దేశంలో పాడి రైతుల పరిసితి అగమ్యగోచరంగా ఉంది. పాల ఉతుతి పెరిగే వర్షకాలం, శీతకాలంలో పాల ధర తగ్గించేసి డెయిరీలు రైతులను దెబ్బ తీసున్నాయి. పాల ఉత్పతి గణనీయంగా తగే వేసవి సీజన్లో పాలపొడితో పాలను తయారుచేసి ప్రజలకు విక్రయిసున్నాయి. గత రెండేళ్లలో రైతుల నుంచి కొనే పాల లీటరు ఉత్తర భారత రాష్ట్రాల్లో సగటు ధర 20 శాతం వరకూ తగ్గింది. పాలు అధికంగా వచ్చే సమయంలో దానితో పొడి తయారుచేసి డెయిరీలు నిల్వ చేస్తున్నాయి. సహకార డెయిరీలు నిధుల కొరతతో అభివృద్ధికి దూరంగా సతమతమవుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల విపణి కళ్లముందే ఉన్నా దాన్ని అందుకోలేని దుస్థితి. ఆపై ఉన్నవాటి బాగుకు తక్షణ కార్యాచరణా కానరావడం లేదు. 'ఆపరేషన్ ఫ్లడ్' పథకం కింద రూ. 10,881 కోట్లతో డెయిరీ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. మూడేళ్లలోగా వీటిని ఖర్చు చేసి కొత్త పాలశుద్ధి కేంద్రాలు విరివిగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాది పూర్తవుతున్నా ఇంతవరకూ ఒక్క కేంద్రమూ కొత్తగా ఏర్పాటుకాలేదు. పది లక్షల లీటర్ల పాల శుద్ది ప్లాంటు ఏర్పాటు చేయాలని తెలంగాణలో కొన్నేళ్లుగా డిమాండు ఉన్నా ఇంకా పునాదిరాయే పడలేదు. ప్రైవేటు డెయిరీలు ఏటా శీతకాలంలో పాల ఉత్పత్తి పెరగ్గానే కొనుగోలు ధర తగ్గించేయడం, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడం వల్ల పాడి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పాడి రైతులకు తప్పనిసరి ఆదాయం పెంపుపై ఎలాంటి పూచీకత్తు ఎవరూ ఇవ్వనందువల్ల పాడి పశువులను వదిలించుకునే రైతుల సంఖ్య పెరుగుతోంది. పెద్ద ప్రైవేటు డెయిరీల వ్యాపార వ్యూహాలకు చిన్నచిన్న డెయిరీలు చితికిపోయి అప్పులపాలవుతున్నారు. దేశంలో పాల వ్యాపారం అత్యధిక శాతం ఎక్కువగా అసంఘటిత రంగంలో ఉన్నందువల్ల భారత భారత రైతులకు ఆదాయం పెరిగే అవకాశాలు స్థిరంగా ఉండటం లేదు. గత రెండేళ్లలో పాల పొడి నిల్వలు పెరగడంతో ధర సైతం ఏకంగా 37 శాతం తగ్గింది. కిలో పొడి టోకు ధర దేశీయ విపణిలో 2016 జనవరిలో రూ. 265 ఉంటే గత నెలలో రూ. 147కు పడిపోయిందని ' జాతీయ పాడి పరిశ్రమాభివ ద్ధి సమాఖ్య (ఎ డీడీబీ) వెల్లడించింది. నిరుడు మలి అర్ధభాగం (2107 జూన్-డిసెంబరు) మధ్యకాలంలో పాల విక్రయ దరలు పలు రాపాలో గణనీయంగా తగడంతో రైతులు ఇబ్బందులు పాలయ్యారు. ఈ కాలవ్యవధిలో రోజుకు 40 లక్షల టన్నుల పాలు అధికంగా విపణికి రావడమే ధరల పతనానికి కారణం. పాలు వెల్లువలా రావడంతో డెయిరీల రోజూవారీ సేకరణ ఏకంగా 26 శాతం అదనంగా పెరిగింది. కానీ మార్కెట్లో విక్రయాలకన్నా 36 శాతం పాలు అధికంగా రైతులు తీసుకురావడం వల్ల వాటిని గత్యంతరం లేక పాలపొడిగా మార్చుతున్నట్లు సహకార పాల డెయిరీలు సమాఖ్యకు నివేదించాయి. దేశవ్యాప్తంగా సహకార డెయిరీల రోజూవారీ పాల విక్రయాలు 3.38 కోట్ల కిలోలు కాగా, కొనుగోలు 5.35 కోట్ల కిలోలకు చేరడం వల్ల పాలపొడి మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సహకార డెయిరీలో పాలపొడి నిల్వలు ఏకంగా రెండు లక్షల టన్నులు దాటవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 2017లో 83.30 కోట్ల టన్నుల పాల ఉత్పత్తిలో ఆసియా దేశాల వాటా 41 శాతం ఉంది. రోజుకు 16.40 కోట్ల టన్నుల పాలతో భారతదేశం అగ్రస్థానానికి చేరింది. తూర్పు ఆయ, చైనా సహా పలు దేశాల్లో పాల కొంత ఉంది. 