్ (ఎఆర్‌టి)ని విధిస్తున్నట్లు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ నూతన మద్యం పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్న దాదాపు ,500 మద్యం దుకాణాలు ఉన్నఫళంగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. నూతన మద్యం విధానం ద్వారా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఐఎంఎస్ఎల్), ఫారిన్ లిక్కర్, బీరు, వైన్, తదితర రెడీ టు డ్రింక్ పానీయాలకు సంబంధించిన బాటిళ్లపై అదనపు పన్ను ఫ్లాట్ రేట్ గా విధించడం జరుగుతుంది. దీని మూలంగా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఐఎంఎస్ఎల్), ఫారిన్ లిక్కర్ లకు సంబంధించిన 60, 90 ఎం.ఎల్. బాటిల్లపై అదనంగా రూ. 10 నుండి ఆపై పెరుగుదల ధరలతో ఔట్లెట్ లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఫలితంగా 2000 ఎం.ఎల్. గల మద్యం బాటిల్ కొనడానికి మద్యం వినియోగదారులు రూ. 250 లు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త పన్నులను అమలు బాధితురాలికి ప్రభుత్వ, ప్రైవేట్ సిబ్బంది, యాజమాన్యం మీద కేసు చేయడం ద్వారా 330 ఎం.ఎల్. బీరు బాటిల్ పై రూ. 10/-, అలాగే 50,000 ఎం.ఎల్. గల బాటిల్ బీరు పై రూ. 2,000/- వరకు ధరల అదనపు పెరుగుదల జరిగింది, అలాగే రెడీ టు డ్రింక్ వెరైటీస్ పై రూ20/- అదనపు ధర అమలవుతోంది. పండుగ సీజన్లో లభించే డిమాండ్ మద్యం పరిశ్రమకు తాత్కాలిక ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ, ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల మూలంగా గత సంవత్సరం 2018 తో పోలిస్తేఈ సంవత్సరం మద్యం అమ్మకాలు ఘననీయంగా 25 శాతం తగ్గగా, నవంబర్ నెలలో బీర్ అమ్మకాలు 54 శాతం భారీగా క్షీణించినట్టు విశ్వసనీయ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక మద్యం అమ్మకం, సేవింపుల సమయాల విషయానికొస్తే, గత సమయాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు, సేవింపులకు అనుమతులు ఉండేవి. అయితే ప్రస్తుతం మారిన నూతన మద్యం పాలసీ ప్రకారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు మద్యం అమ్మకాలు, సేవింపులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా, మద్యం అమ్మక కేంద్రాల వద్ద మద్యం సేవింపు కోసం పర్మిట్ రూమ్ (సిట్టింగ్) సౌకర్యం ఎత్తివేయటం జరిగింది. నూతన మద్యం పాలసీ లో అమలవుతున్న మద్యం ధరల పెరుగుదల, డీలర్లకు స్వల్ప మార్జిన్ అంశాలు సమాజంతో నేరుగా సంబంధం కలిగి లేవు, ఆ సమస్యలు మద్యం ప్రియులకు, మద్యం డీలర్ లకు మాత్రమే సంబంధించిన సమస్యలుగా పరిగణించాల్సి వస్తుంది. మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ ల ఎత్తివేత అనే నిబంధన మద్యపాన ప్రియులను మద్యం వ్యసనం నుండి కొంత మేర కట్టడి చేయడానికే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది, ప్రభుత్వ ఉద్దేశాన్ని ముమ్మాటికి అభినందించదగ్గది అయినప్పటికి పర్మిల ప్రభుత్వ ఉద్దేశాన్ని ముమ్మాటికీ అభినందించదగ్గదే అయినప్పటికీ పర్మిట్ రూమ్ ల ఎత్తివేత నిబంధన మూలంగా సమాజానికి కొంత మేర దుష్పరిణామాలు తెచ్చి పెడుతు న్నాయనే విషయాలను సైతం ప్రభుత్వం ఏ పరిగణలోకి తీసుకోవాల్సి న అవసరముంది. 