వ్యాధిగ్రస్తమైన వైద్యవిద్య

ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఉన్నదా? నాణ్యత, నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల కొరత ఉన్నదని మొసలి కన్నీరు కార్చడంవల్ల ప్రయోజనమేమిటి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సంతృప్తి పరచడానికే అన్నట్లు పదవీ విరమణ వయసును పెంచడం ద్వారా కొద్దిమంది వినియోగించుకోగలరు. అటు తరువాత? నైపుణ్యం, నాణ్యత, అనుభవం ఉన్న అధ్యాపకుల కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైద్య విద్యా కళాశాలలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని ప్రభుత్వ ఉత్తర్వు (టూ ఓబ. ఔ0. నితిశ్రీ టజీబివట 31 05?2017) చెప్పకనే చెబుతున్నది. మరి, ప్రభుత్వం ఎంచుకొన్న పరిష్కార మార్గం ఏమిటి? అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63కు పెంచడం ద్వారా ప్రస్తుతానికి ఉపశమనం పొందవచ్చని తలపోసింది. అసలు సమస్యకు ఇది పరిష్కారమేనా? || వైద్య విద్యా కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా చేరిన స్థితికి అనేక మంది ఒక్క ప్రమోషను కూడా నోచుకోకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే పదవీ విరమణ చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితి కొనసాగుతున్నది. మరొక వైపు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో ఒకేసారి ఉద్యోగంలో చేరినా, కొన్ని విభాగాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు త్వరత్వరగా ప్రమోషన్లు వచ్చి ప్రొఫెసర్లు అయిపోయి, తదనుగుణంగా వారికి వేతనాలు పెరుగుతాయి. ఈ తరహా అశాస్త్రీయమైన, అసంబద్ధమైన, లోపభూయిష్టమైన ప్రమోషన్ల విధానంపై ప్రభుత్వం ఎందుకు సమీక్ష చేసుకోదు?.. ఆయా విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ అయితే ప్రభుత్వం దయతలచినప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు వస్తాయి. అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్ల భాగ్యం కలిగినప్పుడు ఏర్పడే పోస్టులకు ఆ మేరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ప్రమోషన్లు ఇచ్చే అసంబద్దమైన విధానాన్ని కొనసాగిస్తున్నారు. దశాబ్దాల సర్వీసు, అర్హతలు ఉన్నా ప్రమోషన్లకు నోచుకోని అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లలో నిరాశ, నిస్పృహలు పాదుకుపోయి ఉన్నాయన్న సంగతిని ప్రభుత్వం చూడ నిరాకరిస్తున్నది. దాని ప్రభావం వారి పని విధానంపై పడుతుందనడంలో సందేహం లేదు. అధ్యాపకులుగా పనిచేస్తున్న వారు నిరంతర విద్యార్థులుగా, పరిశోధకులుగా నూతన నైపుణ్యాన్ని నిరంతరాయంగా పెంపొందించుకొన్నప్పుడే విద్యా ప్రమాణాలు కూడా వృది చెందుతాయి. అప్పుడే కళాశాలల నుంచి నాణ్యమైన పట్టభద్రులు సమాజాభివృద్ధికి అందుబాటులోకి వస్తారు. ఈ ప్రక్రియ సక్రమంగా అమలు కాకపోతే సమాజానికి నషం వాటిలుతుంది. వైద్య కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల్లో ఈ దృక్పథం, పని సంస్కృతి బాగా కొరవడి ఉన్నదన్న ఆందోళన సర్వత్రా నెలకొని ఉన్నది. వైద్య విద్యా రంగంలో ప్రమాణాల అభివృద్ధికి కృషి చేయాల్సిన యన్.టి.