' బారతదేశం నా మాతృభూమి' అని చిన్నప్పుడే ప్రతిజ్ఞ చేశాం. 'భారతీయులందరూ నా సూదరులు' అని ఏకత్వాన్ని పెనవేసుకున్నాం. ఆ ప్రతిజ్ఞకే పరీక్ష పెట్టబోతోంది బిజెపి ప్రభుత్వం. ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని ప్రశ్నించబోతోంది. మన ఉనికికి రుజువులు అడగబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు - దేశం మొత్తమ్మీద 'నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెషిప్' (ఎన్నార్సీ) అమలు చేస్తేమనల్ని మనం రుజువు చేసుకోవాలి. రుజువు చేసుకోలేకపోతే... మన నేలకు మనకు పరాయివాళ్లం అవుతాం. విదేశీయులమవుతాం. ఆదిలోనే ఈ ఆలోచనను అడ్డుకోకపోతే మనం నిజంగానే- 'అడ్రసు' కోసం అల్లాడిపోతాం . ఆధార్ కార్డో, రేషను కార్డో, డ్రైవింగు లైసెన్సో, ఓటరు కార్డో చూపించాలనుకుంటారు మీరు. కానీ, అవేమీ మీ పౌరసత్వాన్ని నిరూపించలేవు. మీరు ఈ దేశ పౌరులని నిరూపించుకోవాలంటే1971కి ముందు నాటి అధికారిక ధృవపత్రాలు కావాలి. బిజెపి నేత త్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టు, హెూంమంత్రి అమిత్ షా మంది అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించినట్టు ... దేశమంతా జాతీయ పౌర పట్టిక తయారీ చేపడితే- మనందరికీ తిప్పలు తప్పవు. మనల్ని మనం మన దేశ పౌరులుగా నిరూపించుకోవటానికి నానా అగచాట్లూ పడాల్సి ఉంటుంది. అనేక వ్యయప్రయాసలకు గురి కావాల్సి ఉంటుంది. అయినా సరేబీ భారత పౌరులుగా గుర్తించబడతామా? అనడిగితే- 'అవును' అని కచ్చితంగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే మనముందు అసోం రాష్ట్ర ఎన్నార్సీ ఉదంతం పెద్ద ఉదాహరణగా ఉంది. ఇదిగో .. చూడండి!..మహ్మద్ సనల్లా ..ఇండియన్ ఆర్మీలో 30 ఏళ్ల పాటు సేవలు అందించిన అధికారి. మణిపులో, కశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడాయన. కానీ, ఇప్పుడు 'ఈ దేశ పౌరుడు కాదు.. ఎందుకంటేఆయన పేరు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్లిప్ (ఎన్నార్సీ)లో లేదు. గత ఆగస్టు 31న ఎన్నార్సీ తుది జాబితా వెలువడినప్పుడు కూడా ఆయన పేరు అందులో లేదు. ఉన్నఫళాన ఆయన 'విదేశీయుడు' అయిపోయాడు. చొరబాటుదారుగా నేరస్తుడయ్యాడు. వెంటనే పోలీసులు అరెస్టు చేసి తరలించారు. 30 ఏళ్ల పాటు భారత సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించిన అధికారిని ఇప్పుడు భద్రత లేకుండా పోయింది! దీనిపై ఆయన గహవాటి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు డిటెన్షన్ క్యాంపు నుంచి విడుదల లభించింది. కానీ, ఆయన తాను విదేశీయుడిని కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇంకా మిగిలే ఉంది. ఆయన కుటుంబం ఇప్పుడు అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ..మన దేశ ఐదో రాష్ట్రపతి. 1905లో ఢిల్లీలో జన్మించారు. కాంగ్రెస్ హయాంలో 1966 నుంచి 1974 వరకూ కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది. 