ప్రభుత్వంతో సహా పలు సంస్థలు తమ పరిధి దాటి పౌరుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొంటే పౌర ప్రయోజనాల రక్షణకు తాను ముందుకొసానని సుప్రీంకోరు సుషం చేసింది. సాంకేతికత విజుంభిసును ఈ రోజుల్లో కోర్టు వ్యాఖ్యలు ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొన్నాయి. ప్రజాస్వామ్యాన్ని on మరింత పరిపుష్టం చేసే తీర్పు ఇది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు కాదనే వాదనలోని డొల్లతనం దీంతో బట్టబయలైంది. 50-60 ఏళ్ల కిందటివారితో పోలిస్తే ఈనాటి యువతరం చదువులో, నైపుణ్యాల్లో, జీవితాశయాల్లో ఎంతో ముందుంది. నేడు భారత జనాభాలో 27 ఏళ్లలోపు యువతీయువకుల వాటాయే అత్యధికం. సాంకేతిక సాధనాలు, సామాజిక మాధ్యమాలను విరివిగా వాడే ఈ తరానికి వ్యక్తిగత గోప్యత విలువ, ప్రాముఖ్యాలు బాగా తెలుసు. నేడు స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వ్యకుల సమాచారాన్ని సేకరించడం వివిధ సంసలకు మహా సులువైపోయింది. వారి నిఘా నేతం నుంచి పౌరులు తమను తాము రక్షించుకోక తప్పదు. మారిన పరిస్థితులకు, మారిన తరాలకు అనువైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించి మన్ననలు అందుకొంది. డేటా భద్రతకు చర్యలు తప్పనిసరి మునుపెన్నడూ లేని విధంగా టెక్నాలజీ మన జీవితాలకు కేంద్ర బిందువైంది. పెద్ద నోట్ల రద్దు తరవాత డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్న ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదా సిమ్ ను పోగొట్టుకునే వ్యక్తి తీవ్ర ఆర్థిక కునే స రికి నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఆధార్‌ను, బ్యాంకు ఖాతాలకు అనుసంధానించి దాం. మొబైల్ లోనే ఆర్థిక లావాదేవీలు జరిపే సౌలభ్యం ఏర్పడటం ప్రస్తుతం ఒక వరమే అయినా, రేపు శాపంగా పరిణమించవచ్చు. పాస్ వర్డ్లు, తద్వారా వ్యక్తుల వివరాలను కాజేసి బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము లాగేసే ఉదంతాలు ఈ మధ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అంతర్జాలంలో, మొబైల్ ఫోన్లలో మన లావాదేవీలు, ఇతర వ్యవహారాలు ఎప్పటికప్పుడు డిజిటల్ అడుగుజాడలను వదులుతాయి. వీటి ఆధారంగా మన సమాచారాన్ని అవాంఛనీయ శక్తులు దొంగిలించి దుర్వినియోగం చేసే వీలుంది. ఇలా జరుగుతుందనే సంగతి మనలో చాలామందికి తెలియదు. ఉదాహరణకు గూగుల్, యాహూ, ఫేస్ బుక్, ట్విటర్ సైట్ల గోప్యతా ఒప్పందాలను మనలో ఎంతమంది వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే గోప్యత అనేది తిరుగులేని హక్కు కాదని కోర్టు స్పష్టీకరించిన విషయం వారు మర పోతున్నారు. నిజానికి సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన తీర్పు సమతూకంగా ఉంది. వ్యక్తుల సమాచారాన్ని తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఎడా పెడా వాడేసే ప్రైవేటు ప్రైవేటు రంగానికి ఇది ఓ హెచ్చరిక. