చర్చల ప్రతినిధి కామ్రేడ్ కల్లెపు చంద్రన్న ఈ నెల 12న అమరుడయ్యాడని చెప్ప డానికి బాధపడుతు న్నాం . 1945, మే 5 న యాదాద్రి జిల్లా టంగు టూరిలో జన్మించిన చంద్రన్నకు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. పేదరికం వల్ల చిన్నప్పటినుండి ప్రభుత్వ హాస్టల్ లో ఎన్నో కష్ట నష్టాలకోర్చి చదువుకున్నాడు. చదువుకునే రోజుల్లో విద్యా సంస్థల్లో హాస్టళ్లలో సౌకర్యాల గూర్చి ప్రశ్నించడం మొదలు పెట్టిన చంద్రన్నకు 60 ఏండ్ల సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. గ్రామాల్లో అంటరానితనం గూర్చి చిన్న వయసులోనే ధిక్కారం చేసిన చంద్రన్న వల్ల కుటుంబం కూడా ఆధిపత్య వర్గాల వారి బెదిరింపులకు గురైంది. కటిక పేదకరికంతో బతుకుదెరువు కోసం హైదాబాద్ చేరుకున్న చంద్రన్న రోజు కూలీగా రైల్వేలో, టెలిఫోన్ డిపార్టుమెంట్లో తన వయ సుకు మించిన ఎంతో కష్టమైన పనులు చేశాడు. ఒక పక్కన కూలీ పనులు చేస్తూనే హైద్రాబాద్ లో పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగిన పోరులో కీలక పాత్ర వహించారు. చిన్నప్పటినుండి ప్రశ్నించే గుణం, పోరాట బావాలుండడం వల్లనే చంద్రన్న ఎమెర్జెన్సీ కాలంలో మార్కిస్టులెనినిస్టు రాజకీయాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1978 లో హైద్రాబాద్ లోని ఐ డి పి ఎల్ కంపెనీలో హెల్పర్ గా చేరిన చంద్రన్న తన తోటి కార్మికులకు జరుగుతున్న అన్యాయం గూర్చి, కార్మికుల కనీస వేతనాలు, సౌకర్యాల గూర్చి పెద్ద ఎత్తున పోరాటం చేసాడు. ఐ డి పి ఎల్ లో ఐ ఎఫ్ టి యు కు నాయకత్వం వహించిన చంద్రన్న వివిధ స్థాయిల్లో పని చేసి ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. హైద్రాబాద్ నగరంలోని పరిశ్రమల్లోని కార్మికులకే కాకుండా రాష్ట్ర కార్మిక లోకానికి బాగా తెలిసిన నాయకుడు చంద్రన్న తన జీవితాన్ని ప్రజలకోసం అంకితం కుటుంబం కూడా ఆధిపత్య వర్గాల వారి బెదిరింపులకు గురైంది. కటిక పేదకరికంతో బతుకుదెరువు కోసం హైదాబాద్ చేరుకున్న చంద్రన్న రోజు కూలీగా రైల్వేలో, టెలిఫోన్ డిపార్టుమెంట్లో తన వయ సుకు మించిన ఎంతో కష్టమైన పనులు చేశాడు. ఒక పక్కన కూలీ పనులు చేస్తూనే హైద్రాబాద్ లో పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగిన పోరులో కీలక పాత్ర వహించారు. చిన్నప్పటినుండి ప్రశ్నించే గుణం, పోరాట బావాలుండడం వల్లనే చంద్రన్న ఎమెర్జెన్సీ కాలంలో మార్కిస్టులెనినిస్టు రాజకీయాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1978 లో హైద్రాబాద్ లోని ఐ డి పి ఎల్ కంపెనీలో హెల్పర్ గా చేరిన చంద్రన్న తన తోటి కార్మికులకు జరుగుతున్న అన్యాయం గూర్చి, కార్మికుల కనీస వేతనాలు, సౌకర్యాల గూర్చి పెద్ద ఎత్తున పోరాటం చేసాడు. ఐ డి పి ఎల్ లో ఐ ఎఫ్ యు కు నాయకత్వం వహించిన చంద్రన్న వివిధ స్థాయిల్లో పని చేసి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. హైద్రాబాద్ నగరంలోని పరిశ్రమల్లోని కార్మికులకే కాకుండా రాష్ట్ర కార్మిక లోకానికి బాగా తెలిసిన నాయకుడు చంద్రన్న తన జీవితాన్ని ప్రజలకోసం అంకితం చేసిన