1974 నుంచి 1977 వరకూ రాష్ట్రపతి పదవిలో ఉన్నారు. ఆయన ఆయన Is హయాంలో 1966 AM 305లో ఢిల్లీలో కుటుంబ సభ్యులు అసోంలోని రోంగియా సబ్ డివిజన్ పరిధిలోని భార్బాగియా అనే ఊళ్లో నివసిస్తున్నారు. అసోం ఎన్నార్సీలో వారి పేర్లు లేవు. కాబట్టి వాళ్లిప్పుడు విదేశీయుల కింద లెక్క! సాబిమల్ బిశ్వాస్ ..ఈయన 73 ఏళ్ల రిటైర్లు బ్యాంకు అధికారి. 1947లో అసోంలోని కరీంగంజ్ జిల్లాలో పుట్టారు. భారతీయ స్టేట్ బ్యాంకులో చేరటానికి ముందు సర్వే ఆఫ్ ఇండియాలోనూ, అసోం రాష్ట్ర విద్యాశాఖలోనూ పనిచేశారు. కానీ, ఇప్పుడు 'భారతీయుడు'గా గుర్తింపు పొందలేకపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలూ, భార్య ఉన్నారు. ఒక కుమార్తెకు మాత్రం ఎ కుమార్తెకు మాత్రం ఎన్నార్సీలో చోటు దక్కింది. మిగతా ముగ్గురూ ఈ ృవపత్రాలను దేశ పౌరుల జాబితాలో లేరు. .. ఈ మూడు కుటుంబాలే కాదుబీ 19 లక్షల మందికి పైగా అసోం ఎన్నార్సీలో స్థానం సంపాదించలేకపోయారు. ఇప్పుడు వారంతా ఈ దేశ పౌరులు కానట్టు లెక్క. ఇక్కడ నివసించటానికి అర్హులు కానట్టు అర్థం. మళ్లీ ఇందులో కొంతమందికి ... వారు దరఖాస్తు చేసుకుంటే- పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం - పౌరసత్వం రావొచ్చు. కొంతమంది తగిన రుజువులు చూపం రుజువులు చూపించుకోలేని కారణంగా వారు శాశ్వతంగా ఈ దేశంలో స్థానం కొల్పావచ్చు! అసోం ఎన్నార్సిలో పేర్లు లేనివారిలో 3 లక్షల మంది ముస్లిములు, 16 లక్షల మంది ముస్లిమేతరులు ఉన్నారు. ఇందులో చాలాకాలంగా ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, తాతదండ్రుల కాలం నుంచి ఈ దేశంలోనే పుట్టి పెరిగిన వాళ్లూ ఉన్నారు. కేవలం ఆ విషయాన్ని నిరూపించుకోలేకపోవటం' వల్ల ఇప్పుడు డిటెన్షన్ క్యాంపుల్లో దోషులుగా నించున్నారు. పొట్ట చేత పట్టుకొని మన పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లూ ఉన్నారు. అసోంలో పదేళ్ల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని- ఎన్నార్సీని తయారు చేశారు. ఇందుకోసం 55 వేల మంది ఉద్యోగులను వినియోగించారు. వారు అసోంలోని 3 కోట్ల 11 లక్షల మంది జనాభా వివరాలు సేకరించారు. 6.6 కోట్ల పత్రాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ మొత్తం నడవటానికి రూ.1600 కోట్ల ధనం ఖర్చయింది. ఇదే తంతు ఇప్పుడు దేశవ్యాప్తంగా జరపాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే- 'భారతీయులు' కాని వారిని కనిపెట్టటానికి. ఎలా నిరూపించుకుంటాం? ఉన్నఫళాన ఒక మనిషిని పట్టుకొని నిన్ను నువ్వు 'పౌరుడిగా' నిరూపించుకో అంటే- అతడు ఏం నిరూపించుకోవాలి? ఎలా నిరూపించుకోవాలి? ఇన్నేళ్ల పాటు మనం ఈదేశంలో 'గుర్తింపు' లేకుండానే బతుకుతున్నామా? ఈ దేశంలోకి అక్రమ వలసదారులు ఎ ఎవరో కనిపెట్టటానికి ఇంత హంగామా అవసరమా? ఒక ఊళ్లోకి దొంగ చొరబడితే- ఆ ఊళ్లోవాళ్లంతా పనీపాటా మానేసి... రోడ్ల మీదికి వచ్చి .. తాము ఆ ఊరివాళ్లమని నిరూపించుకోవాలా? ఆధారాలు చూపెట్టాలా? దొంగను పట్టుకోలేని చేతగానితనాన్ని ఊరి మొత్తానికి శిక్షగా మార్చటం unia ఈ దేశంలోకి అక్రమ ఎవరో