ప్రజాపాలన సంపాదకీయం గురువారం 19 డిసెంబర్, 2019 బంగారం లాంటి ధర పలుకుతుందని గంపెడాశలు రేకెతించి అమాంతం పుటి ముంచేయడంలో ఎనలేని 'ఖ్యాతి' కలిగిన పతిని ఏరికోరి వితిన రైతుల కిప్పుడు గుడ్లు వెళ్తుకొస్తున్నాయి. గులాబీ రంగు పురుగు దాడి మూలాన పతి సాగుదారులు తీవ్రంగా నష్టపోయే ముప్పు పొంచి ఉందని ఏడాదిన్నర క్రితమే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ప్రమాద ఘంటికలు మోగించింది. కనీస మదతు ధరా దక్కని దుస్థితి నెత్తిన కత్తిలా వేలాడుతోందని తనవంతుగా తెలంగాణ వ్యవసాయ మంత్రిత్వశాఖ అప్పట్లోనే మదింపు వేసింది. ఆ అంచనాలు యథాతథంగా నిజం కావడంతోపాటు మరిన్ని కష్టన ష్టాలూ పత్తి రైతుల్ని నేడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిరుడు ఎండుమిరప ధరాపతనం కారణంగా ఆపద్బాంధవి కాగలదన్న లెక్కతో ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే పతిసాగు 30 శాతానికి పైగా పెరిగింది. తెలంగాణ, ఏపీ, కరాటక, మహా రాషలో నకిలీ వితుల రూపేణా ఆదిలోనే హంసపాదు ఎదురెంది. కొత తెగుళకు అం టు కటిన బీటీ పతి రకాలు, అనుమతి లేని బీజీ-3 బీజాలతో ఎలాగైనా పంటను నిలబెటుకోవాలన్న ఆరాటంలో అత్యంత విషపూరిత రసా యనాల వినియోగం పెచ్చరిలింది. పురుగుల సంహరణ మాట ఎలాగున్నా - చాలాచోట అది రైతులు, కూలీల కుటుంబాలో చావుడప్పు మోగించింది. తకినవారిలో మరెందరో అకాల వరాల పుణ్యమా అని దిగుబడి నషపోయా రు. సేద్య వైకుంఠపాళిలో సర్పగండాల్సి దాటిన పతిరైతుల ఆశల్ని దూదిపిం జెలు చేసూ ప్రస్తుతం ఎక్కడికక్కడ విపణి మోసాలు దిగ్ర్భాంతపరుస్తోంది. క్వింటా పత్తికి మద్దతుధర రూ.4320- రైతుల్లో అత్యధికులకు దక్కడం లేదు. అర్జీదారులు, కొనుగోలుదారుల గూడుపుఠాణి నేపథ్యంలో తేమశాతం పేరిట వంచనలు, దళారుల దొంగాటకాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడికైనా ఠికాణా లేని దురవస్థ పత్తి రైతాంగాన్ని నిలువునా కుంగదీస్తోంది! పత్తి, మొక్కజొన్న, సోయా తదితర సాగుదారులందరిదీ తరతమ భేదాలతో ఒకటే కథ. గిట్టుబాటుకు నోచక ఆక్రందిస్తున్న ఎందరిదో ఒకే వ్యధ! ఈసారి దేశవ్యాప్తంగా సోయాచిక్కుడు దిగుబడి తగ్గనుందని కేంద్ర అర్థగణాంక శాఖ ముందస్తు అంచనాలు వెల్లడించాయి. సరఫరా, గిరాకీల సహజ ఆర్థిక సూత్రాన్ని అపహసిస్తున్న రీతిలో- దిగుబడి తగ్గినా ధర క్రితమే క్షీణిస్తుండటం సోయా రైతుల్ని కలచివేస్తోంది. వాస్తవంలో క్వింటా సోయా మద్దతు ధర రూ.3,050 అయినప్పటికీ విపణిలో రైతుకు రూ.2,000- తెలంగాణ రూ. 2,700 వరకే ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు మిన్నం టుతున్నాయి. అంచనాలు పత్తికి మద్దతు ధర బాగోతం మరింత విడ్డూరమైంది. 