త్యాగశీలి. కార్మిక నాయకుడిగా చురుకుగా పాల్గొంటూనే కార్మిక సంఘాల విలీనంతో ఏర్పడ్డ ఎ ఐ ఎఫ్ టి యు లో కూడా ముఖ్య బాధ్యతల్లో ఉండి కార్మికులకు అండ దండగ ఉన్నాడు. కార్మిక నాయకుడిగా కొనసాగుతూనే పోరాటం చేస్తున్న జనశక్తి పార్టీలో కీలక భూమిక పోషించారు. పార్టీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు, పార్టీ సభ్యులు ఎన్కౌంటర్ లో చనిపోయినప్పుడు చంద్రన్న ఎంతో ధైర్యంతో అమరుల కుటుంబాలకు అండగా నిలిచేవారు. 2005 లో రాష్ట్రంలో నక్సలైట్లకు ప్రభుత్వానికి జరిగిన శాంతి చర్చల ప్రతినిధి గా చంద్రన్న పాల్గొని ప్రజల సమస్యలను పాలకుల ముందుంచి వర పోరాట దృక్పధాన్ని తాడిత పీడిత ప్రజల జీవనం మెరుగుపడాలంటే అవమా జన్మించి అంటరానితనంలో ఏమి చేయాలో వివరించారు. చంద్రన్నతో చర్చల్లో పాల్గొన్న జనశక్తి నాయకులు కామ్రేడ్ రియాజ్ ను అప్పటి ఆంధ్ర పాలకులు బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపితే పార్టీ శ్రేణులతో కలిసి చంద్రన్న ఉద్యమించాడు. పేదరికంలో జన్మించి అంటరానితనంతో ఎన్నో అవమానాలకు గురై మార్కిజం తో పాలకుల దోపిడీని ప్రశ్నించడం నేర్చుకున్న చంద్రన్న తర్వాత క్రమంలో హిందూ పాసిజాన్ని, అగ్రకుల దోపిడీ పాలనను అర్థం చేసుకుని ఆ వైపుగా తన ఆలోచనలు చేసాడు. ఇండియాలో ఉన్న కులం నిర్మూలన కాకుండా వర్గ నిర్మూలన సాధ్యం కాదని అందుకోసం పూలే అంబేడ్కర్ సిద్ధాంతముతో వర్గపోరాటం కుల నిర్మూలన పోరాటం జమిలిగా చేయాలని కూడా పార్టీలో . తద్వారా జనశక్తి పార్టీ కార్యకలాపాలకు దూరమై తను చర్చ లేవనెత్తారు. తద్వారా జనశక్తి పార్టీ కార్యకలాపాలకు దూరమై తను భావించిన అనగారిన వర్గాల విముక్తి కోసం నలు దిశల్లో పోరాటం చేసి దళిత బహుజన వర్గాలతో మమేకమై పనిచేసారు. రాష్ట్రంలో పాలకుల అణచివేత, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వల్ల పార్టీలన్నీ చీలికలతో ఎన్నో నష్టాలను ఖచవిచూశాయి. కొన్ని ఉద్యమ పార్టీలను పాలకులు లేకుండా చేశారు. పాలకుల నిర్బంధం, పార్టీలో సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడ్డ ధీరుడు చంద్రన్న పార్టీ కార్యకలాపాలు తగ్గినాక కూడా చంద్రన్న తన పోరాటాన్ని ఆపలేదు. అసంఘటిత కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ప్రజా సంఘాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేసాడు. రాష్ట్రంలో అనగారిన కులాల ఐక్యత కోసం మాదిగ ఉప కులాల మద్య ఉన్న వివక్షతను రూపుమాపడం కోసం ఏర్పడ్డ తెలంగాణ మాదిగ ఉప కులాల ఫ్రంట్ లో డాక్టర్ కొల్లూరి చిరంజీవి తో కలిసి చంద్రన్న రాష్ట్ర వ్యాప్తంగా సంఘ నిర్మాణంలో కీలక పాత్ర వహించాడు. తెలంగాణ కోసం పోరాటం చేసిన చంద్రన్న తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల సమస్యల గూర్చి పోరాటం చేయడమే కాకుండా సామాజిక తెలంగాణ ఆవశ్యకతను గమనించి ఆ దిశగా కదిలిన పోరులో బాగస్వామ్యమయ్యారు. టి మాస్ లో, బి ఎల్ ఎఫ్ లో కూడా పని చేసి అనగారిన ప్రజలను చైతన్యం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. “తెలంగాణ సమరయోధుల సంఘం నిర్మాణం” నిజాం