కనిపెట్టటానికి న్యాయమా? కేంద్ర ప్రభుత్వ తీరు మాత్రం అదే న్యాయమన్నట్టుగా ఉంది. పైగా అదొక దేశభక్తియుత కార్యక్రమంగా డాంబికాలు పలుకుతోంది. ఈ హాస్యాస్పద తతంగాన్ని దేశంలో ఎవరూ స్వాగతించే స్థితిలో లేరు. తనను తాను నిరూపించుకొనే అనవసర కాలహరణంలోకి అడుగు పెట్టే ఆసక్తి ఎవరికీ లేదు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు ఆ విషయాన్నే చాటి చెబుతున్నాయి. మొదట్లో ఉదహరించినట్టు ఒక ఆర్మీ అధికారి, రాష్ట్రపతి కుటుంబం, బ్యాంకు ఉద్యోగీ ... తాము భారతీయులమేనని నిరూపించుకునే ధ ృవపత్రాలను సమర్పించలేకపోతే- కోట్లాదిమంది సామాన్యులు ఆ పనిని ఎలా చేయగలరు? 'పౌరసత్వ పరీక్ష'లో ఎలా నెగ్గుకురాగలరు? భారతదేశం నా మాతృభూమి' అని మనం చిన్నప్పటినుంచి ప్రతిజ్ఞ చేస్తాం. ఆ ప్రతిజ్ఞనే ప్రభుత్వం ఇప్పుడు అపహాస్యం చేస్తోంది. ఇప్పటిదాకా ఉన్న మన సమస్త అస్తిత్వాలకు, సాంస్కృతిక చారిత్రిక వారసత్వాలకు పెద్ద గుండు సున్నా చుట్టేసి ... 'కొత్త నిరూపణ'కు బోనులో నించోమని చెబుతోంది. ఇది ఓ విదూషక విన్యాసం. కేతిగాడి కేరింత. ఇంట్లో ఎలక ఉందని ఇంటినే తగలబెట్టే తల తక్కువ తతంగం. ఇళ్లల్లో ఏవొక ధృవపత్రాలను కలిగి ఉండటం ఇటీవల కాలంలోనే మనకు అవసరంగా మారింది. ఓటరు గుర్తింపు కార్డులు వచ్చి పదేళ్లు దాటలేదు. ఆధార్ ఈ మధ్యలోనే మొదలైంది. రేషను కార్డులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. వాటన్నిటినీ దాచి పెట్టుకోవల్సిన అవసరమూ లేదు. 1971 నాటికి భూమిని అధికారికంగా కలిగిన ఉన్న వారి శాతం 40కి మించిలేదు. అంటే నూటికి 60 మంది భూసంబంధమైన ధృవపత్రాలను కలిగి ఉండే అవకాశమే లేదు. 1971లో మన దేశ అక్షరాస్యత 34.45 శాతం. ఈ శాతంలోనూ సంతకం మాత్రమే పెట్టగలిగిన సాదాసీదా విద్య ఉన్నవాళ్లే ఎక్కువ. ఇలాంటి నేపథ్యంలో ఎన్ని కుటుంబాల పెద్దలు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంది? అలాంటి పత్రాలను ఎంతమంది కలిగి ఉండే పరిస్థితి ఉంది? స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు గడిచినా ఇంకా 74 శాతం దగ్గరే తారట్లాడుతున్న అక్షరాస్యత మనది. పౌరసత్వ నిరూపణకు 1971 ముందు నాటి అధికారిక రుజువులు చూపమంటే- ఎంతమందిమి చూపగలం? దళితులు, గిరిజనులు, వెనకబడిన తరగతుల వారు, వ ఎత్తిదారులు, సంచారజీవులూ ... నానా తంటాలు పడినా 'ఆధారాలు' సంపాదించలేరు. అంటే- వారందరూ ఈ దేశ పౌరులు కాకుండా పోతారా? అలాంటి వారంతా 'మాకు పౌరసత్వ గుర్తింపు ఇవ్వండి మహాప్రభో' అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడాలా? అసోం రాష్ట్రానికి ఎన్నార్సీ ఒక చారిత్రిక అవసరం. అది పొరుగు దేశాలకు సరిహద్దు రాష్ట్రం. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు- చాలా సంఘర్షణ జరిగింది. తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)లో అల్లకల్లోలం మొదలైంది. ఆ సమయంలో అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో మనదేశంలోని సరిహద్దు (మిగతా రేపు)
పౌరసత్వ పరీక్షకు సిద్ధం కండి!