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని కొందరు గగ్గోలు పెట్టడం పూర్తిగా అర్థరహితం. జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం అవసరమైతే ప్రాథమిక హక్కుల విద కొంతకాలంపాటు సహేతుక ఆంక్షలు విధించవచ్చునని రాజ్యాంగం పేర్కొంటున్న సంగతినీ వీరు విస్మరిస్తున్నారు. ఒక వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉన్నంత మాత్రాన, దాని పేరిట ఎదుటి వ్యక్తి ప్రాథమిక పిల్లలను • హక్కులను ఉల్లంఘించకూడదని మన చట్టాలు స్పష్టీకరిస్తున్నాయి. గోప్యతపై సుప్రీంకోర్టు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ సూత్రానికి విరుద్ధం కాదు. సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన ఆర్పు ఆ న్యాయస్థానమిచ్చిన తీర్పు అవినీతిపై పోరాటానికి అడ్డు తగులుతుందనే వాదనా సరికాదు. కేవలం కోర్టు తీర్పులు, చట్టాలతోనే అవినీతిని నిర్మూలించడం సాధ్యమైతే ఆ పని ఎప్పుడో జరిగి ఉండేది. ప్రజల్లో మార్పు రానంతవరకు అవినీతిని పూర్తిగా అరికట్టలేం. లంచం పుచ్చుకొనేవాడిది ఎంత తప్పో... ఇచ్చే వాడిదీ అంతకన్నా పెద్ద తప్పు.మరీ ముఖ్యంగా ఆధార్ కార్డును సుప్రీంకోర్టు తీర్పు నిషేధించడం లేదన్న సంగతిని గమనించాలి. ఆధార్ రాజ్యాంగ బద్దమా కాదా అనే అంశం అయిదుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలనలో ఉంది. తాజా తీర్పు ప్రభావం ఆ కేసు విచారణ మిద ఏ మేరకు ఉంటుందో తెలియదు. ఏదిఏమైనా ప్రస్తుతం ఆధార్ అవసరమైన కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగుతాయి. సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చూడటానికి ప్రభుత్వం వివిధ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అయితే ప్రైవేటు సంస్థలు ఆధార్ వివరాలను దుర్వినియోగం చేయకుండా తప్పక జాగ్రత్త పడవలసిందే. ఆధార్, ఇంకా ఇతర సాంకేతిక మార్గాల్లో సేకరించిన సమాచారం ప్రభుత్వం కన్నా ప్రైవేటు వ్యాపారాలకే బాగా ఉపయోగపడుతున్నది. ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతోందని అధికార వర్గాలు చెబుతున్నా కంప్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాత్రం అనుకున్న దానికన్నా తక్కువ ఆదా అవుతోందని తేల్చింది. తీర్పులో కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాజాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తాయి. గతంలో ఎంపీ శర్మ, ఖరక్ సింగ్ కేసుల్లో వెలువడిన తీర్పులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాలు పౌరుల గోప్యతను హరించడానికి పూనుకొన్నాయి. ఆ అవాంఛనీయ కోర్టునిర్ణయాలను తాజా తీర్పుతో కొట్టివేశారు. జీవించడానికి, వ్యక్తిగత స్వేచ్చకు పౌరులకు హక్కు ఉందని భరోసా ఇచ్చే 21వ అధికరణ పరిధిలోకి గోప్యతా హక్కు కూడా వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం ఉద్ఘాటించింది. ఇల్లు, కుటుంబం, దాంపత్య జీవనం, సంతానోత్పత్తి, మాతృత్వం, పిల్లలను కనడం, విద్యాభ్యాసం సాగించడం... ఇవన్నీ పౌరుల ఆంతరంగిక వ్యవహారాలని, అవి వ్యక్తిగత గోప్యత పరిధిలోకి వస్తాయని, సదరు పౌరుడి సమ్మతి లేకుండా ఈ సమాచారాన్ని ప్రచురించే అధికారం ఎవరికీ లేదని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చి ఉంది. తాజా తీర్పు ఈ అంశాలను పునరుద్ఘాటించింది.
వ్యక్తిగత గోప్యత అవసరమే...