రైతులను కోని సర్కార్లు

సంపాదకీయం | గురువారం 05 డిసెంబర్, 2019 , రైతులపై రాజకీయ పార్టీలు ప్రేమ ఒలకబోయడం నాలుగు దశాబ్దాలుగా చూస్తున్నదే. అమలు కాని వాగ్దానాలను విని వినీ రైతాంగమూ విసిగిపోయిందన్నది నిష్ఠుర సత్యం. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన పథకం కింద రెండు హెక్టార్ల (అయిదు ఎకరాల) లోపు భూమి ఉంటే ఆరు వేల రూపాయలు ఇస్తారు. రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ లెక్కన ఒక పంట సీజన్‌కు రైతుకు అందే సొమ్ము నామమాత్రమే. వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో రెండు హెక్టార్లలో ఒక సీజన్లో వరి పంట సాగు చేయాలంటే దాదాపు రూ.2.68 లక్షల మేర రైతు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ 'భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్' (సీఏసీపీ)కి నివేదించింది. ఆంధ్రప్రదేశ్ లోనూ దాదాపు ఇంతే ఖర్చు ఉంది. ఏడాదికి ఖరీఫ్, రబీ సీజన్లలో వరి పండించాలంటే ఈ ఖర్చు రూ. 5.36 లక్షలవుతుంది. ఇందులో కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలు కేవలం 1.11 శాతం. అంటే రైతు మిగతా 98.89 శాతం సొమ్ము తన చేతి నుంచి పెట్టుకోవాలి. పైగా 30 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు ఈ ఒక్క శాతం సాయమైనా కేంద్రం నుంచి అందదు. రైతులకు సాయం చేసే విషయంలో ఒక్కో ప్రభుత్వ తీరు ఒక్కో రకంగా ఉంది. వ్యవసాయాభివృద్ధి పథకాల్లో రాయితీలు ఇవ్వడం ఇంతకాలం చూశాం. ఇప్పుడు నేరుగా రైతు చేతికే నగదు ఇవ్వడం మొదలైంది. వాస్తవానికి భూ యజమానులంతా సేద్యం చేయడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పొలాన్ని దున్ని నిజంగా పంటలు పండించే వారిలో 30 శాతానికి పైగా కౌలు రైతులే. వీరికి ఎలాంటి రాయితీలు, నగదు అందజేయకుండా, వ్యవసాయానికి మేలు చేస్తున్నామని చెప్పడం ఎంతవరకూ సమంజసమో పాలకులకే తెలియాలి. కేంద్రం ప్రకటించిన పథకంలోనూ కౌలు రైతులకు సాయం ప్రస్తావనే లేదు. పంట సాగు ప్రారంభించే సమయంలో పెట్టుబడి సొమ్ము దొరక్క రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్ల మేర పంటరుణాలు ఇస్తామని నిరుడు బడ్జెట్లో ప్రకటించారు. కానీ, చాలా రాష్ట్రాల్లో పంపిణీ తక్కువగా ఉంది. పీఎం-కిసాన్ పథకం కింద ఇచ్చే ఆరు వేల రూపాయల మాదిరిగా పంట రుణాలు సైతం రాయితీ భూముల యజమానులకే ఇస్తున్నారు. భూములను కౌలుకు తీసుకుని పంట సాగుచేసే రైతులకు ఏ బ్యాంకూ రుణం ఇవ్వడం లేదు. దీన్ని సరిదిద్దే వ్యవస్థలే రాయితీ లేవు. పంట సాగు చేయకుండా కేవలం భూమి యజమాని అయినంత మాత్రాన పంట రుణం తీసుకోవడం ఏమిటనేది ప్రభుత్వం ప్రశ్నించడం రాయితీ లేదు. రూ.11 లక్షల కోట్ల రుణంలో ఇలాంటివారికి ఎంత వెళ్తుందనేది లెక్కించే వ్యవస్థలూ లేనేలేవు. సేద్యం చేయకుండా రైతు పేరుతో దర్జాగా పంటరుణాలు తీసుకునే భూయజమానులైన రైతులకు ఇస్తున్న పంటరుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వాలు చెల్లిస్తుండటం సరైనది కాదు. ఒక్క తెలంగాణలోనే ఇలా ప్రభుత్వం భరించాల్సిన వడ్డీ రూ. 700 కోట్లను దాటిందని తాజా లెక్కలు వివరిస్తున్నాయి. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, న్యాయవాదుల వంటి వ ృత్తినిపుణులు, ఆదాయపు పన్ను కట్టేవారు అయిదెకరాల్లోపు భూములున్నా పీఎం-కిసాన్ పథకం కింద ఆరు వేల రూపాయలు తీసుకుంటే క్రిమినల్ కేసు పెట్టి, డబ్బు వసూలు చేస్తామని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో స్పష్టీకరించింది. మరి ఇదే నిబంధనను పంట సాగుచేయకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకుని దానిపై ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీలను పొందుతున్న వారికి ఎందుకు వర్తింపజేయడం లేదు? పంట రుణాలను మాఫీ చేయడం వల్ల ఇలాంటి వారికే లక్షల రూపాయల లబ్ది కలుగుతుందనే విషయాన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా గ్రహించాల్సిన అవసరం ఉంది. రైతులకు రాయితీల పంపిణీ విధానం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటోంది. ఒక రాష్ట్రంలో ట్రాక్టర్ పై అయిదు లక్షల రూపాయల వరకూ రాయితీ ఇస్తూ వాటిని నేతల బినామీలకు పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. పంట సాగు ఖర్చుల వివరాలు రాష్ట్రాలు సేకరిస్తున్నా వాటికి అనుగుణంగా రాయితీలు, మద్దతు ధర మాత్రం ఇవ్వడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు. కిలో వరి విత్తనాల ధర రూ. 30కి పైనే ఉంటే జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకంలో కిలో ధరలో రాయితీ కింద అయిదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అధిక పెట్టుబడితో సాగుచేసే పత్తి, మిరప, పసుపు వంటి ఖరీదైన పంటల విత్తనాలపై ఎలాంటి రాయితీ లేదు. ప్రైవేటు కంపెనీలు చెప్పిన ధరలకే మిరప, పసుపు, టమాటా తదితర పంటల సంకరజాతి విత్తనాలను రైతులు కొనాల్సి వస్తోంది. టమాటా సంకరజాతి విత్తనాలను అధిక ధరలకు బహుళజాతి విత్తన సంస్థలు విక్రయిస్తున్నాయి. వాటిని కొని రైతు టమాటాలు పండిస్తే కిలో కనీసం అయిదారు రూపాయలకైనా కొనే దిక్కులేక రోడ్లపైనే పారబోస్తున్నారు. నాణ్యమైన విత్తనాలను సహేతుక ధరకు ఇప్పించే చట్టాలే లేవు. అడుగులు అడుగులు