46 లక్షల ఎక రాల పత్తి సాగు విస్తీర్ణం కలిగిన తెలంగాణ ఈ ఏడాది పంటకు కోరిన మద్దతు ధర క్వింటా ఒక్కింటికి రూ. 8,411. పద్నాలుగు లక్షల ఎకరాల మేర పత్తి విత్తిన ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి సిఫార్సు చేసిన రేటు రూ. 7,717. దేశంలో ప్రధానంగా పత్తి పండించే మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఏపీల సూచనల్ని తుంగలో తొక్కి వ్యవసాయ వ్యయ ధరల సంఘం (సీఏసీపీ) అడ్డగోలుగా ఖరారు చేసిన కనీస మద్దతు (రూ.4,320), క్వింటా పత్తిసాగు వ్యయం (రూ. 5,042) కన్నా తక్కువ! ఒకసారంటూ 'మద్దతు' నిర్ధారణ జరిగాక, భారతీయ పత్తి సంస్థ ఆ మేరకు విరివిగా కొనుగోళ్లు చేపట్టాల్సి ఉంటుంది. తగినన్ని కొనుగోలు కేంద్రాలు నెలకొల్ప డంలో సీసీఐ అలసత్వం, విపణి తోడేళ్లకు అయాచిత వరమవుతోంది. పంట విక్రయాల సందర్భంగా గుమాస్తా రుసుములు, ఇతరత్రా వసూళ్ల ప్రసక్తే తలెత్తరాదన్న అమాత్యుల హెచ్చరికలు చెల్లని కాసులవుతున్నాయి. మార్కెట్లను గుప్పిట పట్టి ఇష్టారాజ్యంగా చలాయించుకుంటున్న వ్యాపారులు, దళారుల ధాటికి రైతు ప్రయోజనాలు తెగటారుతున్నాయి!ముప్పై ఏళ్ల క్రితం వరకు ఇండియా ప్రతి సంవత్సరం పది లక్షల బేళ్ల (ఒక బేలు 170 కిలోలు) మేర పొడుగు పింజరకం పత్తిని విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దేశంలో మూడు కోట్ల ఎకరాలకు విస్తరించిన పత్తిసాగు, ఆ పరాధీనతకు చెల్లు కొట్టినప్పటికీ- సరైన మార్గనిర్దేశకత్వం కొరవడి రైతుల బతుకులు చిత్తవుతున్నాయి. వేలంవెర్రిగా ఒకే పంటను నమ్ముకుని లక్షలాది రైతులు, వారి సంబంధీకులు మునిగిపోయే ఘట్టాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలే బాధ్యతాయుత పాత్రను సమర్థంగా పోషించాల్సి ఉంది. ఎరువులు, పురుగుమందుల వాడకంలో రైతులకు మెలకువలు నేర్పి చైనా, ఇండొనేసియా, స్వీడన్ ప్రభృత దేశాలు దిగుబడుల్లో వృద్ధిని నమోదు చేస్తున్నాయి. భూసారం, నీటి లభ్యతల ప్రాతిపదికన అక్కడ పంటల ప్రణాళికలు పదును తేలుతున్నాయి. సంప్రదాయ విత్తులకన్నా 30రెట్లు ధర అధికమైన బీటీ పత్తి రకాలు దిగనాసి దిగుబడులే ఇస్తున్నట్లు ధ్రువీకరిం చుకున్న బుర్కినా ఫాసో లాంటి చిన్న దేశం, తిరిగి పాత దారికే మళ్ళింది. భౌగోళికంగా, జనాభా రీత్యా సువిశాలమైన భారతావనీ 'సస్య విప్లవ జాతీయ వ్యూహం'తో అద్భుతాలు సృష్టించగల వీలుంది. దేశంలో అపరాలకు, వంటనూనెలకు గిరాకీ ఏటా విస్తరిస్తున్న కారణంగా- ఆహార దిగుమతుల బిల్లు ఇంతలంతలవుతోంది. ప్రపంచంలో అమెరికా తరవాత అత్యధికంగా 35 కోట్ల ఎకరాల సాగుభూములు కలిగిన భారత్టాంజానియా, మియన్మాలాంటి దేశాలనుంచి పప్పుగింజల దిగుమతులకు వెంపర్లాడాల్సి రావడం జాతికే తలవంపులు.
తెల బంగారానికి తెగులు