1995-2006 మధ్యకాలంలో పాల ఉత్పత్తి ప్రపంచ వార్షిక వృద్ధిరేటు మూడు శాతానికి చేరగా, తరవాత అది క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం ఒక శాతానికి పడింది. దేశాలవారీగా చూస్తే పాల ఉత్పత్తిలో చాలా అంతరముంది. ఉదాహరణకు తెలంగాణ అంత కూడా లేని న్యూజిలాండ్ లాంటి అతి చిన్న దేశం అక్కడి ప్రజల అవసరాలతో పోలిస్తే 311 శాతం అధికంగా పాలను ఉత్పత్తి చేసి ప్రపంచ విపణిలోకి వదులుతోంది. ఐరోపా సమాఖ్య సైతం తమ అవసరాలకన్నా 12 శాతం అధికంగా ఉత్పత్తి చేస్తోంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే అవసరాలకన్నా తక్కువగా పాలు లభిస్తున్నాయి. 2010-16 మధ్యకాలంలో ఆసియా దేశాల్లో పాల ఉత్పత్తి 93 నుంచి 91 శాతానికి తగ్గింది. అంటే ప్రజల అవసరాలకన్నా తొమ్మిది శాతం తక్కువగా పాలు ఇక్కడ లభిస్తున్నాయి. ఇది న్యూజిలాండ్, ఐరోపా దేశాలకు ఆదాయాన్ని సృష్టించే విపణిగా మారుతోంది. భారతదేశానికి సమీపంలోని పలు ఆసియా దేశాలకు న్యూజిలాండ్ పాలు, పాల ఉత్పత్తులు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. అవే పాలు భారత్ లో ఉత్పత్తి అయితే అక్కడికన్నా తక్కువ ధరకే ఈ దేశాలకు అమ్మి భారత రైతులకు ఆదాయాన్ని పెంచవచ్చు. ప్రపంచ పాల విపణిలో 1.5 శాతం అంటే ఏటా 1.20 కోట్ల టన్నుల పాల కొరతకు సమానం. ప్రపంచ మార్కెట్ లోకి అత్యధికంగా పాలను ఎగుమతి చేస్తున్న అయిదు అగ్ర దేశాల్లో పాల ఉత్పత్తి పెరగకపోవడమూ ఆందోళన రేకెత్తించే అంశం. ఇక ప్రజల పాల కొరత ఎవరు తీరుస్తారన్నది ఇప్పుడు ప్రపంచ పాడి పరిశ్రమ వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. 20 వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. 2025 నాటికి భారతదేశంలో పాల ఉత్పత్తి గణనియంగా గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ పాల విపణి ఆశగా పెరుగుతుందని ప్రపంచ పాల విపణి ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచంలో అత్యంత తక్కువ ధరకు పాలను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్ముకునేది భారత రైతులే కావడం అందుకు కారణం! కెనడా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో లీటరు ఉత్పత్తి వ్యయం రూ. 60 కెనడా, బ్రిటన్, జపాన్ లాంటి దేశాల్లో లీటరు ఉత్పత్తి వ్యయం రూ. 60 దాటుతుంటే ఇండియాలో రూ.30 నుంచి రూ.40కే రైతులు విక్రయిస్తున్నారు. ప్రపంచ జనాభా, పాల గిరాకీ నికరంగా పెరుగుతున్నందువల్ల విపణి అవకాశాలు సైతం ఎప్పుడూ అధికమవుతాయని అంచనా. భారత్ చుట్టుపక్కల దేశాలన్నీ పాల ఉత్పత్తులను దిగుమతి చేసే స్థాయిలో ఉన్నందువల్ల ఇక్కడి రైతులకు మంచి మార్కెట్ అందుబాటులో ఉంది. ఉదాహరణకు చైనా ప్రజల అవసరమైన పాలలో 16 శాతం వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కానీ మనదేశానికి ఇప్పటివరకూ అలాంటి పరిస్థితి రాలేదు. శ్రీలంక సైతం 57 శాతం పాలను దిగుమతి చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్రామస్థాయి డెయిరీలను నడపలేక మూసేస్తున్నారు. విద్యావంతులు ఆసక్తిగా అప్పులు తెచ్చి చిన్న డెయిరీలు పెట్టినా తట్టుకోలేక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. వారికి భరోసా ఇస్తే రైతుల ఆదాయం పెంచడానికి అందుబాటులో మార్కెట్ ఉంటుంది. భారత రైతుల ఆదాయాన్ని 2022 నాటికల్లా రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇందులో చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుని అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆదాయం పెంపు పరంగా పెద్దయెత్తున వ్యవసాయాభివృద్ధి పథకాలను కేంద్రం ప్రకటించడం మంచిదే. కానీ అందుకు అనుగుణంగా పాడి పరిశ్రమను సైతం సమాంతరంగా ప్రోత్సహిస్తేనే అన్నదాతకు ఆదాయం నికరంగా పెరుగుతుంది. 