ఆర్. వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పనితనం అత్యంత పెనాసిరకంగా ఉన్నా పట్టించుకొనే వారే కరవైనారు. అది పేరుకే విశ్వవిద్యాలయం. పతనమౌతున్న వైద్య విద్యా ప్రమాణాల పట్ల సమాజం ఇదెక్కడి ఆందోళన చెందుతున్నా విశ్వవిద్యాలయానికి మాత్రం ఈ విషయంలో చీమ అమలుచేస్తూ కుట్టినట్లు కూడా లేదనిపిస్తోంది. విద్యార్థుల్లో పరిశోధనల పట్ల ఆసక్తి ఎదుర్కొంటున్నామని పెంపొందించాలని కానీ, ప్రోత్సహించాలని కానీ విశ్వవిద్యాలయం ఆలోచించాలిఆలోచించిన పాపాన పోయినట్లు కనబడదు. పైపెచ్చు నిరుత్సాహపరిచే పోస్ట్ వాతావరణం ఉన్నది. పీహెచ్ డీ చేయాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించి, గైడ్ చేసే గైడ్స్ లేని దుస్థితి పట్ల దృష్టి సారించాలనే ఆసక్తి నూతనంగా విశ్వవిద్యాలయానికి గానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు గానీ, పట్టభద్రులకు ప్రభుత్వానికి గానీ ఉన్న దాఖలాలు లేవు. ఘనమైన దశాబ్దాల చరిత్ర ఉన్న కళాశాలల్లో ఆంధ్ర వైద్య కళాశాల, గుంటూరు వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాల అనుగుణంగా లాంటివి రాష్ట్రంలో ఉన్నా, ఒక్క కళాశాల కూడా దేశంలో పేరుగాంచిన వైద్య సంఖ్యను కళాశాలల సరసన నిలబడగలిగే స్థితికి ఎదగకలేక పోవడానికి ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు కారణం కాదా! లోతుగా ఆలోచించుకోవాలి. ప్రభుత్వ, ప్రయివేటు వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఉన్నదా? నాణ్యత, నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల కొరత ఉన్నదని మొసలి కన్నీరు కార్చడం వల్ల ప్రయోజనమేమిటి? కేవలం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను సంతృప్తి పరచడానికే అన్నట్లు పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా కొద్ది మంది అనుభవజ్ఞులైన అధ్యాపకుల సేవలను మరో మూడేళ్ళ పాటు వినియోగించుకోగలరు. అటు తరువాత? పదవీ విరమణ వయస్సును పెంచడంతో ప్రమోషన్లకు నోచుకోని అధ్యాపకుల్లో నెలకొన్న తీవ్ర చూసినప్పుడే అసంతృప్తిని ప్రభుత్వం పట్టించుకోదా? యూజీసి తరహా వేతనాలను మాత్రం దోహదపడుతుందిఇస్తారు. యూజీసి అమలుచేస్తున్న ప్రమోషన్ల (టైం బౌండ్) విధానాన్ని మాత్రం అమలు చేయరు. అలాగే, వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత ప్రభుత్వం సమస్య నుండి బయటపడడానికి వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక పూనుకోవాలివైద్య కేంద్రాలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లను తీసుకొచ్చి చేయడానికిఅధ్యాపకులుగా నియమిస్తున్నారు. ప్రమోషన్స్ అంశం వచ్చేసరికి ఆశిద్దాంఅధ్యాపకులుగా పనిచేసిన సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న యూజీసీ నిబంధనను అమలుచేస్తున్నారు. ఇదెక్కడి నీతి, న్యాయం? ఒకవైపు లోప భూయిష్టమైన ప్రమోషన్ల విధానాన్ని అమలుచేస్తూ మరొక వైపు అనుభవం ఉన్న అధ్యాపకుల కొరతను ఎదుర్కొంటున్నామని ఏడ్వడంలో అర్థం ఉన్నదా! ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, స్పందించాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు మాత్రమే వర్తింపజేస్తూ పదవీ విరమణ వయస్సును పెంచడం ద్వారా నూతనంగా పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన పట్టభద్రులకు ఉద్యోగావశాలను లేకుండా చేసినట్లు కాదా? వైద్య కళాశాలల్లో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య పెరుగుదల నిష్పత్తికి అనుగుణంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్ల, ప్రొఫెసర్ల సంఖ్యను పెంచడం ద్వారా అధ్యాపక, విద్యార్థి నిష్పత్తిని శాస్త్రీయంగా ఉండేలా చూసినప్పుడే వైద్య విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి దోహదపడుతుంది. వైద్య విద్యా ప్రమాణాల పెంపుదలకు దోహదపడే దీర్ఘకాలిక ప్రణాళికను ప్రభుత్వం సత్వరం రూపొందించాలి. రాజకీయ సంకల్పంతో అమలుకు పూనుకోవాలి. సంక్షోభంలో ఉన్న వైద్య విద్యా వ్యవస్థకు కాయకల్ప చికిత్స చేయడానికి, ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత చర్యలు చేపడుతుందని ఆశిద్దాం!