వ్యాధిగ్రస్తమైన అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతున్నవాడైనా సంతృప్తిగా, సుఖంగా ఉండలేకపోతున్నాడు. అందుకే అతడికి శాంతి కరవవుతోంది. తొమ్మిదో ఐశ్వర్యం 'శాంతి' లేనప్పుడు, ఉన్న ఎనిమిది ఐశ్వర్యాలూ మంచి జీవితాన్ని ప్రసాదించలేవని పెద్దలు చెబుతారు. పంచభూతాలు శాంతిగా ఉంటూ, మనిషినీ అదేవిధంగా ఉండమంటున్నాయి. మానవుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణం శాంతి- అని 'తైత్తిరీయోపనిషత్తు' ప్రబోధిస్తోంది. దేవతలు శ్రీహరిని మొదట 'శాంతాకారం' అంటూ స్తుతించారు. శ్రీహరి నామం చిత్తశాంతిదాయకమని అన్నమయ్య గానం చేశాడు. శివస్తోత్రం పరమేశ్వరుణ్ని 'శాంతుడు' అని కీర్తించింది. శాంతం లేనిదే సౌఖ్యం ఉండదన్నాడు. త్యాగయ్య. ధర్మాచరణ ఒక్కటే శాంతినిచ్చే దివ్య ఔషధమంటాడు భక్తకవి (దాసు. శాంతిదాయక చిత్తశుద్ది మానవ జీవితానికి రాచబాట వంటిది. మంచిమాట అనడం, వినడం వల్ల జ్ఞానకాంతి హృదయమంతటా విస్తరిస్తుంది. అదే శాంతికి నాంది అంటుంది 'ఐతరేయోపనిషత్తు'. స్మితభాషి, ప్రియభాషి, వాక్యవిశారదుడైన కారణంగానే శ్రీరాముడు సతతం శాంత స్వరూపుడై మర్యాదా పురుషోత్తముడిగా కీర్తి పొందాడు. మంగళ శబ్దాలనే వినాలని, అటువంటివాటినే ప్రవచించాలని, అదే శాంతికి మూలమని భారతీయ సనాతన ధర్మం చెబుతుంది. నాలుక చివర మధువు ఉండాలి. అది మూలం నుంచి ఊరుతూ సత్య వాగ్భాషణం చేయించాలని 'అధర్వణ వేదం' విపులీకరిస్తుంది. చిత్తంలో మనోవికారాలకు తావు లేకుండా చేయాలి. అప్పుడే శాంతికి చేరువ కాగలమని బుద్ధభగవానుడి ఉద్బోధ. శాంతిసందేశానికి అశోకుడు వంటివారెందరో పరివర్తన చెందారు. కామ క్రోధాది అరిషడ్వర్గాల నుంచి శమింపజేసే మహత్తర గుణం శాంతానికి ఉందని 'అమర కోశం' సారాంశం. 'పంచుకుందాం, కలిసి భుజించుదాం' అంటుంది శాంతి వచనం. మనిషిపై మూడు రకాల తాపాలు ప్రభావం కనబరుస్తూ, శాంతిని దూరం చేస్తుంటాయి. ఇంద్రియ తాపాదుల వల్ల అతడు ప్రభావితుడవుతాడు. ప్రలోభాలకు గురై సుఖశాంతులు కోల్పోతాడు.
శాంతి సూక్తం