పాలన నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఉద్యమకారులు ఎన్నో త్యాగపూరిత పోరాటాలు చేసి కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరి జీవితాలతో జీవుతాలను గడుపుతుంటే ఉద్యమకారుల త్యాగాల వల్ల వాల త్యాగాల వల్ల పాలకులు మారుతున్నారే కానీ పాలన మారడం లేదని అంచు మిత్రులతో చర్చించే చంద్రన్న అలా ఎంతో మంది త్యాగాలు చేయడం వల్లనే తెలంగాణ ఏర్పడిందని మన తెలంగాణ లో త్యాగాలు ది చర్చించి తెలంగాణ చేసిన వారికి అమరులైన వారి కుటుంబాలకు న్యాయం జరగాలని, తెలంగాణలో పీడిత ప్రజల విముక్తి కోసం పొరుచేసిన త్యాగధనులను వారి కుటుంబాలను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని ఆ దిశగా ప్రయాణం చేస్తూ గత ఏడాది క్రితం చాలా మంది ఉద్యమ మిత్రులతో చర్చించి తెలంగాణ సమరయోధుల సంఘం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ సమరయోధుల సంఘానికి విధాన కమిటీ చైర్మన్ ఘోదాలోనే చంద్రన్న అమరుడయ్యాడు. సుదీర్ఘ ఉద్యమ చరిత్ర కలిగిన చంద్రన్న మరణం సమరయోధుల సంఘానికి తీరని లోటు. సున్నిత మనస్తత్వం కలిగిన చంద్రన్న నిగర్వి. కుట్రలు, మోసాలు చేయని నిజమైన విప్లవకారుడు, ప్రజల సమస్యలపై పోరులో వెనుకకు తగ్గని చంద్రన్న ఉద్యమ మిత్రుల వద్ద అంతే నిక్కచ్చగా ఉండేవారు. ఎంతటి కష్ట కాలంలో కూడా చంద్రన్న మొఖంలో చిరాకు కోపం కనిపించకపోవడం గొప్ప విషయం. ఆచరణ గీటు రాయి అనే సూత్రానికి చంద్రన్న జీవితం, ఉద్యమం ఒక నిలువెత్తు నిదర్శనం. ఐ డి పి ఎల్ చంద్రన్న గా, ఐ ఎఫ్ టి యు చంద్రన్న గా, జనశక్తి చంద్రన్నగా, చర్చల ప్రతినిధి చంద్రన్న గా, పూలే అంబేడ్కర్ బాటలో ఉద్యమంచిన అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా చంద్రన్న అందరివాడు గా అమరుడయ్యాడు. చంద్రన్న నలుగురు పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడే తన సహచరి లక్ష్మీ చనిపోతే నిత్య నిర్బంధంలో పార్టీలో పనిచేస్తూనే తన పిల్లలను సాదుకుంటూ వచ్చాడు. ఇంతటి కష్టంలో తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొన్న చంద్రన్న త్యాగం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. చాలా మంది ఉద్యమకారుల తీరునే చంద్రన్న ఆరోగ్యం క్షీణించి ప్రజలకు దూరమయ్యాడు. బాలగోపాల్, బుర్ర రాములు లాంటి మానవహక్కుల నాయకులు కూడా వారి ఆరోగ్యం క్షీణించి అమరులైనారు. సరైన ఆరోగ్య సహకారం లేకపోవడమే చంద్రన్నను మనం కోల్పోయాము. చంద్రన్న లాంటి ఉద్యమకారులకు ఆరోగ్య సహకారం అందించి ఉద్యమ శక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఊహ తెలిసిన నాటి నుండి తన చివరి శ్వాస వరకు విరామం ఎరుగని విప్లవకారుడిగా ప్రాణాలకు తెగించి ఎన్నో ఉద్యమాల్లో పని చేసిన చంద్రన్న పోరాట జీవితం నేటి తరం ఉద్యమకారులకు ఆదర్శం కావాలి. చంద్రన్న కోరుకున్న వర్గ నిర్మూలన, పూలే అంబేడ్కర్ ఆలోచనతో సామాజికన్యాయం కోసం మనమంతా పోరాటం చేసిన నాడే చంద్రన్నకు నిజమైన నివాళి. జోహార్ చంద్రన్న
సాయిని నరేందర్ తెలంగాణ సమరయోధుల సంఘం,
విధాన కమిటీ సభ్యులు) సెల్ : 9701916091