'పాడి - పంట' అనేది అనాదిగా ఉన్న నినాదం. ఇప్పుడు రైతులకు ఆదాయం అంటే పంట నుంచి మాత్రమేనన్నట్లుగా వ్యవసాయాభివృద్ధి పథకాలపైనే దృష్టి పెట్టడం సరికాదు. 'ఐరోపా సమాఖ్య వ్యవసాయ అవుట్ లుక్ - 2017' పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2030 నాటికి సార్క్, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, చైనా దేశాలు ఏటా 4.50 కోట్ల టన్నుల పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే స్థాయికి చేరతాయని అంచనా వేసింది. ఇదంతా భారత రైతుల ఆదాయం పెంచడానికి గల బంగారం లాంటి అవకాశమని విధాన కర్తలు గుర్తించాలి. పపంచ విపణిలో గిరాకీ పెరుగుతున్నందున అమెరికా, న్యూజిలాండ్, ఈయూ డెయిరీలు పాల వ్యాపారాన్ని విస్తృతం చేస్తున్నాయి. అదే తీరు భారత్ లో కానరావడం లేదు. ప్రస్తుతం అమెరికా, ఈయూ దేశాల డెయిరీల వల్ల 5.31 లక్షల టన్నుల పాలపొడి నిల్వలున్నాయి. అదే తీరులో భారత్ లోనూ రెండు లక్షల టన్నులకు చేరాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్ పొడి టోకు విక్రయ ధర 2013-17 మధ్యకాలంలో 5,563 డాలర్ల నుంచి 1725 డాలర్లకు తగ్గింది. పాల పొడి నిల్వలు పెరుగుతున్నాయంటే వాటితో పాలు తిరిగి తయారుచేయడానికి అవకాశాలు పెరిగినట్లు అర్థం. అంటే పరోక్షంగా పాల కొనుగోలు ధర పెరగడానికి అవకాశం ఉండదు. దీనివల్ల పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రైతులకు ఆదాయం పెరగక నష్టాలు తప్పవు. వారిని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, ప్రోత్సాహకాలతో ముందుకురావాల్సిన అవసరముంది. దేశంలో గుజరాత్, కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో సహకార డెయిరీలు అధ్వానంగా ఉండటం వల్ల రైతులకు, వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఈ డెయిరీల్లో 76 శాతం పాలశు శాతం పాలశుద్ధి ప్లాంట్లు అత్యంత పురాతనమైనవి. మొత్తం 297 ప్లాంట్లలో కేవలం 24 శాతం పాలశుద్దికే ఆధునాతన యంత్రాలున్నాయి. సహకార డెయిరీలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధారాళంగా నిధులు ఇవ్వాలి. అది సాధ్యం కాకుంటే వడ్డీలేని రుణాలైనా ఇప్పించాలి. సహకార డెయిరీలను ప్రోత్సహిస్తే రైతులకు నికరంగా ఆదాయం పెంచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన పాలను అందించడానికి మంచి మార్గం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సహకార డెయిరీల మధ్య అనైక్యత వల్ల ప్రైవేటు డెయిరీలు ఆడింది ఆటగా సాగుతోంది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్య పరచి పాలశుద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు విరివిగా ప్రోత్సహిస్తే రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. దేశంలో అమ్ముతున్న పాలలో 75 శాతం వరకూ కల్టీ, నాసిరకం అని గతంలోనే నిర్ధారణ అయింది. స్వచ్చమైన, నాణ్యమైన పాలు అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి పాలకులు పూచీకత్తు ఇవ్వాలి. ఇలాంటి కనీస అవసరాలపై దృష్టి పెట్టకుండా ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ అంటూ వేల కోట్ల రూపాయలు ఆస్పత్రులకు ఇస్తామంటూ ఇస్తామంటూ పథకాలు తేవడం వల్ల ప్రజల ఆరోగ్యం ఎంతకాలానికి బాగుచేయగలరన్నది ఆలోచించాలి!
పాడిపరిశ్రమకు మంచి రోజులు