'నో పర్మిట్ రూమ్' విధానం మూలంగా సామా జిక అసమానతకు దారితీసే బహి రంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం సహా ఎదురయ్యే ప్రతికూల పరిణామాలు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నో పర్మిట్ రూమ్ నిబంధన మూలంగా ముఖ్యంగా వినియోగదారులు బీర్ (తక్కువ ఎబివి కలిగిన పానీయం) ముఖ్యంగా వినియ నుండి అధిక ఆల్కహాల్ శాతం కలిగిన పానీయాలకు మారుతున్నారు. అంతేకాదు, ఈ విధానం మద్యం డిపో నిర్వాహకులు భారీగా అవినీతికి పాల్పడేందుకు లొసుగుగా తయారైంది, ఈ నో పర్మిట్ రూమ్ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని తమ బ్రాండ్లను అవుట్ లెట్లలో నిల్వ చేసుకోవటానికి మద్యం కంపెనీలకు నిబంధనలో లేని పలు డిమాండ్లు విధిస్తున్నట్లు సమాచారం వెలువడుతోంది. సమాజంలో జరిగే, ప్రభుత్వ శాఖలలో జరిగే అవినీతిని కట్టడి చేయడానికి, ఏపీ రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా నిలపడానికి, ప్రజలు తమంతట తాము తమ వివరాలను నమోదు చేసుకొని అవినీతి పై ఫిర్యాదులు చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఇటీవలే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ సేవను ప్రారంభించిన విషయం విదితమే. అయితే, మద్యం బ్రాండ్ కంపె నీలు వారి బ్రాండ్ లను ప్రోమోట్ చేసుకోడానికి ఔట్లెట్ లలో తమ ప్రోడక్ట్ కు సంబంధించిన ప్రచార చిత్రాలను ఉంచుటకు తమ వద్ద మద్యం ఔటైట్ డీలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మద్యం ఔట్లెట్ నిర్వాహకులు చేసే ఈ అక్రమాలను ఎవరికీ చెప్పుకోగలమని ఇది అన్యాయం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ప్రజల క్రిందికి రాము కాబట్టి తమకు జరిగే అన్యాయాన్ని టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు నివేదించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్నప్పటికీ భారతీయ బ్రాండైన బీరా, ఖజురాహ వంటి భారతీయ బీర్ బ్రాండ్లు పర్మిట్స్ తో అత్యధిక సంఖ్యలో తమ బీర్ కేసులను విక్రయించడానికి అధిక వాటాతో కొనసాగుతుంటే, అదే సమయంలో డిపో మేనేజర్ ల డిమాండ్ లకు తలొగ్గని ప్రపంచ బ్రాండ్లు, బహుళ-జాతీయ కంపెనీలు రాష్ట్రంలో భారీ నష్టాలలో కూరుకుపోతున్నాయని పరిశ్రమ వర్గాలు, అలాగే ఇటీవలి రాష్ట్రానికి మద్యం పంపిణీ చేసే పరిశ్రమల సంఖ్యలు రుజువు చేస్తున్నాయి. అయితే గ్లోబల్ కంపెనీలలో ఎవరైనా ఈ సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తారా? లేదా వారు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లైతే ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోకూడదని ప్రభుత్వం సౌకర్యవంతంగా తప్పుకుంటోందా? అనే విషయం తెలియాల్సి ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని బార్ లైసెన్సులను రద్దు చేయడానికి ప్రయత్నించింది, అలాగే కొత్త బార్ పాలసీని కూడా జారీ చేసింది, ఇది జనవరి 1, 2020 నుండి అమల్లోకి వచ్చి రెండు సంవత్సరాలు అమలులో ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బార్ పాలసీ పై బార్ యజమానులు హై కోర్ట్ ను ఆశ్రయించగా, హై కోర్ట్ ఈ నూతన బార్ పాలసీని ప్రశ్నించి ఆరు నెలలు స్టే విధించింది, ఈ కేసు తదుపరి విచారణను 23 డిసెంబర్ 2019న జరగనుంది. ఏపీ ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మధ్య నిషేధం దిశగా పయనిస్తున్నప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ లో అతి ముఖ్యమైన ప్రజా శ్రేయస్సు కోసం రూపకల్పన చేసే చట్టాలను ప్రవేశపెట్టే ముందు అందులో అంతర్గత వ్యత్యాసాలను, ధ్వాంధ్వ విధానాలను రూపు మాపాల్సిన అవసరముంది. -


శ్రీనివాస్ గుండోజు,పాత్రికేయులు ఫోన్: 9985188429